హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

బెడిసి కొట్టిన దొంగల ప్లాన్.. వాచ్ మెన్ ఏంచేశాడో తెలుసా..?.. వీడియో వైరల్..

బెడిసి కొట్టిన దొంగల ప్లాన్.. వాచ్ మెన్ ఏంచేశాడో తెలుసా..?.. వీడియో వైరల్..

పారిపోవడానికి ప్రయత్నిస్తున్న దొంగలు

పారిపోవడానికి ప్రయత్నిస్తున్న దొంగలు

Viral video: ఇద్దరు వ్యక్తులు మున్సిపల్ అధికారులమని చెప్పి అపార్ట్ మెంట్ లోకి ప్రవేశించారు. అక్కడ ఇళ్లను పరిశీలిస్తున్నారు. ఇంతలో వారికి తాళం చెవి ఉన్న బైక్ కంటపడింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Delhi, India

చోరీలు చేయడం కూడా ఒక ఆర్ట్. కొందరు దొంగతనం చేసి దర్జాగా పారిపోతుంటారు. ఇంకొందరు మాత్రం చోరీలు చేస్తు ఏదో ఒక తప్పు చేసి అడ్డంగా బుక్కైపోతుంటారు. రోడ్డుపైన నడుచుకుంటు వెళ్లే సింగిల్ వ్యక్తులను దొంగలు ఎక్కువగా టార్గెట్ చేస్తుంటారు. మెల్లగా బైక్ మీద వెళ్లి వారి మెడలోని బంగారాన్ని సెకన్ లో కట్ చేసుకుని జంప్ అయిపోతుంటారు. మరికొందరు చోరీలకు షాపులను ఎంచుకుంటారు. ఏదో కొంటున్నట్లు బిల్డప్ ఇస్తారు. ఆ తర్వాత.. మెల్లగా సామానులతో ఎస్కేప్ అయిపోతుంటారు. కొందరు తాళం ఉన్న ఇళ్లను టార్గెట్ గా చేసుకుంటారు. ఈ కోవకు చెందిన ఘటన వైరల్ గా (Viral video)  మారింది.

పూర్తి వివరాలు.. ఢిల్లీలో (Delhi) షాకింగ్ ఘటన జరిగింది. కల్కాజీ ఎక్స్ టెన్షన్ లోని ఒ కాలనీలో ఇద్దరు వ్యక్తుల మున్సిపల్ అధికారులమంటూ అపార్ట్ మెంట్ కు వచ్చారు. అక్కడ తాళం ఉన్న ఇళ్లను చూస్తున్నారు. ఇంతలో వారికి తాళం చెవి ఉన్న బైక్ కన్పించింది. ఇంకెం.. వారు.. వెంటనే బైక్ ఆన్ చేసుకుని స్పీడ్ గా పొనిచ్చారు. అయితే.. అది డెలీవరీ చేయడానికి వచ్చిన బాయ్ ది. వెంటనే అతును దొంగలు.. దొంగలు అని గట్టిగా అరిచాడు. దీంతో అప్రమత్తమైన వాచ్ మెన్ అక్కడ ఉన్న గేట్ ను మూసివేయడానికి ప్రయత్నించాడు.

అప్పటికే స్పీడ్ మీద ఉన్న ఇద్దరుదొంగలు గేటుకు గుద్దుకుని కిందపడిపోయారు. వారిలో ఒక వ్యక్తి లేచీ పారిపోగ.. మరో వ్యక్తిని స్థానికులు పట్టుకున్నారు. ఈ క్రమంలో అతని సహాయంతో మరోక వ్యక్తినికూడా పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. ప్రస్తుతం అది వైరల్ గా (Viral)  మారింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ఇదిలా ఉండగా ఛత్తీస్ గఢ్ కు (chhattisgarh)  చెందిన యువకుడు బైక్ మీద వేసిన స్టండ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

యువకుడు బైక్ మీదకూర్చుని ఒక చేత్తో వెహికిల్ ను కంట్రోల్ చేస్తు మరోచేతితో వెహికిల్ ను నడిపిస్తున్నాడు. అతను కనీసం హెల్మెట్ కూడా పెట్టుకోలేదు.  స్పీడ్ గా డెంజరేస్ గా వెళ్తున్నాడు. అతని చుట్టుపక్కల మరికొన్ని వెహికిల్స్ కూడా రోడ్డుపైన వెళ్తున్నాయి. వారుఇతడిని వింతగా చూస్తున్నారు.

ఇంతలో ట్రాఫిక్ పోలీసులు ఇతగాడిని పట్టుకున్నారు. వెంటనే స్టేషన్ కు తీసుకెళ్తారు. అక్కడ రాంగ్ రూట్, స్టంట్ లు వేసినందుకు ఫైన్ వేశారు. గుంజీలు కూడా తీయించారు. ఆ తర్వాత.. పోలీసులు అధికారిక ట్విటర్ ఖాతాలతో పోస్ట్ చేశారు. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో (Social media)  వైరల్ గా (Viral video)  మారింది.

First published:

Tags: Delhi, Thief Arrested, Viral Video

ఉత్తమ కథలు