హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

ఆన్ లైన్ లో డ్రోన్ కెమెరా ఆర్డర్ పెట్టిన కస్టమర్.. ఏం డెలివరీ అయ్యిందో తెలుసా..?.. షాకింగ్ వీడియో వైరల్..

ఆన్ లైన్ లో డ్రోన్ కెమెరా ఆర్డర్ పెట్టిన కస్టమర్.. ఏం డెలివరీ అయ్యిందో తెలుసా..?.. షాకింగ్ వీడియో వైరల్..

మోసపోయిన వ్యక్తి

మోసపోయిన వ్యక్తి

Viral Video: ఒక వ్యక్తి తనకు ఇష్టమని ఆన్ లైన్ లో డ్రోన్ కెమెరాను పెట్టాడు. రిటైలర్ అతగాడి డెలివరీ ఆర్డర్ ను ఇంటికి తీసుకెళ్లాడు.

  • News18 Telugu
  • Last Updated :
  • Bihar, India

మనకు కావాల్సిన ప్రతి వస్తువులను ఆన్ లైన్ లో ఆర్డర్ పెడుతుంటాం. ఒకప్పుడు షాపింగ్ కు వెళ్లి కొనుక్కునేంత తీరిక, ఓపిక రెండు కూడా ఉండటం లేదు. దీంతో ప్రతి ఒక్కరు ఆన్ లైన్ ప్లాట్ ఫామ్ ల మీద ఆధారపడుతుంటారు. చాలా సార్లు.. ఆన్ లైన్ లో ఆర్డర్ చేసిన వస్తువులు సమయానికి డెలీవరి అవుతున్నాయి. కానీ కొన్నిసార్లు ఆన్ లైన్ వేదికలుగా అనేక మోసాలు వెలుగులోనికి వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో.. ఒకటి ఆర్డర్ పెడితే మరోకటి డెలీవరి అవుతున్నాయి. ఈ కోవకు చెందిన ఘటన వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. బీహార్ లో (Bihar) ఒక వ్యక్తికి షాకింగ్ ఘటన ఎదురైంది. నలందకు చెందిన వ్యక్తి దసరా నవరాత్రి సందర్భంగా కొన్ని కంపెనీలు ఆఫర్ లను ప్రకటించాయి. దీంతో ఒక వ్యక్తి డ్రోన్ కెమెరాలు కొనాలనుకున్నాడు. అతను వెంటనే మీషో నుంచి డ్రోన్ కెమెరాను ఆర్డర్ పెట్టాడు. అయితే.. కొన్ని రోజుల తర్వాత.. డెలీవరీ బాయ్ వచ్చి అతను ఇచ్చిన ఆర్డర్ ను తెరిచాడు. అప్పుడు డెలీవరీ అయిన ఐటమ్ చూసి షాక్ కు గురయ్యాడు. కాగా, చైతన్య కుమార్ అనే వ్యక్తి, మీషో నుండి తగ్గింపు ధరకు DJI డ్రోన్ కెమెరాను ఆర్డర్ చేసినట్లు చేశాడు. అతను ఆర్డర్ చేసిన డ్రోన్ కెమెరా మార్కెట్ విలువ రూ. 84,999 అయితే మీషోలో రూ.10,212కి పొందుతున్నాడు.

అతను కొంచెం అనుమానించాడు. కంపెనీకి తనకు జరిగిన మోసం పట్ల స్పష్టత ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. భారీ ఆఫర్ ఉందని, అందుకే తక్కువ ఖర్చుతో కెమెరాను తీసుకుంటున్నానని మీషో చెప్పాడు. అతను పూర్తిగా ఆన్‌లైన్‌లో చెల్లింపు చేశాడు. దీనిపై కంపెనీకి కూడా ఫిర్యాదు చేశాడు. దీనిపై పర్వాల్‌పూర్ ఎస్‌హెచ్‌ఓ మాట్లాడుతూ దరఖాస్తు అందిన తర్వాత ఈ విషయంపై తగు చర్యలు తీసుకుంటామన్నారు.

ఈక్రమంలో ఆర్డర్ లో.. కేజీ బంగాళ దుంపలు ఉండటాన్ని చూసి నోరెళ్లబెట్టాడు. వెంటనే ఈ ఘటనను వీడియో తీసి అతను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడకు. దీంతో అది కాస్త వైరల్ గా మారింది. కాగా, రెండు రోజుల క్రితం.. ఢిల్లీలో ఒక వ్యక్తి లాప్ టాప్ ఆర్డర్ పెడితే.. అతనికి డిటర్జంట్ డెలివరీ అయిన ఘటన వైరల్ గా (viral video)మారిన విషయం తెలిసిందే.

Published by:Paresh Inamdar
First published:

Tags: Bihar, Online fraud, Viral Video

ఉత్తమ కథలు