హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Viral Video: ఇదేం పండుగ రా అయ్యా.. బుడ్డోడీ హోలీ సెలబ్రేషన్స్ చూస్తే షాకవ్వాల్సిందే..

Viral Video: ఇదేం పండుగ రా అయ్యా.. బుడ్డోడీ హోలీ సెలబ్రేషన్స్ చూస్తే షాకవ్వాల్సిందే..

మురికి కాలువలోని నీటిని నింపుకుంటున్న బాలుడు

మురికి కాలువలోని నీటిని నింపుకుంటున్న బాలుడు

Holi Festival: హోలీ పండుగను ఒకరిపై మరోకరు రంగులను వేసుకుంటూ ఎంతో సంతోషంగా జరుపుకుంటారు. ఇక మరికొన్ని చోట్ల టమాటాలు వేసుకుంటారు. ఇక కొన్నిచోట్ల గుడ్లతో కొట్టుకోవడం మనకు తెలిసిందే. కానీ ఒక యువకుడు హోలీ రోజు వెరైటీగా పండుగ చేసుకున్నాడు.

ఇంకా చదవండి ...

Variety Holi: సాధారణంగా హోలీ పండుగను ప్రజలంతా ఎంతో ఆనందంగా జరుపుకుంటుంటారు. కొంత మంది దీని కోసం వెరైటీ రంగులను ఉపయోగిస్తుంటారు. దీని కోసం పండుగకు రెండు రోజుల ముందు నుంచే ప్లాన్ లు వేస్తుంటారు. ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే హోలీ ఆడటానికి.. పిచికారీ బాటిల్స్, స్ప్రే బాటిల్స్ లను కొనిస్తుంటారు. ఇక బకిట్లలో, ట్యాంక్ లలో నీళ్లను నింపి వాటిలో రంగులను కలుపుతుంటారు.

వాటిలో నీళ్లను తీసుకుంటూ.. రోడ్డుపై వెళ్లే వారి మీద రంగులను జల్లుతుంటారు. కొన్ని చోట్ల టమాటాలు, గుడ్లను కూడా కొట్టుకుంటూ హోలీ వేడుకను (Holi celebrations) జరుపుకుంటారు. కొన్ని చోట్ల హోలీ రోజు వింత సంప్రదాయాలు, ఆచారాలు పాటిస్తుంటారు. నిజామాబాద్ లోని బోధన్ లో హోలీ రోజు పిడిగుద్దులు కొట్టుకుంటారు. ఇక బిహర్ లో జరిగిన హోలీలో ఒకరిపై మరొకరు చెప్పులతో కొట్టుకున్న వీడియోలు వైరల్ గా మారిన విషయం తెలిసిందే.

ఇక మరో చోట హోలీ రోజు (Holi) ఒక యువకుడిని రంగులు పూసి.. ఆ తర్వాత.. పెద్ద మురికి నాలా లో పైనుంచి పడేశారు. ఇక యూపీలో హోలీ రోజు అబ్బాయిలు అమ్మాయిల వేష ధారణలో స్థానిక ఆలయంను దర్శించుకుంటారు. ఇలాంటి ఎన్నో వీడియోలు వైరల్ (Viral News) గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా, హోలీ పండుగ రోజు ఒక బాలుడు కోపంతో.. చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వివరాల్లోకి వెళ్తే.. ఒక వీధిలో కొంత మంది పిల్లలు హోలీ వేడుకను జరుపుకుంటున్నారు. వారంతా రోడ్డుపై వచ్చిపోయే వారిమీద రంగులను వేస్తున్నారు. ఈ క్రమంలో కొంత మంది పిల్లలు ఒక యువకుడిపై రంగులు వేశారు. పాపం.. అతడిని రంగులతో పూర్తిగా నింపేశారు. అతడిని ఆటపట్టించారు. ఆ బాలుడి చేతిలో ఒక పిచికారీ బాటిల్ ఉంది. కానీ అక్కడ రంగు నీళ్లు అతనికి అందుబాటులో లేవు. దీంతో అతనికి చిర్రెత్తుకొచ్చింది. (Boy Angry On Friends) వెంటనే అక్కడే ఒక చిన్న మురికి కాలువ ఉంది.

వెంటనే అక్కడికి వెళ్లి, ఆమురికి కాలువ లోని నీటిని తన పిచికారి పైపులో నింపుకున్నాడు. పరిగెత్తుకుంటూ వెళ్లి అక్కడ ఉన్న పిల్లలపై వేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పరిగెత్తుకుంటు వెళ్లి పోయాడు. ఇది ఎక్కడ జరిగిందో వివరాలు లేవు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో  (Social Media) వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. ఇది వెరే లెవల్ హోలీ.. అంటూ కామెంట్ లు పెడుతున్నారు.

First published:

Tags: Holi 2022, Viral Videos

ఉత్తమ కథలు