Viral Video: ఇలా చేశాడేంటి.. అతడి చర్యతో కంగుతిన్న అతిథులు.. ఏం జరిగిందో చూడండి..

(Image-Instagram)

మనదేశంలో పెళ్లి వేడుకల్లో సంప్రదాయాలకు చాలా విలువ ఇస్తారు. పలు రాష్ట్రాల్లో పెళ్లి వేడుకలకు సంబందించిన పలు రకాల సంప్రదాయాలు చూస్తునే ఉంటాం.

  • Share this:
    దేశంలో పలు రకాల వివాహ సంప్రదాయాలు కనిపిస్తాయి. పలు రాష్ట్రాల్లో పెళ్లి వేడుకలకు సంబందించిన పలు రకాల సంప్రదాయాలు చూస్తునే ఉంటాం. మనదేశంలో పెళ్లి వేడుకల్లో సంప్రదాయాలకు చాలా విలువ ఇస్తారు. పెళ్లి వేడుకల్లో చోటుచేసుకునే కొన్ని ఘటనలు.. సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారుతుంటాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెటింట్లో హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియోలో వధువుపై ఆమె సోదరుడు దాడి చేస్తాడు. ఆమెను బలంగా కొట్టడం ప్రారంభించాడు. దీంతో అక్కడున్నవారు అతన్ని పక్కకు తీసుకెళ్లాడు. అయితే అతడు ఎందుకలా చేశాడనే దానిపై క్లారిటీ లేదు.

    ఈ వీడియోలో అతిథులు ధరించిన దుస్తులు గమనిస్తే.. ఈ పెళ్లి రాజస్థాన్ లేదా హర్యానాలో జరిగినట్టుగా కనిపిస్తోంది. rajnesh_meena_083 అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియోను షేర్ చేశారు. తొలుత వీడియోలో వధువు, ఆమె సోదరుడు ఆచారం ప్రకారం ఒకరినొకరు కొట్టుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. అయితే అంతలోనే వధువు సోదరుడు.. ఆమెపై దాడి చేస్తాడు. ఇది చూసిన ఓ మహిళ తొలుత వారివద్దకు వస్తుంది. అనంతరం ఓ వ్యక్తి వధువు సోదరుడిని పక్కకు తీసుకుని వెళ్తాడు.






    ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటివరకు ఈ వీడియోను 43 మిలియన్ల మంది వీక్షించారు. 1.5 మిలియన్ల లైక్స్ కూడా వచ్చాయి.
    Published by:Sumanth Kanukula
    First published: