Home /News /trending /

VIRAL VIDEO A CROW HUNT TELUGU YOUTUBER IN SERBIA FOR ONE WEEK WATCH THIS FUNNY VIRAL VIDEO NK

పగబట్టిన కాకి?.. సెర్బియాలో తెలుగు యూట్యూబర్‌ తిప్పలు.. వీడియో చూసి నవ్వుకోండి

పగబట్టిన కాకి?.. సెర్బియాలో తెలుగు యూట్యూబర్‌ తిప్పలు.. వీడియో చూసి నవ్వుకోండి (image credit - youtube)

పగబట్టిన కాకి?.. సెర్బియాలో తెలుగు యూట్యూబర్‌ తిప్పలు.. వీడియో చూసి నవ్వుకోండి (image credit - youtube)

Viral video: కాకులు పగబడతాయా... అవి ఎందుకు మనుషులపై దాడి చేస్తాయి?... కాకులకు మనుషుల్ని చంపేయాలి అనేంత కసి, కోపం ఉంటాయా... ఈ వీడియో చూశాక... మీకు ఏమనిపిస్తోంది.

    Viral video: యూరప్‌లోని సెర్బియా దేశంలో... తెలుగు యూట్యూబర్‌పై ఓ కాకి పగబట్టింది. అది నన్ను చంపాలని చూస్తోంది... దాని గోల భరించలేక నేను చచ్చిపోవాలి అనుకున్నా... అంటూ ఆ యూట్యూబర్ అన్వేష్ తన అవస్థలను నెటిజన్లతో పంచుకున్నారు. ప్రపంచ ట్రావెల్ అయిన అన్వేషన్... సెర్బియాలోని ఓ హోటల్‌లో దిగారు. అక్కడ ఆయన్ని ఓ కాకి చూసింది. అంతే ఆ రోజు నుంచి ఆయన బట్టలు గుర్తు పట్టేసి... అన్వేష్ ఎక్కడికి వెళ్లినా వెంటపడుతూ అరుస్తోంది అని అన్వేష్ చెప్పారు. ఆ కాకి నన్ను వదలట్లేదు అంటూ తన ఆవేదన చెప్పుకుంటున్నారు.

    "ఆ కాకి నేను ఎటు వెళ్లినా అరుస్తోంది. రెస్టారెంట్‌కి వెళ్తే అరుస్తోంది. మార్కెట్‌కి వెళ్లినా అంతే. ఎక్కడికి వెళ్లినా వెంటాడుతోంది. అసలు అది ఎందుకు అరుస్తోందో, ఎందుకు వెంటపడుతోందో అర్థం కావట్లేదు. నా బట్టలు, నా క్యాప్, నా కళ్లజోడు వల్ల అలా అరుస్తుందేమో." అంటూ ఆ వీడియోలో తన గోడు చెప్పుకున్నారు అన్వేష్.

    "ఇలాంటివి సినిమాల్లో చూస్తుంటాం కానీ నా నిజ జీవితంలో జరగం చిత్రంగా ఉంది. ఒక రోజు కాదు రెండు రోజులు కాదు ఏకంగా ఏడు రోజులు దానితో బాధపడ్డాను. చివరకి ఆ ప్లేస్‌ని ఖాళీ చేసి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. నా బాధను ఆధారాలతో చూపించడానికే వీడియో చేశాను" అంటూ వీడియోను యూట్యూబ్‌లో షేర్ చేశారు అన్వేష్. ఆ వీడియో మీరూ చూడండి.

    కాకులు పగ బడతాయా?
    ఈ వీడియోని చూసినప్పుడు ఆ కాకి పగబట్టినట్లు కనిపిస్తున్నా... నిజానికి అలా జరగదు అంటున్నారు నిపుణులు. హోటల్ ఉన్న చోట... కాకికి సంబంధించి ఏదో గూడు (Nest) ఉండి ఉంటుందనీ... దాన్ని ఎవరో పాడు చేయడంతో... ఆ సమయంలో... అక్కడ అన్వేష్ ఉండి ఉంటారనీ... దాంతో... అలా పాడు చేసింది అన్వేషే అని ఆ కాకి బలంగా నమ్మడం వల్లే అది వెంటపడుతోందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాకులు మనుషులకు హాని చెయ్యవనీ... కానీ... తమకు మనుషులు హాని చేస్తారు అని భావించినప్పుడు మాత్రం... కాకులు... ఇలా రివర్సు ఎటాక్ చేస్తున్నట్లు భయపెడతాయని చెబుతున్నారు.

    ఇది కూడా చదవండి: Viral video: వాటే డాన్స్... చిచ్చర పిడుగు... వీడియో చూస్తే ఫ్యాన్ అయిపోతారు

    ఏది ఏమైతేనేం... అన్వేష్... వారం తర్వాత కాకి గోలను వదిలించుకున్నారు. క్లైమాక్స్ కూల్‌గా ముగిసింది. ఓ ఫన్నీ వీడియోను నెటిజన్లకు ఇచ్చినట్లైంది.
    Published by:Krishna Kumar N
    First published:

    Tags: Viral Videos

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు