Home /News /trending /

VIRAL VIDEO 2 BULLS STRAY INTO WEDDING BAARAT LOCK HORNS IN A VICIOUS FIGHT DELHI PAH

ఇదేం లొల్లిరా నాయన.. పెళ్లి బరాత్ లో ఎద్దుల హల్ చల్.. వైరల్ గా మారిన షాకింగ్ వీడియో..

బరాత్ ఎద్దుల హల్ చల్..

బరాత్ ఎద్దుల హల్ చల్..

Viral video:పెళ్లి బరాత్ గ్రాండ్ గా జరుగుతుంది. ఇంతలో రెండు ఎద్దులు అక్కడ ప్రత్యక్ష మయ్యాయి. ఒక దానికి మరోకటి కుమ్ముకోవడం ప్రారంభించాయి.

సోషల్ మీడియా (Social media)  ట్రెండ్ నడుస్తోంది. ఎక్కడ ఏంజరిగిన కొన్ని ఘటనలు.. క్షణాల్లో వైరల్ గా మారిపోతున్నాయి. కొన్ని వెరైటీగా ఉంటే, మరికొన్ని షాకింగ్ కు గురిచేసేలా ఉంటున్నాయి. వెరైటీ వీడియోలను చూడటానికి నెటిజన్లు సైతం ఆసక్తి చూపిస్తున్నారు. కొన్ని జంతువులు అప్పుడప్పుడు క్రూరంగా తలపడుతుంటాయి. మనం తరచుగా.. అడవిలో సింహాలు, పులులు, తదితర జంతువులు తలపడుతుంటాయి.

కొన్ని సార్లు.. మనగ్రామంలో ఎద్దులు తలపడటం, మేకలు, పొట్టెలు పొట్లాడటం మనకు తెలిసిందే. కొన్ని సార్లు పెళ్లి వేడుకలో అనుకొని సంఘటనలు జరుగుతాయి. కొన్ని ఎమోషనల్ గా ఉంటే.. మరికొన్ని షాకింగ్ కు గురిచేసేలా కూడా ఉంటాయి. ఈ కోవకు చెందిన ఘటన వైరల్ గా (viral video) మారింది.








View this post on Instagram






A post shared by Gidda company (@gieddee)





పూర్తి వివరాలు.. ఢిల్లీలో (Delhi)  జరిగిన పెళ్లి బరాత్ లో షాకింగ్ ఘటన జరిగింది. బరాత్ వేడుకలో.. బంధువులు, స్నేహితులు పెద్ద ఎత్తున హజరయ్యారు. అందరు పెళ్లి వేడుకలో ఉల్లాసంగా గడుపుతున్నారు. ఇంతలో షాకింగ్ ఘటన జరిగింది. ఎక్కడ నుంచి వచ్చాయో కానీ రెండు ఎడ్లు పెళ్లి బరాత్ లో ప్రత్యేక్షమయ్యాయి. ఒక దానికొకటి మరోకటి కుమ్ముకొవడం ప్రారంభించాయి. ఏమాత్రం తగ్గకుండా ఒకదానిపై మరోకటి దాడి చేసుకుంటున్నాయి. అక్కడున్న వారంతా భయంతో దూరంగా వెళ్లిపోతున్నారు. కొంత మంది ఎద్దులు ఢీకొనడం వలన కింద పడుతున్నారు. మరికొందరు.. దూరంగా పారిపోతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇదిలా ఉండగా.. సముద్రంలో ఒక బోట్ పైన షార్క్ దాడికి పాల్పడింది.

అమెరికాలోని మసాచుసెట్స్ తీరంలో ఊహించని ఘటన జరిగింది. ప్లైమౌత్‌లోని వైట్ హార్స్ బీచ్ ప్రాంతంలో ఉదయం 10 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగిందని ఒక నివేదికలో పేర్కొంది. కొంత మంది సముద్రంలో బోట్ పైన ప్రయాణిస్తున్నారు. అప్పుడు అనుకొని సంఘటన జరిగింది. అప్పుడు.. ఒక పెద్ద తిమింగిలం ఎగిరి.. బోట్ పైన పడింది.

బోట్ దాదాపు.. 19 అడుగుల పెద్దదిగా ఉంది. అక్కడున్న వారు భయంతో వణికిపొయారు. పొరపాటున.. వేల్ ధాటికి బోట్ బోల్తా పడుంటే.. తమపరిస్థితి ఏంటని అనుకుంటున్నారు. అయితే.. తీరంలో ఉన్న ఒక వ్యక్తి మసాచు సెట్స్ సముంద్రం అందాలను రికార్డుచేస్తుండగా దానిలో ఈ ఘటన రికార్డు అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గామారింది.
Published by:Paresh Inamdar
First published:

Tags: Delhi, Viral Video

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు