Home /News /trending /

వధువు చేసిన పనికి వామ్మో అనాల్సిందే.. వరుడికి మమూలు షాక్ ఇవ్వలేదుగా!.. Viral Video

వధువు చేసిన పనికి వామ్మో అనాల్సిందే.. వరుడికి మమూలు షాక్ ఇవ్వలేదుగా!.. Viral Video

(Image- Instagram)

(Image- Instagram)

ఇటీవలి కాలంలో పెళ్లి వేడుకలకు సంబంధించిన చాలా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్న సంగతి తెలిసిందే.

    ఇటీవలి కాలంలో పెళ్లి వేడుకలకు సంబంధించిన చాలా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్న సంగతి తెలిసిందే. జనాలు కూడా ఇలాంటి వీడియోలను ఇష్టపడటమే ఇందుకు కారణం. తాజాగా ఓ పెళ్లి వేడుకలో వరుడిపై వధువు(Bride) ఆగ్రహం చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇన్‌స్టాగ్రామ్‌లో official_niranjanm87 అనే యూజర్ ఈ వీడియోను పోస్ట్ చేశాడు. ఇందులో వధువు.. వరుడిని చెంప దెబ్బ కొడుతుంది. అంతేకాకుండా మరో వ్యక్తిని కూడా కోపంతో నెట్టివేస్తుంది. ఆ వీడియోలో ఏముందంటే.. వధువు, వరుడు పెళ్లి పీటలపై కూర్చుని ఉంటారు. ఇద్దరు పెళ్లి సంబంధించిన ఆచారాలను పూర్తి చేశారు. అదే సమయంలో వధువు అక్కడ ఉన్న వ్యక్తితో మాట్లాడటం ప్రారంభిస్తుంది.

    అతనితో వాగ్వాదానికి దిగడంతో అక్కడి వాతావరణం ఒక్కసారిగా వేడెక్కుతుంది. అతడు చెప్పిన మాటలతో కోపం పెంచుకున్న వధువు.. ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే అతడిపై చేయి చేసుకుంది. ఆ తర్వాత వధువు దృష్టి వరుడి(Bridegroom) వైపు మళ్లింది. అతడి కూడా వధువు ప్రశ్నించడం మొదలుపెట్టింది. గుట్కాకు సంబంధించి అతడిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. మండపంలో గుట్కా తింటావా అంటూ అతడిపై చేయి చేసుకుంది. దీంతో అక్కడున్న వారంతా నవ్వసాగారు. వరుడు మాత్రం భయపడుతూ లేచాడు. దీంతో అక్కుడున్నవారు మరింతగా నవ్వసాగారు.

    ఆత్మహత్య చేసుకుంటానని పోలీసులకు వీడియో పంపిన TikTok స్టార్.. అర్దరాత్రి పోలీసులు ఆమె ఇంటికి వెళ్లేసరికి..

    ఇక, ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో(Social Medi) వైరల్‌గా మారింది. ఇప్పటివరకు ఈ వీడియోను 37 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోపై కామెంట్ చేస్తున్న నెటిజన్లు ఫన్నీ ఏమోజీని జత చేస్తున్నారు.





    Nandita Saikia: కాలేజ్ నుంచి తిరిగి వస్తుండగా దారుణం.. షాక్‌లో నందిత కుటుంబ సభ్యులు.. ఇదంతా అతడి పనే..


    అయితే ఈ వీడియో నిజంగా జరిగిందా..?, లేదా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కోసం చేసిందా..? అనే దానిపై స్పష్టత లేకుండా పోయింది. అయితే ఇటీవలి కాలంలో ఇటువంటి వీడియోలు చాలా వరకు వైరల్‌గా మారుతున్నాయి. అందులో కొన్నింటికి సంబంధించిన వాస్తవాలు మాత్రమే వెలుగులోకి వస్తున్నాయి. చాలా వరకు వీడియోలు.. నిజంగా జరిగిందా, లేదా ఫన్ కోసం క్రియేట్ చేశారా అనే దానిపై స్పష్టత లేకుండా పోతుంది. కొన్ని ఆసక్తికరమైన వీడియోలలో నిజాల గురించి నెటిజన్లు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్న లాభం లేకుండా పోతుంది. దీంతో సోషల్ మీడియాలో వచ్చే ఏ వీడియోను  నమ్మాలో, ఏ వీడియోను నమ్మకూడదో తెలియని పరిస్థితి ఉందని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: Marriage, Viral Video

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు