హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

వామ్మో... మెట్రో లో ఇద్దరు అమ్మాయిల మధ్య ఫైటింగ్.. కారణం తెలిస్తే నోరెళ్లబెడతారు..

వామ్మో... మెట్రో లో ఇద్దరు అమ్మాయిల మధ్య ఫైటింగ్.. కారణం తెలిస్తే నోరెళ్లబెడతారు..

గొడవకు దిగిన మహిళలు

గొడవకు దిగిన మహిళలు

Viral Video: మెట్రోలో ఒక యువతి ఎక్కింది. అప్పటికే అక్కడి సీటులో మరో మహిళ కూర్చోని ఉంది. కాస్త ప్లేస్ ఇమ్మంటే.. జాగలేదని చెప్పింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Delhi, India

కొంత మంది ప్రతి చిన్నవిషయానికి ఎదుటివారితో గొడవలకు దిగుతుంటారు. మనం తరచుగా బస్సులో లేదా రైల్వేలలో ఎక్కువగా జర్నీ చేస్తుంటాం. అయితే.. కొంత మంది బస్సు, ట్రైన్ తమ సొంతానిదన్నట్లు ప్రవర్తిస్తుంటారు. కోచ్ లోని సీటును పూర్తిగా ఆక్రమించుకుని మరీ కూర్చుకుంటారు. కనీసం కూర్చొవడానికి ఇతరులకు అవకాశం కూడా ఇవ్వడానికి ఇష్టపడరు. పైగా ఏమన్నాఅంటే.. పొట్లాటకు సిద్ధంగా ఉంటారు. మరికొంత మంది సీటు ఇవ్వమంటే నానా హాంగామా చేస్తుంటారు. ఇప్పటి వరకు మనం యువతులు లవర్ కోసం, వస్తువుల కోసం, జుట్లు పట్టి కొట్టుకున్న అనేక వీడియోలు చూశాం. అదే విధంగా గతంలో.. సీటు కోసం ఇద్దరు పెద్దవాళ్లు కొట్టుకున్న వీడియో కూడా వైరల్ గా మారింది. ఈ కోవకు చెందిన ఘటన వైరల్ గా మారింది.

పూర్తి వివరాలు.. ఢిల్లీ (Delhi)  మెట్రో రైల్వే స్టేషన్ లో (Metrorail) షాకింగ్ ఘటన జరిగింది. ఒక యువతి మెట్రో రైలు లో లేడిస్ కంపార్ట్ మెంట్ ఎక్కింది. అప్పటికే అక్కడ మరోక మహిళ, మరికొందరు కూర్చుని ఉన్నారు. ఈ క్రమంలో మహిళ సీటుపక్కన తన బ్యాగ్ ను కూడా పెట్టుకుని కూర్చుంది. మెట్రో ఎక్కిన అమ్మాయి, కాస్త జరగమని కోరింది. దీంతో మహిళ, ఆమెతో వాగ్వాదానికి దిగింది.


అంతే కాకుండా.. ఇక్కడ సీటు లేదని తేల్చి చెప్పింది. కనీసం కూర్చోడానికి సీటు కూడా ఇవ్వలేదు. అంతటితో ఆగకుండా జరిగేది లేదని, ఆమెతో పోట్లాటకు దిగింది. లోకల్ ట్రైన్ లో ఉన్న ఇతర ప్రయాణికులు చెబుతున్న ఆమె పట్టించుకోలేదు. కానీ.. యువతి తానేం తక్కువకాదన్నట్లు ఆమెను జరిపి మరీ అక్కడ సీటు మీద కూర్చుంది. ప్రస్తుతం వీరి మధ్య ఫన్నీ కన్వర్జేషన్ కాస్త వైరల్ గా (Viral video) మారింది.

ఇదిలా ఉండగా ఉత్తర ప్రదేశ్ లో (Uttar pradesh) వింత సంఘటన జరిగింది.

లలిత్ పూర్ నియోజక వర్గానికి చెందిన సచిన్ సాహు అనే పొలిటిషియన్, అభయ్ నామ్ దేవ్ అనే 16 ఏళ్ల బాలుడిని ఇంట్లో పనికి పెట్టుకున్నాడు. అయితే.. అతను ఇంట్లో పనిచేస్తుండగా ఏదో పొరపాటు చేశారు. దీంతో సచిన్ సాహు రెచ్చిపోయాడు.

అభయ్ నామ్ దేవ్ ను నోటికొచ్చినట్లు తిట్టాడు. అంతే కాకుండా.. కోపంతో అతని ముక్కును కసితీరా కొరికాడు. దీంతో బాలుడికి తీవ్ర రక్తస్రావమైంది. వెంటనే అతడిని కుటుంబ సభ్యులు ఝాన్సీ మెడికల్ కాలేజీకి ఆస్పత్రికి తరలించారు. అతడికి వైద్యులు చికిత్స అందించారు. అయితే.. బాలుడు కుటుంబ సభ్యులు మాత్రం ఇప్పటి వరకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. ప్రస్తుతం ఈ ఘటన మాత్రం సోషల్ మీడియాలో (Social media) లో తెగ చక్కర్లు కొడుతుంది.

First published:

Tags: Delhi, Delhi metro, Viral Video

ఉత్తమ కథలు