Home /News /trending /

VIRAL VIDEO BABY HYENAS COME FACE TO FACE WITH LION IN THE WILD WHAT HAPPENS NEXT PAH

Viral video: కంటి చూపుతో హైనాలను చుచ్చు పోయించిన సింహం.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..

వేటను తింటున్న సింహం

వేటను తింటున్న సింహం

Shocking: సాధారణంగా సింహన్ని అడవికి రాజుగా భావిస్తారు. అడవిలో ఎన్ని జంతువులు ఉన్నప్పటికి దీనికున్న స్పెషాలిటీ వేరు.సింహనికున్న ప్రత్యేక జూలు, భారీ శరీరం, అది గట్టిగా గాండ్రిస్తుంటే.. ఇతర జంతువులు దాని దరిదాపుల్లోకి వెళ్లే సాహాసం అసలు చేయవు.

ఇంకా చదవండి ...
Baby Hyenas Come Face to Face With Lion: అడవులలో రకరకాల జంతువులు ఉంటాయి. వాటిలో కొన్నిక్రూర మృగాలతో పాటు, సాధు జీవులు ఉంటాయి.సింహం, పులి, చిరుత పులి, ఎలుగుబంటి, మొసలి, నక్కలు, హైనాల వంటి రకరకాల క్రూర మృగాలు ఉంటాయి. ఇక .. జింకలు, జిరాఫీలు, విల్డర్ బీస్ట్, ఏనుగుల వంటి సాధు జంతువులు కూడా ఉంటాయి. సాధారణంగా క్రూర మృగాలు, సాధు జంతువులను వేటాడి తింటాయి. అదే విధంగా సాధు జంతువులు చెట్ల కొమ్మలు, ఆకులు తిని తమ ఆకలిని తీర్చుకుంటాయి. ఇదే ఆటవిక నియమం. ఇక క్రూర మృగాలైన.. సింహాలు, పులులు.. జింకలు, విల్డర్ బీస్ట్, గేదెలను వేటాడి తింటుంటాయి.

ఇప్పటికే జంతువుల వేటకు సంబంధించి అనేక వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. సోషల్ మీడియాలో అనేక రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని భయంకరంగాను ఉంటాయి. ఇక క్రూర మృగాల వేటకు సంబంధించి అనేక వీడియోలు ఇప్పటికే వైరల్ గా మారాయి. తాజాగా, ఈ కోవకు చెందిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.






పూర్తి వివరాలు... అడవులో క్రూర మృగాలు, జంతువులను వేటాడిన తర్వాత.. దాన్ని పక్కకు లాక్కుని తీసుకెళతాయి. వాటిని ఇతర జంతువులతో కలిసి ఆరగిస్తాయి. కొన్ని సార్లు.. సింహం, పులి వేటాడగానే.. నక్కలు, హైనాలు చుట్టుపక్కలే తిష్టవేసుకుని ఉంటాయి. సింహలు కొంచెం వేరే చోటకు దృష్టి మరల్చగానే మాంసం ముక్కలను లాక్కొని పారిపోతుంటాయి. ఈ క్రమంలో కొన్ని జంతువులు ఇతర జంతువుల బారి నుంచి తప్పించుకొవడానికి తమ వేటను చెట్టుమీదకు లాక్కెళతాయి. అక్కడే తన వేటను తినేస్తాయి.

అయితే, అడవిలో  ఒక సింహం, సాధు జంతువుని వేటాడింది. దాన్ని తింటుంది. అప్పుడు అక్కడ హైనాలు ప్రత్యక్ష మయ్యాయి. మాక్కుడా భాగం అన్నట్లు మెల్లగా సింహం దగ్గరకు వచ్చాయి. అప్పుడు సింహం ఒక్కసారిగా వాటివైపు కోపంగా చూసింది. సింహం గాండ్రిస్తు.. హైనాల వైపు చూడగానే అవి మెల్లగా అక్కడ నుంచి పారిపోయాయి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
Published by:Paresh Inamdar
First published:

Tags: Lions, Viral Video

తదుపరి వార్తలు