Viral videos: జపాన్‌లో ఇల్లంత పిల్లి... చూసి ఆశ్చర్యపోతున్న ప్రజలు.. వీడియోలు చూడండి

Viral videos: జపాన్‌లో ఇల్లంత పిల్లి (image credit - twitter)

Viral videos: జపాన్ ప్రజలకు పిల్లులంటే చాలా ఇష్టం. వాటి కోసం ఓ దీవినే కేటాయించారు. ఓ మెట్రో రైలు కూడా పిల్లి బొమ్మలతో ఉంటుంది. మరి ఈ ఇల్లంత పిల్లి సంగతులేంటో తెలుసుకుందాం.

  • Share this:
    Viral videos: మీరు జపాన్ రాజధాని టోక్యోకు వెళ్తే... అక్కడికి దగ్గర్లోనే... ఎప్పుడూ బిజీగా ఉండే... షింజుకు జిల్లా (Shinjuku district)కు తప్పక వెళ్లండి. ఇప్పుడు అక్కడో పే...ద్ద పిల్లి అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఏకంగా ఇల్లంత సైజులో ఉన్న ఆ పిల్లి... అటూ ఇటూ కదులుతూ... అప్పుడప్పుడూ నిద్రపోతూ... మధ్యమధ్యలో ఉలిక్కిపడుతూ, అరుస్తూ... ఆకట్టుకుంటోంది. మొదటిసారి చూసిన ఎవరికైనా అది నిజమైన పిల్లే అనిపిస్తుంది. కాస్త జాగ్రత్తగా చూస్తే... అది త్రీడీ పిల్లి అని అర్థమవుతుంది. జీబ్రా క్రాసింగ్ దగ్గర ఈ పిల్లి ఉండటంతో... అటుగా వెళ్లే వారికి ఇది ఎంతో ఆనందం, ఆశ్చర్యం కలిగిస్తోంది.

    ఓ భారీ భవనంపై LED స్క్రీన్ ఏర్పాటుచేశారు. ఈ స్క్రీన్ 1664 చదరపు అడుగులు ఉంది. ఇది కర్వ్ షేపులో ఉంటుంది. ఇక్కడ కనిపించే త్రీడీ పిల్లి... 4K రిజల్యూషన్‌తో ఉంది. ఫలితంగా ఇది అచ్చం నిజమైన పిల్లే అనిపించేలా ఉంటోంది. ఇంటిపై నుంచి కిందకి దూకేందుకు సిద్ధంగా ఉన్న పిల్లిలా ఇది కనిపిస్తుంది. పిల్లి వీడియోలు మీరూ ఇక్కడ చూసి ఆశ్చర్యపోండి.


    ఈ పిల్లికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు నెట్టించ హల్ చల్ చేస్తున్నాయి. ఫ్యూచర్ మొత్తం ఇలా త్రీడీ ప్రపంచంతో నిండిపోతుందేమో అని నెటిజన్లు ఫీలవుతున్నారు. ఈ పిల్లికి చెందిన మరో వీడియో ఇక్కడ చూడండి.


    ఈ పిల్లిని ఏర్పాటు చేయడం వెనక ఓ ఆసక్తికర విషయం ఉంది. ఈ స్క్రీన్‌పై యాడ్స్ ప్లే చేస్తున్నారు. వాటిని ప్రజలు తప్పక చూడాలంటే... వారి దృష్టిని స్క్రీన్ వైపు మళ్లించాలి. అందుకోసం ఈ పిల్లిని వాడుతున్నారు. అందువల్ల ఇది యాడ్స్ మధ్యలో కనిపిస్తూ ఉంటుంది. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 వరకూ ఇది కనిపిస్తుంది.

    క్రాస్ స్పేస్ అనే కంపెనీ... ఈ ఐడియాను ఇంప్లిమెంట్ చేసింది. ఈ కంపెనీ... ఈ బిల్ బోర్డుకు లైవ్ స్ట్రీమింగ్ కూడా పెట్టింది. జపాన్ లో లేని వారు చూసేందుకు వీలుగా ఈ ఏర్పాటు చేసింది. అ లైవ్ స్ట్రీమ్ ఇక్కడ చూడొచ్చు.




    ఇది కూడా చదవండి: Business Idea: తేలికైన వ్యవసాయం... తక్కువ పెట్టుబడితో లక్షలు సంపాదిస్తున్న రైతులు

    ఈ కాన్సెప్ట్ చాలా బాగుందని జపాన్ ప్రజలు చెబుతున్నారు. ఈ సెంటర్... ఫ్యూచర్‌లో టూరిస్ట్ ఎట్రాక్షన్ అవుతుందని అంటున్నారు.
    Published by:Krishna Kumar N
    First published: