హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

నువ్వు తోపు సామి.. క్రూరమైన ఎలుగు బంటితో హైఫై.. వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో..

నువ్వు తోపు సామి.. క్రూరమైన ఎలుగు బంటితో హైఫై.. వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో..

హైఫై ఇస్తున్న ఎలుగు బంటి

హైఫై ఇస్తున్న ఎలుగు బంటి

Viral video: కొన్ని ఎలుగు బంట్లు అడవి నుంచి రోడ్ల మీదకు వచ్చాయి. అక్కడే ఉన్న రోడ్డు పక్కన నుంచి వెళ్తున్నాయి. ఇంతలో ఒక ఎలుగు బంటి కారు దగ్గరకు వెళ్లింది.

అడవికి దగ్గరకు ఉన్న ప్రాంతాల లోనికి అప్పుడప్పుడు జంతువులు వస్తుంటాయి. చిరుతపులులు, ఎలుగు బంట్లు, పెద్ద పులులు, ఏనుగులు రావడం వంటి ఘటనలు మనం వార్తలలో చూశాం. కొన్ని సార్లు అవి మనుషులను దాడి చంపేస్తుంటాయి. కొందరు స్థానికులు వాటిని చంపేస్తుంటారు. పులులు, ఎలుగు బంట్లు అడవిలో వెళ్లిన వారిపైన దాడులు చేస్తుంటాయి.ఎలుగు బంట్లు (Bear) అయితే.. మరీ క్రూరంగా ఉంటాయి. వాటి నల్లవైన ఆకారం, వెంట్రుకలు, గోర్లు, చూడటానికి ఎంతో భయంకరంగా ఉంటుంది.

ఇప్పటికే ఎలుగు బంట్ల దాడిలో అనేక మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలు వార్తలలో చూశాం. అయితే, ఇక్కడ ఎలుగు బంట్లు మాత్రం కాస్త ఫన్నీగా ప్రవర్తించాయి. సోషల్ మీడియాలో (Social media) ప్రతిరోజు వందల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వీటిలో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని భయంకరంగాను ఉంటాయి. నెటిజన్లు కూడా వీటిని చూడటానికి ఇంట్రెస్ట్ చూయిస్తుంటారు. తాజాగా, ఒక ఫన్నీ వీడియో ప్రస్తుతం  సోషల్ మీడియాలో వైరల్ (Viral video)  గా మారింది.

View this post on Instagram


A post shared by Pubity (@pubity)పూర్తి వివరాలు.. యూరోపియన్ దేశమైన రోమెనియా నగరంలో వింత ఘటన చోటు చేసుకుంది. రోమేనియా లోని కొన్ని ప్రాంతాలు అడవికి దగ్గరగా ఉంటాయి. ఈ క్రమంలో.. కొన్ని ఎలుగు బంట్లు అడవి నుంచి రోడ్డు మీదకు వచ్చాయి. అవి రోడ్డు మీద ఒక పక్క నుంచి వెళ్తున్నాయి. ఇంతలో రోడ్డుమీద ట్రాఫిక్ జామ్ అయ్యింది. అప్పుడు ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. కారులో నుంచి ఒక వ్యక్తి ఎలుగు బంట్లవైను అరుస్తూ వాటిని పిలిచాడు. అవి వెంటనే వాటి వైపు చూశాయి.

వాటిలో ఒక ఎలుగు బంటి అతడి కారు దగ్గరకు వచ్చింది. బహుశా.. అక్కడ కారు నుంచి తినే పదార్థాలను అప్పుడప్పుడు బయటకు విసిరేస్తుంటారు. ఈ క్రమంలో ఎలుగు బంటి ఏదైన తినే పదార్థం ఉందా అనుకొని అక్కడికి వెళ్లింది. తన రెండు కాళ్ల మీద లేచి నిలబడింది. కారులో నుంచి అతను చేయి బైటకు తీసి.. హయ్ అన్నాడు. దీంతో అతనికి ఎలుగు బంటిహైఫ్ (Bear given man High Five) ఇచ్చింది. ఆ తర్వాత.. అక్కడి నుంచి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట (Social media) వైరల్ గా మారింది.

Published by:Paresh Inamdar
First published:

Tags: Trending news, Trending video, Viral Video

ఉత్తమ కథలు