Viral video: 10 అంతస్తుల భవనం... ఒక్క రోజులో నిర్మాణం... ఎలా?

10 అంతస్తుల భవనం... ఒక్క రోజులో నిర్మాణం (image credit - youtube)

Viral video: ఏం చేసినా ఇతరులకు సాధ్యం కాదు అనిపించే రీతిలో చెయ్యాలన్నది చైనా ప్లాన్. అందుకు తగ్గట్టుగానే ఆ 10 అంతస్థుల భవనాన్ని 28 గంటల్లో నిర్మించింది. ఎలా సాధ్యమైందో వీడియో చూద్దాం.

  • Share this:
    చైనాలోని ఓ రెండ్రోజుల కిందట వ్యక్తి ఊరు వెళ్లాడు. వెళ్లేటప్పుడు... అతని ఇంటికి దగ్గర్లో ఖాళీ స్థలం ఉంది. ఇప్పుడు ఊరి నుంచి వచ్చి చూస్తే... అక్కడ 10 అంతస్థుల భవనం ఉంది. దాంతో... తాను రాంగ్ అడ్రెస్‌కి వచ్చానేమో అనుకున్నాడు. కానీ చూస్తే... అక్కడ ఎప్పటిలాగే తన ఇల్లు ఉంది. మరి... మరి ఈ 10 అంతస్థుల భవనం సడెన్‌గా ఎక్కడి నుంచి వచ్చింది అని ఆశ్చర్యపోయాడు. చైనాకి చెందిన బ్రాడ్ గ్రూప్ (Broad Group) కంపెనీ... ఈ భవనాన్ని 28 గంటల 45 నిమిషాల్లో నిర్మించింది. అంటే... ఒక రోజు కంటే కాస్త ఎక్కువ. జనరల్‌గా ఒక ఇల్లు కట్టాలంటేనే... నెలలు పడుతుంది. మరి వాళ్లు ఏకంగా అపార్ట్‌మెంటే కట్టేశారు... ఎలా?

    కాంక్రీటుతో నిర్మిస్తే నెలలు, ఏళ్లు పడుతుంది... ఆ కంపెనీ ప్రిఫాబ్రికేటెడ్ కన్‌స్ట్రక్షన్ సిస్టమ్స్ అనే టెక్నాలజీని వాడింది. ఈ విధానంలో చిన్న చిన్న మాడ్యులార్ యూనిట్లను ఒకదానికొకటి సెట్ చేస్తూ నిర్మిస్తారు. ఈ యూనిట్లు మన ఇటుకల్లాగే... ముందే ఫ్యాక్టరీలో తయారవుతాయి. వాటితో ఫ్యాక్టరీలోనే గదుల లాంటి కంటైనర్లను తయారుచేస్తారు. ఆ కంటైనర్లను నిర్మాణ స్థలానికి తెచ్చి... ఒకదానిపై ఒకటి సెట్ చేస్తూ పోతారు. వాటిని బోల్టుల ద్వారా బిగిస్తారు. కాబట్టి వీటితో నిర్మించాక... ఇవి ఏమాత్రం కదలవు. భవన నిర్మాణం పూర్తయ్యాక... వాటర్ సప్లై కనెక్షన్లు ఇస్తారు.

    ఈ భవన నిర్మాణాన్ని కంపెనీ వీడియో తీసింది. దాన్ని టైమ్‌లాప్స్ (Time lapse)గా మార్చి... 5 నిమిషాల వీడియోగా చేసింది. దాన్ని చూస్తే... ఛాంగ్షా నగరంలో 10 అంతస్థుల భవనం ఎలా పూర్తైందో అర్థమవుతుంది. ఇక్కడ చూడండి.

    ఈ వీడియో ద్వారా కచ్చితమైన కంటైనర్ సైజు, ప్రపంచవ్యాప్తంగా తక్కువ ఖర్చుతో రవాణా, చాలా తేలికగా నిర్మించే విధానం అని తెలిపింది. "ఊహించండి... ఎవరైనా ఆ ప్లేసులో నిధిని దాచి... మర్నాడు దాన్ని తీసుకుందామని వస్తే... వారి పరిస్థితి ఏంటి?" అని ఓ యూజర్ కామెంట్ చెయ్యగా... "భవన నిర్మాణంలో ఇదో విప్లవం... గుడ్, టెర్రిఫిక్" అని మరో యూజర్ స్పందించారు. "వావ్... ఇంటిరీయర్ లెవెల్ చాలా బాగా చేశారు" అని మరో యూజర్ మెచ్చుకున్నారు. "ఇది నా మైండ్‌ని ఆశ్చర్యంలో పడేసింది" అని మరో యూజర్ కామెంట్ రాశారు.

    ఇది కూడా చదవండి:



    ఇది కూడా చదవండి:Vastu Tips: ఇంట్లో ట్యాప్ లీకవుతోందా.. మీ డబ్బుకు రెక్కలొచ్చినట్లే

    ఈ భవనాన్ని వేగంగా నిర్మించడమే కాదు... ఎప్పుడైనా తొలగించాలంటే కూడా... తిరిగి కంటైనర్లను విడివిడిగా చేసి తొలగించవచ్చు. తద్వారా... మరో చోట మళ్లీ నిర్మించేందుకు వీలవుతుంది.
    Published by:Krishna Kumar N
    First published: