Home /News /trending /

VIRAL VIDEO 8 FEET TALL CROCODILE TURNED OUT TO BE IN THE HOUSE OF RAJASTHAN THE PEOPLE OF THE HOUSE LOST THEIR SENSES NK

Video: వామ్మో.. ఇంట్లోకి వచ్చిన మొసలి.. చుక్కలు చూపించిందిగా!

Video: వామ్మో.. ఇంట్లోకి వచ్చిన మొసలి.. చుక్కలు చూపించిందిగా! (image credit - youtube)

Video: వామ్మో.. ఇంట్లోకి వచ్చిన మొసలి.. చుక్కలు చూపించిందిగా! (image credit - youtube)

Viral Video: మన ఇళ్ల దగ్గరకు కాకులో, పావురాల వంటివో రావడం సహజం. మొసళ్లు వచ్చే సందర్భాలు చాలా తక్కువ. ఆ ఇంటి వాళ్లకు మాత్రం షాక్ తప్పలేదు. అసలా మొసలి ఏం చేసిందో తెలుసా?

    Viral Video: అది రాజస్థాన్... సవాయ్ మాధోపూర్ జిల్లాలోని... బహ్రావండా కుర్డ్ పట్టణంలోని న్యూ కాలనీ. అక్కడి ఓ ఇంటికి 8 అడుగుల మొసలి పాకుకుంటూ వచ్చేసింది. ఆ సమయంలో... ఇంట్లో సభ్యులు... వేడి వేడి పకోడి ఎలా వండుకోవాలి అనే దానిపై చర్చించుకుంటుంటే... ఇంట్లోని ఓ పాప... మొసలిని చూసింది. అది మొసలి అని వెంటనే గుర్తుపట్టింది. గట్టిగా మొసలి మొసలి అని అరిచింది. అంతే... కుటుంబ సభ్యులు ఏంటా అని అటు చూస్తే... నిజంగానే క్రొకడైల్ అక్కడుంది. అప్పటికే ఇంట్లోకి వచ్చేసింది. ఇంకా లోపలికి వద్దామా వద్దా అన్నట్లు వాళ్లను చూడసాగింది. అంతే... ఒక్కసారిగా కలకలం రేగింది. పెద్ద పెద్ద అరుపులు ఆ ఇంటి నుంచి వినిపించాయి.

    చుట్టుపక్కల వాళ్లు ఏ హత్యో జరుగుతుందేమో అనుకొని హడావుడిగా వచ్చి చూస్తే... ఎదురుగా మొసలి ఉంది. ఇంట్లో వాళ్లేమా... చీపుర్లూ, క్రికెట్ బ్యాట్ వంటి వాటితో... మొసలిని వెనక్కి పంపేందుకు ప్రయత్నిస్తున్నారు. విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు కాల్ చేశారు. పోలీసులు... ఫారెస్ట్ అధికారులకు విషయం చెప్పారు. ఆ అధికారులు తాళ్లతో వచ్చి... మొసలికి మాంసం వేసి... మెల్లగా తాడులో మొసలి తల ఇరుక్కునేలా చేశారు. ఆ తర్వాత దాన్ని జాగ్రత్తగా లాక్కెళ్లి... ఓ వ్యానులో బంధిస్తుంటే... మళ్లీ ఆ మొసలి బయటకు వచ్చేసేందుకు రకరకాలుగా ప్రయత్నించింది. అయినప్పటికీ స్థానికులు, అధికారులు అందరూ కలిసి దాన్ని లోపల బంధించారు. ఇలా ఎవరికీ ఏ హానీ కాకుండా, మొసలి కూడా గాయపడకుండా... అంతా ముగిసింది.

    ఆ వీడియోని ఇక్కడ చూడండి

    మొసలి ఎక్కడి నుంచి వచ్చింది?
    2 గంటలు కష్టపడితే గానీ ఆ మొసలి చిక్కలేదు. అంత మొండిగా అది ఉండటానికి కారణం ఏంటంటే... ఆ ఇళ్లకు దగ్గర్లోనే ఓ చెరువు ఉంది. ఆ చెరువులో చేపలు తింటూ ఈ మొసలి హాయిగా జీవించేంది. రాన్రానూ ఆక్రమణలు పెరగడం, చెరువులో చేపల్ని పట్టుకుపోవడం, నీరు తగ్గిపోవడం ఇలా మొసలి వైపు నుంచి చూస్తే అన్నీ అనర్థాలే జరిగాయి. దాంతో... ఆకలిక అలమటిస్తూ ఆ మొసలి... ఆగ్రహంతో రగిలిపోసాగింది. చెరువులో ఆహారం లేకపోవడంతో... ఆకలి ఎక్కువై ఇళ్లవైపు వచ్చింది. అందుకే అది అంత కోపంగా ఉంది.

    ఇది కూడా చదవండి: Video: పీకలదాకా తాగింది.. రోడ్డుపై పడుకుంది.. కర్మరా బాబూ...!

    ఆ మొసలిని పుష్టిగా ఆహారందొరికే పెదద చంపల్ నదిలో వదిలేస్తామని అధికారులు చెప్పారు. ఇలా... ఆ మొసలి ఇళ్లలోకి రావడం దానికే కలిసొచ్చింది అనుకోవచ్చు. హ్యాపీ ఎండింగ్.
    Published by:Krishna Kumar N
    First published:

    Tags: Viral, VIRAL NEWS, Viral Video

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు