Crocodile attack: కొంత మంది నదిలో చేపలను పడుతున్నారు. ఇంతలో గాలానికి ఒక పెద్ద చేప పడింది. దాన్ని మెల్లగా బయటకు లాగుతున్నారు. ఇంతలో దానిపై ఒక పెద్ద మొసలి కన్ను డింది.
కొందరు సరదాగా నదులు, చెరువులకు వెళ్లి సరదాగా చేపలను పడుతుంటారు. ఒక్కొసారి చేపలను (Fishing) పట్టే క్రమంలో అనుకొని సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఒక్కొసారి.. వీరి గాలంలో పెద్ద పెద్ద చేపలు పడతాయి. మరికొన్ని సార్లు.. గాలంలోని వలలో చేపలతో పాటు.. పాములు, కొండ చిలువలు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే, ఇక్కడో వ్యక్తి సరదాగా గాలం వేస్తే దానిలో అతనికి ఒక చేప పడింది. కానీ అతనికి మరో ట్విస్ట్ (Twitst) కూడా ఎదురైంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా (Viral video) మారింది. సోషల్ మీడియాలో (Social media) ప్రతిరోజు వేల సంఖ్యలో వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొన్ని భయంకరంగా ఉంటే.. మరికొన్ని షాకింగ్ కు గురిచేసేలాను ఉంటాయి. ప్రస్తుతం ఒక షాకింగ్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
పూర్తి వివరాలు.. ఆస్ట్రేలియాకు (Australia) చెందిన స్కాట్ రోస్కారెల్ (Scott Roscarel) అనే వ్యక్తి , స్థానికంగా ఉత్తర భూభాగంలోని కాహిల్స్ క్రాసింగ్ (Cahills Crossing) ప్రాంతంలో ఉన్న చెరువులో స్నేహితులతో కలిసి సరదాగా చేపలను పట్టడానికి వెళ్లాడు. ఆ తర్వాత.. గాలం వేశాడు. కొంత సేపటికి అతనికి గాలం బరువుగా మారింది. వెంటనే దాన్ని బయటకు లాగడానికి ప్రయత్నిస్తున్నాడు. అతని గాలానికి మీటర్ పొడవైన బార్రా జాతీ చేప (metre Barra fish) చిక్కుకుంది. ఇంకేం పంట పండిందని అతని మిత్రులు సంబరపడ్డారు. గాలాన్ని బయటకు లాగుతున్నారు. అప్పుడు ఊహించని సంఘటన జరిగింది.
అక్కడ ఒక మొసలి (Crocodile) ప్రత్యక్ష మైంది. చేపను వెంటడింది. అక్కడి వారంతా మొసలి, చేపను వెంబడించడం గమనిస్తున్నారు. స్కాట్ రోస్కారెల్.. బలంగా గాలం ఉన్న కర్రను ఒడ్డు వైపుకు తీసుకొచ్చాడు. మొసలి కూడా ఏమాత్రం తగ్గకుండా.. గాలాన్ని వెంబడిస్తు ఒడ్డుకు చేరుకుంది. చేపపై, ఒడ్డున ఉన్న వారిపై దాడి చేయడానికి ప్రయత్నించింది. అప్పుడు అతను వేగంగా చేపను లాక్కొని అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోయాడు. పాపం.. మొసలి కోపంగా అలాగే చూస్తు ఉండిపోయింది. ప్రస్తుతం ఈ షాకింగ్ వీడియో (Shocking video) నెట్టింట వైరల్ గా మారింది.
Published by:Paresh Inamdar
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.