Video: ఒకే ట్రైన్.. ఒకే టైమ్‌లో రెండు రకాల వేగాలతో వెళ్లింది!.. ఎలా?

ఎలా వెళ్లింది (image credit - reddit)

Viral video: ఆ ట్రైన్ వీడియో చూసిన నెటిజన్లు కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. ఇది ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు. మరి దీనికి సమాదానం ఏంటో తెలుసుకుందాం.

  • Share this:
    Video: సోషల్ మీడియా అనేది ఫన్ మాత్రమే కాదు నాలెడ్జిని కూడా పెంచే అద్భుతమైన సాధనం. ఈ రోజుల్లో నెటిజన్లు సోషల్ మీడియాతో బాగా కనెక్ట్ అవుతున్నారు. తమకు చిత్రంగా, ఆశ్చర్యం (Shocking)గా అనిపించిన ప్రతీదీ ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ లాంటి వాటిలో ఫొటోలు, వీడియోల రూపంలో షేర్ చేస్తున్నారు. అలాంటివి చాలా సందర్భాల్లో వైరల్ (Viral) అవుతున్నాయి. అలాంటి ఓ వీడియో ఇప్పుడు అపర మేధావులను కూడా ఆలోచనలో పడేస్తోంది. దాన్ని చూసిన వాళ్లకు అది ఓ పట్టాన అర్థం కావట్లేదు. ఇదెలా సాధ్యం అనే ప్రశ్న వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది (confuse).

    ఎలా సాధ్యం:
    ఇది చాలా చిన్న వీడియో క్లిప్. అంతా కలిపి 8 సెకండ్లు మాత్రమే ఉంది. రెడ్డిట్‌లో కన్‌ఫ్యూజింగ్ పెర్‌స్పెక్టివ్స్ (Confusing Perspectives) అనే అకౌంట్‌లో ఇది ఉంది. ఇందులో ఓ వ్యక్తి రైల్లో ఉండి వీడియో షూట చేశారు. రైలు కంపార్ట్‌మెంట్‌లోని ఓవైపు కిటికీ అద్దంలోంచి చూస్తే... చాలా వేగంగా వెళ్తున్నట్లు కనిపిస్తోంది. రైలుకు మరోవైపు కిటికీ అద్దంలో చూస్తే నెమ్మదిగా వెళ్తున్నట్లు కనిపిస్తోంది. ఒకే రైలు ఒకే సమయంలో... ఓవైపు వేగంగా, మరోవైపు నెమ్మదిగా ఎలా వెళ్లగలుగుతోందన్నది ఆ వీడియో షూట్ చేసిన వ్యక్తి వేసిన ప్రశ్న.

    ఆ వీడియోని ఇక్కడ చూడండి:

    కన్‌ఫ్యూజ్ అయ్యారా... ఆశ్చర్యంగా ఉందా... ఈ చిన్న క్లిప్ తుఫానులా వైరల్ అయ్యింది. ఈ క్లిప్‌కి 49 వేల అప్ ఓట్లు వచ్చాయి. చాలా మంది దీన్ని చూసి కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. ఇంకా చెప్పాలంటే దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే... ఇదెలా సాధ్యం అనే ప్రశ్న వారిని ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు. మళ్లీ మళ్లీ వీడియోని చూసి... ఇలా అయి ఉంటుందా... అలా అయివుంటుందా అని ఆలోచిస్తున్నారు.

    ఇంగ్లీష్‌లో ఇన్సెప్షన్ (Inception) మూవీని గుర్తుచేస్తున్నారు చాలా మంది. ఆ సినిమాలో భవనాలు, కదిలే వాటిని కలల్లో కంట్రోల్ చేస్తారు. ఆ సినిమా కూడా చాలా మందికి ఒకసారి చూస్తే అర్థం కాలేదు. ఓ యూజర్ ఏమన్నారంటే "ఇది సాధ్యమే. ఇది లివర్‌పూల్ లైమ్ స్టేషన్. అక్కడ మలుపులు ఉండవు. ఇది పారాల్లాక్స్ ఎఫెక్ట్ (parallax effect). కటింగ్ సుమారుగా 14m/46ft వెడల్పు ఉంటుంది." అన్నారు.

    కొంతమంది యూజర్లు మరో కారణం చెప్పారు. ఎడమవైపున మరో ట్రైన్ ఫాస్టుగా వెళ్తోందని... అందువల్లే అలా కనిపిస్తోందని అన్నారు.

    ఇది కూడా చదవండి: video: సీలింగ్‌లో ఇరుక్కున్న బాలిక తల.. హర్రర్ మూవీలా ఉందన్న నెటిజన్లు!

    మరో యూజర్ ప్రకారం... రైల్లో వెళ్తున్నప్పుడు కిటికీ నుంచి చూసినప్పుడు పారాల్లాక్స్ ఎఫెక్ట్ వల్ల కుడివైపు రైలుకు దగ్గరగా గోడ ఉండటం వల్ల ఒక వేగం, ఎడమవైపు గోడ లేకపోవడం వల్ల మరో రకమైన వేగం కనిపిస్తోందని అన్నారు. ఇలా ఈ రైలు వీడియోపై పెద్ద చర్చే జరుగుతోంది.
    Published by:Krishna Kumar N
    First published: