Home /News /trending /

VIRAL VIDEO BOSTON DYNAMICS ROBOT DANCE ROBOTS SHAKE THEIR LEGS IS HOW WE ARE ENDING 2020 SU GH

Dancing Robots: డ్యాన్స్ మూవ్స్ తో ఇరగదీస్తున్న హ్యూమనాయిడ్స్

(Image-Youtube)

(Image-Youtube)

డ్యాన్సింగ్ రోబోట్స్ ఇప్పుడు సెన్సేషన్ సృష్టిస్తున్నాయి. ఇంటర్నెట్ లో వైరల్ గా మారిన డ్యాన్సింగ్ రోబో వీడియోలు పిల్లలను, పెద్దలను ఇట్టే ఆకర్షిస్తున్నాయి.

మనతో సమానంగా రోబోట్స్ కూడా డ్యాన్స్ చేస్తే ఎంత బావుటుందో కదా! ఈ ఊహకు ప్రాణం పోస్తున్నారు పలువురు పరిశోధకులు. ఫైటింగ్ చేసే రోబోలతో పాటు.. పాటకు తగ్గట్టు చిందులేసే రోబోలు ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తున్నాయి. దీన్ని ఇన్క్రెడిబుల్ ఇంజినీరింగ్ అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. బోస్టన్ డైనమిక్స్ (Boston dynamics) అనే రోబోటిక్స్ robotics కంపెనీ తాను తాజాగా రూపొందించిన నాలుగు రోబోలతో కొరియోగ్రఫీతో కూడిన డ్యాన్స్ మూవ్స్ చేయించి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. మరమనుషులు చేస్తున్న స్టన్నింగ్ మూవ్స్ dance video సూపర్ గా ఉన్నాయి. వీటిలో కొన్ని ఎంతో ప్రాక్టీస్ చేస్తేగానీ మనం చేయలేని డ్యాన్సింగ్ స్టెప్స్ కూడా ఉండటం హైలైట్. టెస్లా సీఈఓ (Tesla CEO) ఎలాన్ మస్క్ (Elon Musk) కూడా దీనిపై ట్వీట్ చేశారు. దీంతో ఈ వీడియోకు మరింత ప్రాధాన్యత దక్కింది. ప్రస్తుతం రోబోలు డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చెప్పుకునేందుకు పెద్దగా క్లైంట్లు కూడా లేని బోస్టన్ డైనమిక్స్ అనే రోబో మేకింగ్ కంపెనీ ఇప్పటికే మూడు సార్లు చేతులు మారింది. 2013లో దీన్ని గూగుల్ (GOOGL) సొంతం చేసుకోగా ఆతరువాత 2017లో సాఫ్ట్ బ్యాంక్ దీన్ని కొనుగోలు చేసింది. చివరికి గతేడాది హ్యూండాయ్ (Hyundai) చేతికి ఈ కంపెనీ వచ్చింది.

మనుషుల్లానే..
అచ్చం మనుషుల్లానే స్పందించేలా రోబోటిక్ కుక్కలను తయారు చేసి జూన్ లో ఒక్కొక్కదాన్ని 74,500 డాలర్లకు విక్రయించారు. ఈ రోబో కుక్కలైతే పరిగెత్తడం performing parkour tricks, స్టెప్స్ ఎక్కడం, కోవిడ్-19 సమయం కనుక సోషల్ డిస్టెన్స్ పాటించమని పదేపదే గుర్తు కూడా చేస్తోంది. బిల్డింగులు కడుతున్నచోట ఇన్స్పెక్షన్ కోసం ఇలాంటి రోబోలను ఉపయోగిస్తారు . బ్యాక్ ఫ్లిప్స్ చేయటం, 360 డిగ్రీలు రౌండ్ గా తిరగటం, వెరైటీగా ఎగరటం వంటివన్నీ చేసి చూపే ఈ రోబో డాగ్స్ అందరితో "వావ్ వాట్ యన్ ఇన్నోవేషన్" అనిపించుకున్నాయి కూడా. ఇలా బోస్టన్ డైనమిక్స్ కంపెనీలో పలు వెరైటీ రోబోలను తయారుచేసేందుకు రోజూ ఔత్సాహిక ఉద్యోగులు ప్రయత్నిస్తుంటారు. తాము తయారు చేసిన రోబోలను అప్ గ్రేడ్ చేయటం, వీటికి కొత్త ఫీచర్లు జతచేయటం అనే చాలెంజీలను వీరు సునాయాసంగా చేపట్టగలుగుతున్నారు. దీని పేరు 'అట్లాస్' హ్యూమనాయిడ్ (Atlas Humanoid) కాగా, "డూయూ లవ్ మీ" అనే పాటకు ఇవి ఫుల్లీ కొరియోగ్రాఫ్డ్ మూవ్స్ ప్రదర్శించాయి.


ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) తో పనిచేసే ఈ హ్యూమనాయిడ్స్ డ్యాన్సింగ్ వీడియో ఇప్పటికే మిలియన్ కు పైగా వ్యూస్ దక్కించుకుంది.
Published by:Sumanth Kanukula
First published:

Tags: Artificial intelligence, Elon Musk, Tesla Motors

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు