హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Viral Video: బిర్యానీ ఏటీఏం.. ఇక.. మనోళ్లు ఆగుతారా.. రచ్చ రచ్చే!

Viral Video: బిర్యానీ ఏటీఏం.. ఇక.. మనోళ్లు ఆగుతారా.. రచ్చ రచ్చే!

బిర్యానీ ఏటీఏం, చెన్నై(Photo India.com)

బిర్యానీ ఏటీఏం, చెన్నై(Photo India.com)

సిటీలోని కొలత్తూర్‌లో ఈ బిర్యానీ ఏటీఎంలను స్టార్ట్ చేసింది. ఇక రెస్పాన్స్‌ మాములుగా లేదు.. కొంతకాలం క్రితం బెంగళూరులో ఇడ్లీని ఇచ్చే ఏటీఎం గురించి న్యూస్‌ వైరల్‌ అవ్వగా.. ఇప్పుడు ఈ బిర్యానీ వెండింగ్‌ మెషీన్‌ వీడియో నెటింట్లో చక్కర్లు కొడుతోంది. ఇది ఎలా పనిచేస్తుందో చూపిస్తూ ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఇంకా చదవండి ...
  • Local18
  • Last Updated :
  • Hyderabad, India

ఏటీఎంలో కార్డు పెడితే డబ్బులు వస్తాయ్‌.. కొన్ని చోట్ల గోల్డ్‌ ఏటీఎమ్‌లు కూడా ఉన్నాయ్‌.. మీరు బిర్యానీ ఏటీఎమ్‌ను చూశారా..? అవును మీరు వింటుంది నిజమే.. అక్కడ ఏటీఎం నుంచి బిర్యానీ వస్తుంది.. చెన్నైకి చెందిన ఓ స్టార్ట్ అప్ కంపెనీ ఈ వినూత్న ఐడీయాతో ముందుకొచ్చింది. సిటీలోని కొలత్తూర్‌లో ఈ బిర్యానీ ఏటీఎంలను స్టార్ట్ చేసింది. ఇక రెస్పాన్స్‌ మాములుగా లేదు.. కొంతకాలం క్రితం బెంగళూరులో ఇడ్లీని ఇచ్చే ఏటీఎం గురించి న్యూస్‌ వైరల్‌ అవ్వగా.. ఇప్పుడు ఈ బిర్యానీ వెండింగ్‌ మెషీన్‌ వీడియో నెటింట్లో చక్కర్లు కొడుతోంది. ఇది ఎలా పనిచేస్తుందో చూపిస్తూ ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

దేశంలోనే ఫస్ట్ టైమ్:

చెన్నైక చెందిన భాయ్ విటూ కళ్యాణం(PVK) బిర్యానీ దేశంలోనే మొట్టమొదటి మానవరహిత టేక్‌ అవే ఆర్డరింగ్ బిర్యానీ ఏటీఎంను చెన్నైలోని కొలత్తూర్‌లో ప్రారంభించింది. సాధారణ ఏటీఎంల లోపల ఎలా ఉంటుందో ఈ బిర్యానీ ఏటీఎం కూడా సేమ్‌ అలానే ఉంటుంది. మెషీన్‌లోనే మెనూ స్టోరై ఉంటుంది. మనం ఏటీఎంలో ఎలాగైతే కావాల్సిన ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకుంటామో ఇక్కడ కూడా అంతే. మెనూలో నుంచి కావాల్సిన బిర్యానీని టచ్ స్క్రీన్ పై ఎంచుకుని, పేరు, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆపై బిర్యానీ ధరను కార్డు లేదా యూపీఐ స్కానర్ ద్వారా చెల్లించాలి. డబ్బు చెల్లించాక స్క్రీన్‌పై కౌంట్ డౌన్ టైమర్ ఆన్ అవుతుంది. వేడి వేడి బిర్యానీ ఇంకెంత సేపట్లో వస్తుందో ఈ టైమర్ చూపిస్తుంది. నిర్ణీత సమయం పూర్తవగానే ఏటీఎం మెషీన్‌కు ఉన్న చిన్న డోర్‌ను తెరిచి లోపల ఉన్న బిర్యానీని తీసుకెళ్లిపోవచ్చు.

ఇకపై ఇలాంటివి మరిన్ని వస్తాయా..?

దీనికి సంబంధించిన వీడియోను బీవీకే బిర్యానీ ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఇది కాస్తా వైరల్‌గా మారి నెటిజన్ల ప్రశంసలు అందుకుంటోంది. ఈ బిర్యానీ ఏటీఎం సెంటర్‌పై సోషల్‌మీడియాలో ఫుల్‌గా చర్చ జరుగుతోంది. ఇలాంటి బిర్యానీ ఏటీఎమ్‌లు ప్రతీ సిటీలోనూ రావాలని యువత కోరుకుంటున్నారు. ముఖ్యంగా బిర్యానీ అడ్డా హైదరాబాద్‌లో ఇలాంటి మెషీన్‌ ఒకటి వస్తే అక్కడ రద్దీ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పానక్కరలేదు. సాధారణంగా బిర్యానీ స్టాల్స్‌లోనే జనం విపరీతంగా ఉంటారు. ఇక ఇలాంటి ఏటీఎమ్‌ మన దగ్గర వస్తే మెషీన్‌ సెంటర్‌ బయట రద్దీ ఏ రేంజ్‌లో ఉంటుందో ఊహించుకోవచ్చు.

First published:

Tags: ATM, Biryani, Chennai

ఉత్తమ కథలు