• HOME
  • »
  • NEWS
  • »
  • TRENDING
  • »
  • VIRAL VIDEO BRAZILIAN BRAVE NURSE HEROICALLY FIGHTS OFF INTRUDER WHO WAS WATCHING HER DANCE NK

Viral Video: రేప్ చేయబోయాడు.. తరిమి తరిమి తన్నిన నర్స్

Viral Video: రేప్ చేయబోయాడు.. తరిమి తరిమి తన్నిన నర్స్

రేప్ చేయబోయాడు.. తరిమి తరిమి తన్నిన నర్స్ (image credit - youtube)

Viral Video: మహిళలు ఒంటరిగా కనిపిస్తే చాలు... అఘాయిత్యానికి తెగబడుతుంటారు దుర్మార్గులు. అలాంటి ఓ కేటుగాడికి ఆ నర్సు ఇచ్చిన షాక్ మామూలుగా లేదు. వీడియో చూసి తీరాల్సిందే.

  • Share this:
    Viral Video: మహిళలకు ప్రేరణ కలిగించే ఈ ఘటన బ్రెజిల్‌లో జరిగింది. ఇందులో ఓ ట్విస్ట్ ఉంది. అది చివర్లో చెప్పుకుందాం. మేటరేంటంటే... నర్సు ఏంజెలా గోంకాల్వ్స్ పరానాగ్వాలో నివసిస్తోంది. తన ఇంట్లో డాన్స్ చేస్తూ... ఓ వీడియో షూచ్ చేసుకుంటోంది. అంతలో ఓ కుర్రాడు ఆ సందు గుండా వచ్చాడు. బయటి నుంచి నర్సును చూశాడు. ఒంటరిగా ఉంది అనుకున్నాడు. బల్లిలా మెల్లగా వచ్చాడు. గ్లాస్ డోర్ తీశాడు. సడెన్‌గా వెనక్కి తిరిగిన నర్సు... అతనెవరో... ఎందుకొచ్చాడో అనుకుంది. అంతలోనే... వివరాలు కనుక్కునేలోపే... ఆమె దగ్గరకు వచ్చి... మీద పడబోయాడు. అంతే... ఆమె ఒక్కక్షణంలో అరివీర భయంకరిణిలా మారింది. రేయ్ అని ఆ వ్యక్తిని ఎగిరెగిరి తన్నింది. అతను పారిపోతుంటే... తరిమి తరిమి మరీ కాళ్లతో తన్నింది.

    ఆమె అలా కరాటే కిక్స్ ఇవ్వడంతో... ఆ వచ్చిన వ్యక్తికి షాకుల మీద షాకులు తగిలాయి. లేడీస్‌తో పెట్టుకుంటే ఎలా ఉంటుందో అతనికి తెలిసొచ్చింది. వీడియో చూడండి.

    ఇదంతా అయ్యాక... ఆమె ఆ వీడియోను ఫేస్‌బుక్‌లో షేర్ చేశారు. మొదట ఉలిక్కిపడిన ఆమె... వెంటనే అతన్ని చూసి... తెలిసిన వాడే కదా అని చిన్నగా నవ్విందట. కానీ అతను తనను పట్టుకోవడానికి యత్నిస్తుంటే... అప్పటికప్పుడే తెగించినట్లు ఆమె తెలిపింది.

    బాధితురాలికి 11 ఏళ్ల కూతురు ఉంది. "అతను నా దగ్గరకు వస్తున్నప్పుడు... నా మనసులో వేల రకాల భయాలు, ఆందోళనలు... ఏమవుతుందో అని టెన్షన్" పడినట్లు ఆమె తెలిపారు.

    ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ప్రతి మహిళా ధైర్యం ఎదుర్కోవాలని ఆమె పిలుపు ఇచ్చారు. ఈ వీడియో.. ఫేస్ బుక్‌లో 15 లక్షల వ్యూస్ వచ్చాయి. ఈ ఘటనపై ఆమె పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. ప్రస్తుతం ఆ దుండగుడు చట్టుపక్కల ఎక్కడా లేడని తెలిసింది.

    ఇది కూడా చదవండి: Viral Video: ప్రాణాలకు తెగించి కుక్కను కాపాడింది... వీడియో చూసి మెచ్చుకుంటున్న నెటిజన్లు

    ట్విస్ట్ ఏంటంటే... ఆమె అతన్ని తంతున్నప్పుడు... తాను రాంగ్ అడ్రెస్‌కి వచ్చాననీ... తాను వేరే వాళ్ల కోసం వచ్చానని దుండగుడు నాటకాలు ఆడాడు. అయినా సరే... అతని ఎత్తుగడలు సాగనివ్వకుండా... గట్టిగా బదులివ్వడంపై నెటిజన్లు ఆమెకు తెగ లైక్స్ ఇస్తున్నారు.
    Published by:Krishna Kumar N
    First published:

    అగ్ర కథనాలు