Home /News /trending /

Video: తాళి కట్టు శుభవేళ.. బోరున ఏడ్చిన వధువు.. ఎందుకంటే...

Video: తాళి కట్టు శుభవేళ.. బోరున ఏడ్చిన వధువు.. ఎందుకంటే...

Video: తాళి కట్టు శుభవేళ.. బోరున ఏడ్చిన వధువు.. (image credit - instagram)

Video: తాళి కట్టు శుభవేళ.. బోరున ఏడ్చిన వధువు.. (image credit - instagram)

Viral Video: సినిమాల్లో ఇష్టం లేని పెళ్లి చేస్తుంటే... హీరోయిన్ లోలోపల ఏడుస్తూ ఉంటుంది. ఆ పెళ్లి జరగకూడదని ప్రేక్షకులు కోరుకుంటారు. మరి ఈ స్టోరీలో ఏం జరిగింది? ఆమె ఎందుకు ఏడ్చింది?

  పెళ్లి అనేది ఎవరికైనా కొత్త జీవితానికి ప్రారంభం. అప్పటివరకూ వేరువేరుగా ఉన్న రెండు మనసులు... ఆ తర్వాత కలిసి సాగించబోయే సుదీర్ఘ ప్రయాణానికి పెళ్లి తొలిమెట్టు. అందుకే ఆ పెళ్లికి వధూవరులతోపాటూ... రెండువైపుల ఫ్యామిలీల వారూ ఎంతో ప్రాధాన్యం ఇస్తారు. వీలైనంతవరకూ మ్యారేజ్ (Marriage celebration) గ్రాండ్‌గా జరిపేందుకు ప్రయత్నిస్తారు. ముఖ్యంగా వధువు వేసుకునే డ్రెస్, నగలు అన్నీ ప్రత్యేకంగా డిజైన్ చేయిస్తారు. అందువల్ల పెళ్లి కూతురు ముఖంలో ఎక్కడ లేని ఆనందం ఉంటుంది. ఇక తాళి కట్టు శుభవేళ... ఆ తాళిని చూసుకొని ఎంతో మురిసిపోతుంది. ఆ ఆనంద దృశ్యాలు పెళ్లి వీడియో (Marriage video)లో కళ్లకు కట్టినట్లు కనిపిస్తాయి. అలాంటిది ఈ పెళ్లిలో మాత్రం సరిగ్గా తాళి కడుతున్న సమయంలో... వధువు కన్నీటి సంద్రం (Bride crying) అయ్యింది. బోరున ఏడ్చేసింది. అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకు ఏడుస్తోంది... అని రకరకాల డౌట్లు. అంతలోనే భర్త ఆమెను ఓదార్చడంతో... తిరిగి ఆమె ముఖంలో నవ్వులు పూశాయి.

  నిజానికి ఇక్కడ వధువు ఏడవలేదు. అవి ఆనంద భాష్పాలు. ఆమె భావోద్వేగం చెందింది. తన పెళ్లి కోసం ఇలా చుట్టూ ఎంతో మంది వచ్చి... తనను ఆశీర్వదిస్తూ... ఉండటంతో.... ఎంతో ఆనందపడింది. తన మెడలో మంగళసూత్రం చూడగానే హెవీ ఎమోషనల్ అయిపోవడంతో... కన్నీళ్లు వచ్చేశాయి.

  ఆ వీడియో ఇక్కడ చూడండి  పెళ్లి విషయంలో పెద్దలు ఎలాగైతే ఎన్నో ఆలోచిస్తారో... అమ్మాయిలు, అబ్బాయిలు కూడా అలాగే ఆలోచించుకుంటారు. తనను ఎవరు చేసుకుంటారు, ఎలాంటి భార్య లేక భర్త వస్తుంది... నాతో ఎలా ఉంటుంది... నా ఆలోచనలకు తగినట్లు ఉంటే బాగుండు అని ఇలా ఎన్నో ఆశలుంటాయి. ఆ ఘడియలు వాస్తవ రూపు దాల్చే సమయంలో... మనసంతా సంతోషంతో నిండిపోతుంది. అలాంటి సమయంలో... ఆనంద భాష్పాలు వస్తే... ఏడ్చేయాలే తప్ప దాచుకోకూడదు. ఇక్కడ వధువు అలా ఏడ్చేయడంతో... ఇక ఆమెలో భారం దిగిపోయింది. వెంటనే నవ్వు వచ్చేసింది.

  ఇది కూడా చదవండి: Photos: జూనియర్ యోగి.. యూపీ సీఎంని దించేశాడుగా!

  ఈ వీడియో ప్రతి ఒక్కరి మనసునూ కదిలిస్తోంది. కొందరు తమ పెళ్లి ఘట్టాన్ని గుర్తుచేసుకుంటున్నారు. రకరకాల కామెంట్లు రాస్తున్నారు.
  Published by:Krishna Kumar N
  First published:

  Tags: Viral, VIRAL NEWS, Viral Video, Wedding

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు