Home /News /trending /

VIRAL VIDEO BRIDE AND GROOMS FRIENDS BRING BOTTLES OF PETROL DIESEL AS GIFTS AMID SOARING PRICES PAH

Viral video: కొత్త జంటకు స్నేహితుల షాక్.. పెళ్లిలో ఏకంగా అందరి ముందే దాన్ని గిఫ్ట్  గా ఇచ్చారు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Wedding Video:పెళ్లి వేడుకలో అతిథులు, స్నేహితులు కొత్త జంటకు వెరైటీ గిఫ్ట్ లు ఇస్తుంటారు. కొందరు బంగారం ఇస్తే.. మరికొందరు.. కిచెన్ వేర్ ఐటమ్స్ వంటి రకారకాల బహుమతులు ఇస్తుంటారు. ప్రస్తుతం యువత..కాస్త ట్రెండీగా ఆలోచిస్తున్నారు.

Grooms Friends Bring Bottles of Petrol Diesel as Gifts: సాధారణంగా పెళ్లి వేడుకను ప్రతి ఒక్కరు ఎంత గొప్పగా జరుపుకుంటారు. పెళ్లి కి సంబంధించి ప్రతి ఒక్క వేడుక జీవితాంతం గుర్తుండి పోయాలా నిర్వహిస్తారు. ప్రివేడ్డింగ్ షూట్ నుంచి అప్పగింతల వరకు ప్రతి వేడుక గొప్పగా ఉండేలా ప్లాన్ లు వేస్తుంటారు. దీని కోసం పెళ్లి వేడుకలు నిర్వహించే వారిని సంప్రదిస్తారు. ఎంతటి ఖర్చుచేయడానికైన వెనుకాడరు.  సోషల్ మీడియాలో పెళ్లి వేడుకలకు సంబంధించిన కంటెంట్ విపరీతంగా వైరల్ అవుతుంది.

పెళ్లిలో జరిగే ఫన్నీ సంఘటనలు, చిలిపి చేష్టలతో ఆ వివాహా వేడుకలు వైరల్ అవుతున్నాయి. ఇలాంటి ఎన్నో వీడియోలు ఇది వరకే వైరల్ అయ్యాయి. ఇక పెళ్లిలో కొంత మంది రకారకాల గిఫ్ట్ లు ఇస్తుంటారు . నూతన వధువరులను ఆటపట్టించేందుకు వెరైటీ బహుమతులను ఇస్తుంటారు. గతంలో టమాట ధరలు, ఉల్లిపాయల ధరలు మండిపోయాయి. ఆ సీజన్ లో జరిగిన పెళ్లిళ్లకు సరదాగా మిత్రులు.. టమాటాలను, ఉల్లిపాయలను బహుమతులుగా ఇచ్చిన అనేక సంఘటనలు వైరల్ అయ్యాయి.

ప్రస్తుతం దేశంలో పెట్రోల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇప్పటికే సెంచరీ దాటేశాయి. ఇక కేవలం 16 రోజులలోనే 14 సార్లు పెట్రోల్ ధరలు పెరిగాయి. కొంత మంది మధ్య తరగతి ప్రజలు.. తమ వాహానాలను బయటకు తీయాలంటేనే భయంతో వణికి పోతున్నారు. ప్రస్తుతం పెట్రోల్ రేటు 150 కి చేరువలో ప్రయాణిస్తుంది. ఈ క్రమంలో ఒక నూతన జంటకు వెరైటీగా గిఫ్ట్ ఇవ్వాలని వారి స్నేహితులు ప్లాన్ వేశారు. పెళ్లి వేడుక వైభవంగా ముగిసింది.

ముగ్గురు స్నేహితులు.. వెరైటీగా కొత్త జంటకు రెండు బాటిళ్లను బహుమతులుగా ఇచ్చారు. వాటిలో ఒకదాని నిండా ఉన్న పెట్రోల్, మరో బాటిల్ లో డీజిల్ నింపి ఇచ్చారు. రెండు బాటిల్స్ లను బహుమతులుగా ఇచ్చారు. దీన్ని చూడగానే కొత్త జంట ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ తర్వాత.. సరదాగా నవ్వుకున్నారు. పెళ్లికి హజరైన అతిథులు కూడా సరదాగా నవ్వుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
Published by:Paresh Inamdar
First published:

Tags: Viral Video, Wedding

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు