Video: బైక్‌పై వెళ్తూ లవర్స్ ఒకటే ముద్దులు.. ఆ తర్వాత ఏమైందంటే..

బైక్‌పై వెళ్తూ లవర్స్ ఒకటే ముద్దులు (image credit v- youtube)

Viral Video: ఏ పని ఎప్పుడు చెయ్యాలి అనేదానికి ఓ పద్ధతీ పాడూ ఉంటుంది కదా... ఆ లవర్స్ మాత్రం రోడ్డుపై వెళ్తూ సినిమా స్టైల్‌లో ముద్దులు పెట్టుకుంటున్నారు. ఆ తర్వాత ఏమైందో వీడియోలో చూద్దాం.

  • Share this:
    Viral Video: నాలుగు గోడల మధ్య చేసే పనులను నలుగురి మధ్యలో చెయ్యకూడదు. అది సభ్యత, సంస్కారం కాదు. ఈ విషయం తెలిసి కూడా ఆ లవర్స్ రెచ్చిపోయారు. రోడ్డుపై వెళ్తూ ముద్దుల ప్రపంచంలో మునిగిపోయారు. ఆమె సినీమాటిక్ స్టైల్‌లో బైక్ పెట్రోల్ ట్యాంక్‌పై రివర్సులో కూర్చుంది. అలా కూర్చొని ప్రయాణం చేయడం ప్రమాదకరం. దానికి తోడు ఈ ముద్దులు, కౌగలింతలు... చుట్టూ ఉన్న వాళ్లు, రోడ్డుపై వెళ్లే వాళ్లూ ఏమైనా అనుకుంటారని కూడా లేదు వాళ్లకు. సిగ్గు శరం, మానం మర్యాద అన్నీ రోడ్డుకు వదిలేశారు. గాలోళ్లలా తయారయ్యారు. అసలు ఇలాంటి పనులు చెయ్యకుండా ఆపాల్సిన అమ్మాయే... రెచ్చగొట్టి ఎంకరేజ్ చెయ్యడమేంటి?

    ఈ ఘటన జరిగింది బీహార్... గయలో. ప్రేమికులు ప్రేమించుకుంటే అది వారి ఇష్టం. కానీ మనం సమాజంలో ఉన్నప్పుడు కొన్ని హద్దులు, ఆచారాలు ఉంటాయి. వాటిని పాటించినప్పుడే ఆ ప్రేమకు అందరూ సపోర్ట్ చేస్తారు. మరీ ఇలా బరితెగిస్తే... బడితపూజ చేస్తారు. అక్కడా దాదాపు అదే పరిస్థితి ఎదురైంది.

    ఓ విలేజ్ రోడ్డుపై వెళ్తున్న ఆ జంటను గ్రామస్థులు అడ్డుకున్నారు. అయినా వినిపించుకోకుండా వెళ్తుంటే... వెంటపడి మరీ అడ్డుకున్నారు. ఆ తర్వాత "ఏంటిది... ఇల్లనుకున్నారా ఊరనుకున్నారా... ఇలాంటివి మా ఊళ్లో కుదరవ్... అంత ఒళ్లు తెలియట్లేదా" అంటూ గడ్డిపెట్టారు. అప్పటికి ఆ జంటకు బుద్ధొచ్చింది. ఆమె పెట్రోల్ ట్యాంక్ దిగి... వెనక ఎక్కి కూర్చుంది. బుద్ధిగా మాస్క్ పెట్టుకుంది. అతను కూడా హెల్మెట్ పెట్టుకున్నాడు. "ఇదీ పద్ధతి. ఇంకోసారెప్పుడైనా ఇలాంటివి చేస్తూ కనిపించారో మీకు మామూలుగా ఉండదు" అని గ్రామస్తులు వార్నింగ్ ఇచ్చి పంపారు. ఆ వార్నింగ్‌లో కొన్ని బూతులు కూడా తిట్టారు.

    ఆ వీడియోని ఇక్కడ చూడండి


    ఇది కూడా చదవండి: Video: పీకలదాకా తాగింది.. రోడ్డుపై పడుకుంది.. కర్మరా బాబూ...!

    ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గయ జిల్లాలోని ఏ గ్రామంలో ఇది జరిగిందో తెలియదు. ఊరోళ్లు... ఏ ఊరు మీది అని ఆ జంటను అడిగినప్పుడు అతను... అడ్రెస్ మిస్ అయ్యాం అని చెప్పాడు. బహుశా అది అబద్ధం కావచ్చు. అడ్రెస్ చెబితే... ఊరోళ్లు పోలీసులకు కంప్లైంట్ ఇస్తారనుకున్నాడేమో. నెటిజన్లు కూడా ఊరోళ్లను సపోర్ట్ చేస్తున్నారు. మరీ ఇంత ఓవరాక్షన్ ఎందుకు అని లవర్స్‌ని ఆడుకుంటున్నారు.
    Published by:Krishna Kumar N
    First published: