హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

అమ్మబాబోయ్.. బతికున్న కొండ చిలువను మింగేసిన కింగ్ కోబ్రా... వీడియో వైరల్..

అమ్మబాబోయ్.. బతికున్న కొండ చిలువను మింగేసిన కింగ్ కోబ్రా... వీడియో వైరల్..

కొండ చిలువను మింగిన పాము

కొండ చిలువను మింగిన పాము

Viral video: ఇంటి ఆవరణలోని చెట్ల మధ్యలో ఏదో చప్పుడు వస్తుందని ఇంట్లో ఉన్న వారు.. మెల్లగా వెళ్లి చూశారు. అక్కడ ఒక కింగ్ కోబ్రా, కొండ చిలువ ఉన్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Odisha (Orissa), India

మనలో చాలా మందికి పాములంటే చచ్చేంత భయం. పొరపాటున పాము కన్పిస్తే ఆ ప్రదేశం దరిదాపుల్లోకి వెళ్లడానికి కూడా ఇష్టపడరు. అసలు.. మరికొందరు.. పాము పేరు ఎత్తడటానికి కూడా సాహాసించరు. కొన్నిసార్లు.. పాములు ఆహారం అన్వేషణలో ఇళ్లలోనికి, పొలాల్లోకి వస్తుంటాయి. అవి ఎలుకలు, వాటి కన్న చిన్న సర్పాలు తింటుంటాయి. ఈ క్రమంలో.. కొన్నిసార్లు.. మనుషులను కాటువేస్తే, ఇంకొన్నిసార్లు పాములు మనుషులు చేతిలో బలైన సంఘటనలు కూడా ఉన్నాయి. అయితే.. మరికొందరు పాములు కన్పిస్తే స్నేక్ హెల్స్ సొసైటీవారికి సమాచారం ఇస్తుంటారు. ఇలాంటి ఎన్నో ఘటనలను మనం గతంలో చూశాం. ఇప్పుడు మరో షాకింగ్ వీడియో వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. ఒడిషాలోని (Odisha)  భయంకర ఘటన జరిగింది. స్థానికంగా ఉన్న ఒక ఇంటి ఆవరణలో ఆరడుగుల పాము.. మరో కొండ చిలువను మింగేసింది. అంతే కాకుండా.. కాసేపు అక్కడ అవి రెండు కూడా పెనుగులాడుకున్నాయి. ఇంతలో పెద్దగా శబ్దం వస్తుండటంతో ఇంట్లోని వారు అక్కడికి వెళ్లి చూశారు.అప్పుడు.. కొబ్రా.. కొండ చిలువున తొలుత మింగేసింది. ఆతర్వాత.. చూస్తుండగానే బయటకు ఉమ్మేసింది. దీన్ని గమనించిన అక్కడి ఇంటి వారు.. స్నేక్ హెల్స్ సొసైటీవారికి సమాచారం ఇచ్చారు. వారు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు.

' isDesktop="true" id="1415160" youtubeid="ZyzTUNpnm98" category="national">

పాము అప్పటికే, కొండ చిలువను ఉమ్మివేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట (Social media) వైరల్ గా మారింది. స్నేక్ హెల్స్ సొసైటీవారు.. పామును బంధించి, దగ్గరలోని అడవిలో వదిలిపెట్టారు. దీన్ని చూడటానికి జనాలు గుంపులు, గుంపులుగా తరలివచ్చారు. పాముల ఫోటోలు తీశారు. అదే విధంగా.. సెల్ఫీలు దిగారు. వీడియోలు కూడా తీసుకున్నారు. ఇప్పుడిక వీడియో వైరల్ గా (Viral video)  మారింది.

ఇదిలా ఉండగా పెళ్లిలో కొత్త జంట చేసిన పనిప్రస్తుతం ఫన్నీగా మారింది.

పెళ్లి వేడుక గ్రాండ్ గా జరుగుతుంది. కొత్త జంట అదిరిపోయే కాస్టూమ్ వేసుకున్నారు. ఇద్దరు కూడా కుంకుమ రంగులో మ్యాచింగ్ వస్త్రాలు ధరించారు. అతిథులు, బంధువులు, స్నేహితులు పెద్ద ఎత్తున హజరయ్యారు. అప్పుడు కొత్త జంట ఒకరి నోటిలో మరోకరు తీపి పదార్థాలను తినిపించుకుంటున్నారు. అప్పుడు షాకింగ్ ఘటన జరిగింది. వరుడి నోట్లో వధువు.. ప్లేట్ లో ఉన్న స్వీట్ పెట్టడానికి ట్రై చేసింది. కానీ దీనికి వరుడు నిరాకరించాడు. ఆమెకు అందకుండా దూరంగా జరిగాడు.

దీంతో వధువు చిర్రెత్తుకొచ్చింది. అతని మీద పడి మరీ తినిపించడానికి ట్రైచేసింది. దీంతో ఇద్దరు ఒకరిని మరోకరు తోసుకుంటున్నారు. సరదాగా చేసిన పనికాస్త.. కొత్త జంట కొట్టుకొవడం వరకు వెళ్లింది. అక్కడ ఉన్న వారు.. ఆపడానికి ప్రయత్నించినప్పటికి ఎవరు తగ్గడంలేదు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో వివరాలు లేవు. ప్రస్తుతం ఈ వీడియో మాత్రం వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. అవాక్కవుతున్నారు.. మరికొందరు.. ఇదేందిరా నాయన అంటూ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.

First published:

Tags: Odisha, Python, Snake, Viral Video

ఉత్తమ కథలు