Wedding video: పెళ్లి వేడుకకు సంబంధించిన వీడియోలకు సోషల్ మీడియాలో ఏమాత్రం కొదువలేదు. ప్రతి రోజు వెరైటీ పెళ్లి వేడుకలు, ఫన్నీ సంఘటనలతో ఆ పెళ్లిళ్లు వైరల్ అవుతున్నాయి.
Bride and Groom Slap Each Other in wedding: ప్రస్తుతం అనేక చోట్ల పెళ్లి వేడుకలు జోరుగా సాగుతున్నాయి. ప్రస్తుతం ట్రెండ్ గా మారింది. పెళ్లి వేడుక ఒకప్పట్లా.. సాదా సీదలా జరగటం లేదు. ప్రతి ఒక్కరు కూడా తమ వివాహవేడుకను తమకు ఉన్నంతలో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. దీనికోసం కొందరు ఈవెంట్ ఆర్గనైజర్స్ లను సంప్రదిస్తుంటే.. మరికొందరు సింపుల్ గా కూడా చేసుకుంటున్నారు. ప్రధానంగా నేటి యువత పెళ్లిళ్లపై (wedding celebrations) డబ్బులను విచ్చల విడిగా ఖర్చుపెడుతున్నారు. కొందరు ప్రీవెడ్డింగ్ షూట్ అని, హల్దీ, మెహాందీ పలు కార్యక్రమాలను గ్రాండ్ గా చేసుకుంటున్నారు.
ఇప్పటికే పెళ్లి వేడుకలు సంబంధించిన అనేక వీడియోలు వైరల్ గా (Viral video) మారాయి. మరీ పెళ్లిలో అనుకొకుండా జరుగుతాయో.. ప్లాన్ ప్రకారం పబ్లిసిటీ కోసం చేస్తారో గానీ పెళ్లికి సంబంధించిన అనేక వీడియోలు ఇప్పటికే వైరల్ గా మారాయి. నెటిజన్లు కూడా ఇలాంటి వీడియోలను చూడటానికి ఇంట్రెస్ట్ చూయిస్తుంటారు. ఈ కోవకు చెందిన మరో పెళ్లి వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.
పూర్తి వివరాలు.. పెళ్లిలో బంధువులు,స్నేహితులు ఉల్లాసంగా పాల్గొంటారు. వీరంతా కొత్త బంధువులను ఆశీర్వదిస్తారు. పెళ్లిని (marriage videos) వధువరులు గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు. కొన్ని సార్లు, పెళ్లిలో ఎమోషనల్(wedding emotional Videos) సన్నివేశాలు, షాకింగ్ ఘటనలు కూడా జరుగుతాయి. ప్రస్తుతం ఈ పెళ్లిలో వరుడు, వధువు పెళ్లి తంతు కొనసాగుతుంది. అప్పుడు వధువు, వరుడికి స్వీట్ తినిపించడం కోసం ప్రయత్నిస్తుంది. కానీ వరుడు మాత్రం కేవలం ఫోటో గ్రాఫర్ వైపు చూస్తుంటాడు.వధువుని పట్టించుకోడు. ఇంతలో వధువుకి చిర్రెత్తు కొస్తుంది. వెంటనే తన చేతిలోని స్వీట్ ను వరుడి మోహానికి కోపంతో రాస్తుంది. ఇక మనోడు కూడా ఏమాత్రం తగ్గకుండా వధువుని లాగిపెట్టి ఒక్కటిస్తాడు. దీంతో వధువు వరుడిని తిరిగి కొడుతుంది. ఇలా ఒకరిపై మరోకరు చేయిచేసుకుంటారు. దీంతో అక్కడి వారంతా షాకింగ్ కు గురౌతారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ (Viral video) గా మారింది.
Published by:Paresh Inamdar
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.