• HOME
  • »
  • NEWS
  • »
  • TRENDING
  • »
  • VIRAL VIDEO BLACK PANTHER CAME IN NIGHT TIME ATTACKS DOG AND CARRIES IT AWAY IN ITS MOUTH NK

Viral video: అర్థరాత్రి... చిమ్మ చీకటి... నల్ల చిరుతపులి వచ్చి ఏం చేసిందంటే...

Viral video: అర్థరాత్రి... చిమ్మ చీకటి... నల్ల చిరుతపులి వచ్చి ఏం చేసిందంటే...

అర్థరాత్రి... చిమ్మ చీకటి... నల్ల చిరుతపులి వచ్చి ఏం చేసిందంటే... (image credit - twitter)

Viral video: బ్లాక్ పాంథర్‌లు కనిపించడం చాలా అరుదు. అసలు అవి మనుషులు ఉండే ప్రాంతాల్లోకి రానే రావు. అలాంటిది అది కూడా వచ్చిందంటే... ఇది ప్రమాదకర సంకేతమే...

  • Share this:
    Viral video: చిరుతపులులు, పెద్ద పులుల వంటివి గ్రామాలు, పట్టణాల్లోకి వచ్చాయనే వార్తలు మనం తరచూ చూస్తూ, చదువుతూనే ఉంటాం. కానీ బ్లాక్ పాంథర్ అలా వచ్చిందనే వార్తలు పెద్దగా రావు. ఎందుకంటే అవి అత్యంత అరుదైనవి. పైగా అవి దట్టమైన అడవుల్లో తప్ప... జనావాసాల్లోకి అస్సలు రావు. కానీ... అడవుల్లో ఇదివరకట్లా అవి తినే ఆహారం దొరకట్లేదు. అందువల్ల ఆహారం కోసం అవి చుట్టుపక్కల ఉండే ఊళ్లలోకి వస్తున్నాయి. ఆకలి వాటిని ఇటువైపు అడుగులు వేయిస్తోంది. తాజాగా ఓ బ్లాక్ పాంథర్ అలాగే ఓ ఊళ్లోకి వచ్చింది. ఈ సందర్భంగా మనం ఓ విషయం చెప్పుకోవాలి. భారతీయులకు బ్లాక్ పాంథర్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే... యానిమేషన్ సిరీస్ జంగిల్ బుక్‌లో పిల్లాడికి తోడుగా బఘీరా (‘Bagheera’) అనే బ్లాక్ పాంథర్ ఉంటుంది. అందువల్ల అది అంటే ఇండియన్స్‌కి ఎంతో ఇష్టం.

    తాజాగా బ్లాక్ పాంథర్... అర్థరాత్రి... చిమ్మ చీకట్లో... ఓ ఇంటికి వచ్చింది. అక్కడున్న ఓ తెల్లటి కుక్కను చూసింది. సైలెంట్‌గా వెళ్లి... వయలెంట్‌గా దాన్ని కొరికింది. కుక్క కెక్కున కేక పెట్టింది. జస్ట్ 2 సెకండ్లలో కుక్కను లేపేసిన పాంథర్... దాన్ని నోట కరచుకొని... సైలెంటుగా వెళ్లిపోయింది. ఆ వీడియో మీరూ చూడండి.


    ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ సుధా రామెన్ ఈ వీడియోని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. నిమిషం 15 సెకండ్లపాటూ ఉన్న ఈ వీడియోను నెటిజన్లు కళ్లార్పకుండా చూస్తున్నారు. ఎందుకంటే... ఆ నల్ల పులి వాళ్లకు ఆసక్తిగా ఉంది. అది అరుదైనది కావడంతో... ఎలా ఉందో...వామ్మో అనుకుంటూ చూస్తున్నారు.


    ఇది ఎక్కడ జరిగిందో రామెన్ చెప్పలేదు. ఇది పర్వతాలకు పక్కనున్న ప్రదేశంగా చెబుతున్నారు. నలుపు రంగులో ఉన్నా... అవి చిరుతపులులు. కుక్కలంటే వాటికి చాలా ఇష్టం అని ఆమె తెలిపారు.

    ఇది కూడా చదవండి: Women's day 2021: మహిళా దినోత్సవం సందర్భంగా వయలెట్ కలర్స్‌లో రైల్వేస్టేషన్లు

    ఇది చూసిన నెటిజన్లు అడవులు తగ్గిపోవడానికి మనుషులే కారణం... అందుకే అలాంటి నల్ల చిరుతలు కూడా మనుషులు ఉండే ప్రాంతాలకు రావాల్సి వస్తోంది అని తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
    Published by:Krishna Kumar N
    First published: