VIRAL VIDEO BAARAT BATTLES RAIN MOVES AHEAD INTERNET SAYS HAPPENS ONLY IN INDIA PAH
భారీ వర్షం లో పెళ్లి బరాత్.. తడవ కుండా ఉండేందుకు బంధువుల ప్లాన్.. వైరల్ అవుతున్నఫన్నీ వీడియో..
వర్షంలో పెళ్లి బరాత్
Madhya pradesh: పెళ్లి బరాత్ ప్రారంభమైంది. ఇంతలో కుండపోతగా వర్షం ప్రారంభమైంది. దీంతో బంధువులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అప్పుడు ఒక మాస్టర్ ప్లాన్ వేశారు.
వర్షాకాలం ప్రారంభమైంది. ఇప్పటికి అనేక చోట్ల పెళ్లి వేడుకలు (Wedding barat) జరుగుతున్నాయి. అయితే... వర్షం ఎప్పుడు కురుస్తోందో తెలియని పరిస్థితి. వివాహ వేడుకను అందరు గ్రాండ్ గా చేసుకోవాలను కుంటారు. దీని కోసం ఎంతైన డబ్బులు వెచ్చిస్తుంటారు. బంధువులు, స్నేహితుల మధ్యప్రతి ఒక్కవేడుక ఎంతో గ్రాండ్ గా చేసుకుంటారు.
దీని కోసం ప్రీ వెడ్డింగ్ షూట్ నుంచి హల్దీ, మెహందీ, సంగీత్ కార్యక్రమాలు చేస్తుంటారు. వర్షాకాలం కాబట్టి అనుకొకుండా కొన్నిసార్లు వర్షం కురుస్తుంది. దీంతో పెళ్లిలో వచ్చిన వారి కాస్ట్యూమ్ పాడైపోతుంది. ఇలాంటి సమయలో పెళ్లివారు చేసిన పని ఇప్పుడిక నెట్టింట్లో వైరల్ గా మారింది.
పూర్తి వివరాలు.. మధ్య ప్రదేశ్ లోని (Madhya Pradesh) ఇండోర్ లో జరిగిన ఒక పెళ్లి వేడుక ప్రస్తుతం ట్రెండింగ్ మారింది. పరదేశీ పురా ప్రాంతంలో ఈ వివాహ వేడుక మంగళవారం జరిగింది. పెళ్లి బరాత్ ప్రారంభమైంది. రోడ్డు మీద పెళ్లి కూతురు ప్రత్యేక వాహనంలో వెళ్తుంది. దీని కోసం బంధువులు, స్నేహితులు పెద్ద ఎత్తున బరాత్ వెనుకాల వెళ్తున్నారు. అయితే, ఒక్కసారిగా కుండపోతగా వర్షం ప్రారంభమైంది. దీంతో పెళ్లి వారు..వెంటనే ప్రత్యేకమైన టార్పలిన్ కవర్ ను అరెంజ్ చేశారు. టార్పలిన్ కవర్ ను పట్టుకుని దాని కింద పెళ్లి వారు.. బరాత్ వెనుకాల ఫాలో అవుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా(viral video) మారింది.
ఇదిలా ఉండగా చైనాలో ఒక తండ్రి గుక్క పెట్టి ఏడ్చాడు.
చైనీస్ ప్రజలు చదువుకు అత్యంత ప్రయారిటీ ఇస్తారు. తమ వాళ్లు చదువులో ముందుండాలని అనుకుంటారు. అయితే, ఇక్కడోక వ్యక్తి కూడా తన కొడుకు చదువులో అందరికన్నా ముందుండాలని అనుకున్నాడు. అయితే,తన కొడుకు గణితంలో చాలా వీక్. దీని కోసం అతను సంవత్సరం పాటు ప్రత్యేకంగా ట్యూషన్ ఇప్పించాడు. అయితే, ఇంత చేశాడు. తీరా రిజల్ట్ వచ్చాక.. తన కొడుకు సాధించిన స్కోర్ చూసి ఆ తండ్రి గుక్కపెట్టి ఏడ్చాడు.
అతని కొడుకుకి.. గణితంలో నూటికి కేవలం 6 మార్కులే వచ్చాయి. అది చూసిన తండ్రి షాక్ తో ఏడ్వడం మొదలెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. వింతగా స్పందిస్తున్నారు. బహుషా.. అతనికి గణితం అంటే ఇష్టం లేదేమో...,మరీ ఇంత చాదస్తం ఏంటీ.. మరల రాసి పాస్ అవ్వోచ్చు కదా.., ఆ మాత్రం దానికి ఏడవాలా.. అంటూ కామెంట్ లను పెడుతున్నారు.
Published by:Paresh Inamdar
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.