హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

వామ్మో.. బాత్రూం గోడల నుంచి రక్త స్రావం... షాకింగ్ వీడియో వైరల్..

వామ్మో.. బాత్రూం గోడల నుంచి రక్త స్రావం... షాకింగ్ వీడియో వైరల్..

బాత్రూమ్ లో ఎర్రటి రంగుగల ద్రవం

బాత్రూమ్ లో ఎర్రటి రంగుగల ద్రవం

Viral video: యువతి బాత్రూమ్ లోని గోడల నుంచి ఎర్రటి రంగుగల ద్రవం బయటకు రావడాన్ని గమనించింది. వెంటనే తన ఇంట్లో వారిని అలర్ట్ చేసింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Gujarat, India

కొన్నిసార్లు షాకింగ్ సంఘటనలు జరుగుతుంటాయి. ఇప్పటికీ కొందరు చేతబడి, బాణామతి, బ్లాక్ మ్యాజిక్ ఉన్నాయంటూ నమ్ముతుంటారు. ఇంట్లో గాలికి వస్తువులు కదిలిన ఏదో శక్తి దానివెనుక ఉందని తెగ జడుసుకుని చస్తుంటారు. ఇక అమ్మాయిల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇంట్లో ఒక్కరే ఉంటే అంతే సంగతులు. భయంతో తెగ వణికిపోతుంటారు. ప్రతిదానికి అనుమానపడి.. ఇతరులకు కూడా ఇబ్బందిపెడుతుంటారు. ఈ కోవకు చెందిన ఘటన వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. అమెరికాలోని (America) కాలిఫోర్నియాలో షాకింగ్ ఘటన జరిగింది. లెక్సీ చెడెస్టర్ అనే యువతి ఒక రోజు తన బాత్రూమ్ గోడల నుంచి ఎరుపు రంగు ద్రవం బయటకు రావడాన్ని గమనించింది. తొలుత ఏదో అయి ఉంటుందని భావించింది. కానీ అక్కడే మరకలు ఏర్పడి, ద్రవం కారుతుండటంతో తన ఇంట్లో వారిని అలర్ట్ చేసింది. అయితే.. తొలుత గోడలోపల ఏదో జీవి ఉండవచ్చు. అది చనిపోవడం వలన రక్తం వస్తుందేమోనని భావించారు. కానీ రోజు అదే పనిగా ద్రవం వస్తుండటంతో ఇదేంటని భయంతో వణికిపోయారు. దీంతో ఒక ప్లంబర్ ను పిలిపించారు.

అయితే.. అక్కడ బాత్రూమ్ చాలా ఏళ్ల క్రితం నిర్మించారు. దీంతో అక్కడ కొన్ని పగుళ్లు ఏర్పడ్డాయి. దీంతో నీళ్లు దాని లోపలికి వెళ్లిపోతున్నాయి. అక్కడ... ఇనుము తుప్పు పట్టి, ఇతర పదార్థాలు కలిసి పోయి.. అక్కడ ఎర్రటి ద్రవంగా బయటకు వస్తున్నట్లు గుర్తించారు. కేవవం లీకేజీ వలన ఇలా జరిగిందని, మరేంలేదని తెలిసి ఊపిరిపీల్చుకున్నారు. అయితే.. సంవత్సరాల తరబడి బాత్రూమ్ లో ఎక్సాస్టడ్ ఫ్యాన్ లేదని, నీళ్లు వెళ్లి ఇలా తుప్పుతో కలిసి ద్రవంగా బయటకు వస్తున్నట్లు గుర్తించింది. అయితే.. ఇది తనకు తెలియదని, మరేంటో అనుకొని తెగ భయపడిపోయానంటూ లెక్సీ చిడెస్టర్ అనే యువతి వీడియోలో తెలిపింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో (/social media) వైరల్ గా (Viral) మారింది.

Published by:Paresh Inamdar
First published:

Tags: America, Viral Video

ఉత్తమ కథలు