పామును అల్లంత దూరం నుంచి చూస్తేనే ఒళ్లంతా ఝలదరిస్తుంది. అదే పాము పొరపాటున పక్కనే ఉంటే పై ప్రాణాలు పైనే పోతాయి. అయితే.. ఎంతటి భయంకరమైన, విషపూరితమైన సర్పాన్నైనా అలవోకగా దారిలోకి తెచ్చుకోగల స్నేక్ క్యాచర్స్ గురించి వినే ఉంటారు. కింగ్ కోబ్రాలను సైతం తమదైన శైలిలో పట్టుకుని అవి ఎవరికీ హాని తలపెట్టకుండా, వాటికి ఎవరూ హాని తలపెట్టకుండా స్నేక్ క్యాచర్స్ జనావాసాలకు దూరంగా అడవిలో వదిలేస్తుంటారు.
కేరళకు చెందిన వావా సురేష్ లాంటి పేరు పొందిన స్నేక్ క్యాచర్‌తో పాటు చాలామంది స్నేక్ క్యాచర్స్ కొన్ని వందల పాముల ప్రాణాలను కాపాడుతున్నారు. అయితే.. ఈ వృత్తి అంత సులభం ఏమీ కాదు. పొరపాటున ఆ పామును దారిలోకి తెచ్చుకునే క్రమంలో కాటు వేస్తే ప్రాణాలు కోల్పోక తప్పదు. అంత ముందు జాగ్రత్తలు తీసుకున్నా కొన్ని సందర్భాల్లో స్నేక్ క్యాచర్స్ పాము కాటుకు గురవుతుంటారు.
How not to rescue a snake. Especially if it’s a king cobra. Via @judedavid21 pic.twitter.com/yDJ5bLevQf
— Parveen Kaswan (@ParveenKaswan) September 7, 2021
కింగ్ కోబ్రా లాంటి పాముల కాటు వేస్తే ప్రాణాలపై ఆశలు వదిలేసుకోవాల్సిందే. అలాంటి కింగ్ కోబ్రా ఓ స్నేక్ క్యాచర్‌పై దాడి చేయబోయిన ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ స్నేక్ స్నాచర్ ఆ క్షణంలో అలర్ట్‌గా లేకపోయి ఉంటే కింగ్ కోబ్రా కాటుకు బలయ్యేవాడు. ఐఎఫ్‌ఎస్ అధికారి పర్వీన్ కశ్వాన్ ఆ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. ‘ఒక పామును ఎలా పట్టుకోకుడదో.. మరీ ముఖ్యంగా కింగ్ కోబ్రాను ఎలా అదుపులోకి తెచ్చుకోకూడదో’ ఈ వీడియో చూస్తే తెలుస్తుందని ఆయన ట్వీట్ చేశారు. కింగ్ కోబ్రాను అదుపులోకి తెచ్చుకునే విధానం ఇది కాదన్నట్టుగా ఆయన ట్వీట్‌లో అభిప్రాయపడ్డారు.
ఆ వీడియోను ఒక్కసారి పరిశీలిస్తే.. ఓ భారీ కింగ్ కోబ్రా ఓ గదిలో చొరబడింది. తోక భాగం ఆ గదికి బయట పక్క ఉంది. ఆ తోకను పట్టుకుని ఆ కింగ్ కోబ్రాను అదుపులోకి తెచ్చుకునేందుకు స్నేక్ క్యాచర్ ప్రయత్నించాడు. తోక పట్టుకోగా.. ఒక్కసారిగా ఆ కింగ్ కోబ్రా గదిలో నుంచి పడగ విప్పుతూ సర్రున గదిలో నుంచి బయటకొచ్చి ఆ స్నేక్ క్యాచర్ ఎదురు ‘ఏంటి నీ ప్రాబ్లం’ అన్నట్టుగా నిల్చుంది. ఆ స్నేక్ క్యాచర్ వెంటనే అలర్ట్ అయి దూరంగా జరగడంతో ప్రమాదం తప్పింది. లేకపోతే ఆ కింగ్ కోబ్రా కాటుకు ఆ స్నేక్ క్యాచర్ బలయిపోయేవాడు. ఈ వీడియో చూసిన వాళ్లంతా ఒక్క క్షణం వణుకొచ్చేసిందని.. ఇలాంటి వీడియోను జీవితంలో చూడలేదని.. ఆ స్నేక్ క్యాచర్ అదృష్టవంతుడని కామెంట్ చేస్తున్నారు. ఆ ఒక్క సెకను ఆ స్నేక్ క్యాచర్ చావును దగ్గర నుంచి చూశాడనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ వీడియోను మీరూ చూసేయండి..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Snake, Snakes, Trending news, Trending videos, VIRAL NEWS, Viral Video