• HOME
  • »
  • NEWS
  • »
  • TRENDING
  • »
  • VIRAL VIDEO AN ELEPHANT STANDING ON THE ROAD A TWO WHEELER COMING ON THE WAY WHAT HAPPENED NEXT WATCH FOREST VIDEO NK

Viral video: రోడ్డుపై ఏనుగు... అటుగా వచ్చిన టూవీలర్... ఆ తర్వాత షాకింగ్ సీన్

Viral video: రోడ్డుపై ఏనుగు... అటుగా వచ్చిన టూవీలర్... ఆ తర్వాత షాకింగ్ సీన్

Viral video: రోడ్డుపై ఏనుగు... అటుగా వచ్చిన టూవీలర్... (image credit - twitter)

Viral video: ఏనుగులు జనరల్‌గా మనుషుల జోలికి రావు. వాటికి తిక్కరేగితే మాత్రం మనుషుల్ని కూడా లెక్క చెయ్యవు. మరి రోడ్డుపై అడ్డంగా నిలబడిన ఏనుగు ఏం చేసిందో వీడియోలో చూసి తీరాల్సిందే.

  • Share this:
    Viral video: మనం రోడ్డుపై వెళ్తున్నప్పుడు... ఏ కుక్కో, పిల్లో కనిపిస్తే... అంతగా ఆశ్చర్యపోము. అదే ఏనుగు కనిపిస్తే... బోలెడంత ఆశ్చర్యపోతాం... ఆ ఏనుగు ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది... అదేమైనా చేస్తుందా... ఇలా ఎన్నో ప్రశ్నలు మన మైండ్‌లో తిరుగుతాయి. అఫ్‌కోర్స్ దాన్ని చూసినప్పుడు ఆ భారీతనం వల్ల మనకు కాస్త భయం కూడా వేస్తుంది. ఎందుకంటే అది వన్యప్రాణి కాబట్టి... ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తుందో అంచనాకి అందదు. ఐతే... ఈ భయమే ఒక్కోసారి లేనిపోని సమస్యలు తెస్తుంది. ఆ భయం వల్ల మనిషి తనకు తాను చిక్కుల్లో పడతాడు. ఎగ్జాక్ట్‌లీ ఈ వీడియోలో అదే జరిగింది. ఏనుగు సైలెంట్‌గా ఉన్నా... మనిషి మాత్రం టెన్షన్‌తో సమస్యలు తెచ్చుకున్నాడు.

    అసలేమైందంటే... ఓ ఏనుగు రోడ్డుపై అడ్డంగా నిలబడింది. దాన్ని చూసిన ఓ కారు వాహనదారు... తన కారును ఆపి... ఆ ఏనుగు ఎప్పుడు తప్పుకుంటుందా అని ఎదురుచూస్తున్నారు. ఇంతలో అటుగా మరో వ్యక్తి టూవీలర్‌పై వస్తూ... ఏనుగును చూశారు. లోలోపల భయపడుతూనే... ఎలాగొలా రోడ్డు దాటేద్దామని బయల్దేరి... ఏనుగును దాటిన తర్వాత... భయంతో వణుకు వచ్చి... రోడ్డుపైనే బండి స్కిడ్ అయి పడిపోయాడు. స్వల్ప గాయాలయ్యాయి. లేచి ఒంటికి అంటుకున్న మట్టిని తుడుచుకుంటుంటే.. ఆ ఏనుగు అలా చూస్తూ ఉండిపోయింది. కాస్త చూసుకొని వెళ్లొచ్చుగా... ఎందుకంత కంగారు అని అన్నట్లుగా ఆ ఏనుగు తీరు ఉంది. ఆ వీడియో మీరే చూడండి.


    ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ పర్వీన్ కస్వాన్... ఈ వీడియోని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. అది కాస్తా వైరల్ అయ్యింది. దీన్ని ఇప్పటికే లక్షా 72వేల మంది చూశారు. ఈ ఘటనలో ఏనుగు ఏమీ చెయ్యలేదు. ఆ టూవీలర్‌పై వచ్చిన వ్యక్తి తనకు తానుగా పడిపోయాడు. ఆ ఏనుగు రోడ్డు దాటే ఉద్దేశంతో రోడ్డుపైకి వచ్చి ఉంటుందని నెటిజన్లు భావిస్తున్నారు. పడిపోయిన వ్యక్తిని పైకి లేపడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఎందుకంటే అక్కడ ఏనుగు ఉంది. అది రెచ్చిపోతుందేమో అనే డౌట్ వారికి ఉంది.

    ఇది కూడా చదవండి: Viral video: ఆ పులి పేరు ఇండియా... దానికి అమెరికాలో గన్ గురిపెట్టాడు... ఆ తర్వాత...

    ఇలా ఓ చిత్రమైన పరిస్థితి రోడ్డుపై ఎదురైంది. మొత్తానికి ఆ ఏనుగు ఏమీ చెయ్యకపోవడంతో... అంతా ఊపిరి పీల్చుకున్నారు.
    Published by:Krishna Kumar N
    First published:

    అగ్ర కథనాలు