Home /News /trending /

VIRAL VIDEO BRIDE AND GROOM BREAK INTO INTENSE FIGHT ON BIG DAY INTERNET ASKS WHAT ON EARTH IS HAPPENING PAH

వీళ్ల ఆత్రం పాడుగాను... ఏకంగా పెళ్లిలోనే అందరిముందే మొదలెట్టేశారుగా.. ఫన్నీ వీడియో వైరల్..

పెళ్లివేడుకలో కొత్త జంట హల్ చల్

పెళ్లివేడుకలో కొత్త జంట హల్ చల్

Viral Video: మండపంలో పెళ్లి వేడుక గ్రాండ్ గా జరుగుతుంది. ఇంతలో కొత్త జంట ఒకరి నోట్లో మరోకరు ప్లేట్ లోని తీపి పదార్థాలు తినిపించుకుంటున్నారు. అప్పుడు జరిగిన సంఘటన అక్కడున్న వారిని షాకింగ్ కు గురిచేసింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Uttar Pradesh, India
పెళ్లిళ్ల (Wedding) సీజన్ నడుస్తోంది. ప్రతి ఒక్కరు తమ పెళ్లిని గ్రాండ్ గా చేసుకుంటున్నారు. ఒకప్పటి లాగా సాదా,సీదాగా చేసుకొవడానికి ఇంట్రెస్ట్ చూయించడం లేదు. స్నేహితుల మధ్య హల్ చల్ , డీజేల హోరు, ప్రీవెడ్డింగ్ నుంచి అప్పగింతల వరకు ప్రతివేడుక ఎంతో గ్రాండ్ గా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. దీనికోసం పెళ్లి వేడుకలు నిర్వహించే ఆర్గనైజర్ లను సంప్రదిస్తున్నారు. ఎంతటి ఖర్చుకైన వెనుకాడం లేదు. అయితే.. ప్రస్తుతం అనేక పెళ్లి వేడుకలు వైరల్ గా (viral video)  మారుతున్నాయి. కొన్నివెరైటీగా ఉంటే.. మరికొన్ని షాకింగ్ కు గురిచేసేలా ఉంటున్నాయి. కొన్ని సార్లు... పబ్లిసిటీ కోసమో.. మరేంటో కానీ.. పెళ్లిలో వెరైటీ సంఘటనలు జరిగి అవి కాస్త వైరల్ గా మారుతున్నారు. ఇప్పటికే అనేక పెళ్లిళ్లు వార్తలలో నిలిచాయి. తాజాగా, మరో పెళ్లి వేడుక సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పూర్తి వివరాలు.. పెళ్లి వేడుక గ్రాండ్ గా జరుగుతుంది. కొత్త జంట అదిరిపోయే కాస్టూమ్ వేసుకున్నారు. ఇద్దరు కూడా కుంకుమ రంగులో మ్యాచింగ్ వస్త్రాలు ధరించారు. అతిథులు, బంధువులు, స్నేహితులు పెద్ద ఎత్తున హజరయ్యారు. అప్పుడు కొత్త జంట ఒకరి నోటిలో మరోకరు తీపి పదార్థాలను తినిపించుకుంటున్నారు. అప్పుడు షాకింగ్ ఘటన జరిగింది. వరుడి నోట్లో వధువు.. ప్లేట్ లో ఉన్న స్వీట్ పెట్టడానికి ట్రై చేసింది. కానీ దీనికి వరుడు నిరాకరించాడు. ఆమెకు అందకుండా దూరంగా జరిగాడు.






దీంతో వధువు చిర్రెత్తుకొచ్చింది. అతని మీద పడి మరీ తినిపించడానికి ట్రైచేసింది. దీంతో ఇద్దరు ఒకరిని మరోకరు తోసుకుంటున్నారు. సరదాగా చేసిన పనికాస్త.. కొత్త జంట కొట్టుకొవడం వరకు వెళ్లింది. అక్కడ ఉన్న వారు.. ఆపడానికి ప్రయత్నించినప్పటికి ఎవరు తగ్గడంలేదు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో వివరాలు లేవు. ప్రస్తుతం ఈ వీడియో మాత్రం వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. అవాక్కవుతున్నారు.. మరికొందరు.. ఇదేందిరా నాయన అంటూ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.
Published by:Paresh Inamdar
First published:

Tags: Marriage, Viral Video, Wedding

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు