Video: వీడు మామూలోడు కాదు.. తేనెటీగల్నే మోసం చేసి తేనె పట్టుకుపోతున్నాడు!

తేనెటీగల్నే మోసం చేసి తేనె పట్టుకుపోతున్నాడు! (image credit - reddit)

Video: అతను తేనెతుట్టె నుంచి తేనెను తీసుకునే విధానం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఉత్తి చేతులతో అలా తేనె తీసుకుంటుంటే తేనెటీగలు అతన్ని ఎందుకు కుట్టలేదన్నది వారి డౌట్.

  • Share this:
    Video: ఇవాళ మీరు ఓ ఆశ్చర్యకరమైన, ఆసక్తికరమైన వీడియో ఏదైనా చూడాలి అనుకుంటే... ఇది మీకు కరెక్టుగా నచ్చుతుంది. తేనెటీగలు, తేనెకు సంబంధించిన వీడియో ఇది. తేనె సేకరణ (Collecting honey) అనేది వందల ఏళ్లుగా ఉంది. ఇది ప్రాణాలకే ప్రమాదకరమైన పని. తగిన సరంజామా (safety equipment) లేకుండా తేనె తుట్టెను కదిపితే.. తేనెటీగలు ఇష్టమొచ్చినట్లు కుడతాయి. ఇలాంటి ప్రమాదాల్లో ఒక్కోసారి ప్రాణాలు కూడా పోతాయి. అందుకే తేనెను సేకరించేవారు ఒళ్లంతా కప్పుకొని మాత్రమే ఆ పని చేస్తారు ఇప్పుడు మనం అందుకు పూర్తి విరుద్ధమైన వీడియోని చూడబోతున్నాం.

    తేనే సేకరణలో కొంత మంది నిపుణులు ఉంటారు. వాళ్లు ఎలాంటి సరంజామా లేకుండానే తేనెను సేకరించగలరు. అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో ఆశ్చర్యం, అయోమయం కలిగిస్తోంది. ఆశ్చర్యం ఎందుకంటే... అందులో ఓ వ్యక్తి ఎలాంటి సరంజామా లేకుండా ఉత్తి చేతులతోనే తేనెటీగల్ని (honey bees) పంపించేసి... తేనె తుట్టు నుంచి తేనేను సేకరించాడు. అలా ఎలా చేశాడో అర్థం కాక అయోమయం చెందుతున్నారు ప్రపంచ నెటిజన్లు.

    తేనెను సేకరించే ముందు అతను తేనెతుట్టె (beehive) దగ్గరకు వెళ్లి ఏదో ఆకుల (herb)ను ఊపాడు. ఆకులతో అలా అనగానే తేనెటీగలన్నీ అక్కడి నుంచి వెళ్లిపోయాయి. కొన్ని సెకండ్ల తర్వాత అతను తన గుప్పిట్లో నిండుగా తేనెటీగల్ని పట్టుకొని వదిలేశాడు. ఆ తర్వాత తేనె సేకరణ మొదలుపెట్టాడు.

    తేనెటీగలు వెళ్లిపోయాక... తేనె తుట్టెను సగానికి కట్ చేసి... ఓ సగ భాగం నుంచి బంగారు రంగులో మెరుస్తున్న తేనెను అతను సేకరించాడు. కత్తితో తేనె తుట్టెను కట్ చేస్తూ... చిన్న బకెట్‌లో తేనెను తీసుకున్నాడు. రాయికి ఉన్న తేనె తుట్టె మొత్తాన్నీ కట్ చేశాడు. ఆ తర్వాత ముందుగా కట్ చేసిన సగం తేనె తుట్టెను తిరిగి రాయికి సెట్ చేశాడు. దాంతో తేనెటీగలు మళ్లీ అక్కడ పోగయ్యాయి.

    ఆ వీడియోని ఇక్కడ చూడండి.


    ఇది కూడా చదవండి: Mars: అంగారక గ్రహంపై విరిగిపడిన కొండ చరియలు.. ఫొటోలు చూడండి

    రెడ్డిట్‌లో షేర్ చేసిన ఈ వీడియోకి 20వేలకు పైగా అప్ ఓట్లు వచ్చాయి. 700 మందికి పైగా కామెంట్లు రాశారు. అందరిలోనూ ఒకటే డౌట్. అతను రాసిన ఆకులు ఏంటి అనేదే. చూడ్డానికి అవి కరివేపాకుల్లా ఉన్నా కరివేపాకులు మాత్రం కావని అంటున్నారు. అవి ఏంటనేది మాత్రం తెలియలేదు. అందుకే నెటిజన్లు అయోమయం చెందుతున్నారు.
    Published by:Krishna Kumar N
    First published: