Viral Video: సాధారణంగా కొంత మంది వృద్ధాప్యంలోనూ రకారకాల రికార్డులను సాధిస్తారు. యువతకు.. తాము ఏ మాత్రం తీసిపోని విధంగా అన్నింటిలో పోటీ పడతారు. ప్రస్తుతం థాయిలాండ్ (Thailand) దేశానికి చెందిన సవాంగ్ జన్ ప్రామ్ అనే వృద్ధుడు 102 ఏళ్ల వయసులోను రన్నింగ్ (Running) లో ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఆయన సాధించిన రికార్డును చూసి..
ఏదైన సాధించాలనే తపన, చేయాలనే సంకల్పం ఉన్నవారు తమ వయసు గురించి ఆలోచించరు. సాధారణంగా మనలో చాలా మంది ఒక వయసు రాగానే.. ఇంట్లో ఉంటూ సరదాగా కాలక్షేపం చేస్తుంటారు. మనవళ్లతో ఆడుకుంటూ లేదా గార్డెనింగ్ చేస్తుంటారు. మరి కొందరు మాత్రం.. వినూత్నంగా ఆలోచిస్తూ యువతకు స్ఫూర్తీగా నిలుస్తారు.
Sawang Janpram, 102, broke the Thai 100m record – for centenarians – at the annual Thailand Master Athletes Championships https://t.co/GZcaQGrAoR pic.twitter.com/OxqGLiXySI
— Reuters (@Reuters) March 3, 2022
ఇప్పటికే కొంత మంది పెద్ద వయసులోను అనేక డిగ్రీలు, పీహెచ్ డీలు చేసిన వార్తలు మనం తరచుగా చూస్తునే ఉంటాం. మరికొందరు తమ మనువళ్లతో కలిసి.. రన్నింగ్, జిమ్ లు మొదలైనవి చేస్తుంటారు. అప్పట్లో వారు తీసుకునే ఆహరంలో అనేక పోషకాలు ఉండేవని భావిస్తారు. రసాయనాలు, ఎరువులు లేకుండా తయారైన ఆహరంను తీసుకొవడం వలన వారు ఆరోగ్యంగా ఉంటారని పలు పరిశోధనలు వెల్లడించాయి.
అయితే, ఇప్పటికి కొన్నిచోట్ల వృద్ధులు రన్నింగ్ .. పలు రకాల ఆటలలో పాల్గొవడం మనకు తెలిసిందే. ఈ కోవకు చెందిన ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో(Social Media) వైరల్ మారింది. పూర్తి వివరాలు.. సవాంగ్ జన్ ప్రామ్ అనే వృద్ధుడికి 102 ఏళ్లు. ఆయన థాయిలాండ్ (Thailand) దేశానికి చెందిన వాడు. ఆయన ఇప్పుడు కూడా.. ఏదైన.. సాధించాలనుకున్నారు.
దీంతో ఆయన చేసిన పని యువతకు ఆదర్శంగా నిలిచింది. ఆగ్రేయాసియాలో వృద్ధుల పరుగుపందెం పోటీలు జరిగాయి. దీనిలో 102వ ఏళ్ల సవాంగ్ జన్ ప్రామ్ పాల్గొన్నారు. ఆయన 100 మీటర్ల పరుగు పందెం (Running event) పోటీని కేవం 27.08 సెకన్ లలో పూర్తి చేసి ప్రపంచ రికార్డు సాధించారు. ప్రస్తుతం ఆయన వృద్ధులలో ప్రపంచ రికార్డును నెలకొల్పారు. దీనిపై ఆగ్నేయాసియా అథ్లెటిక్స్ ప్రెసిడెంట్ స్పందించారు.
తాము.. ఈ పరుగు పందెం ఈవెంట్ ను 1996 నుంచి నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తొలుత ఈ పోటీలలో కేవలం 300 మంది మాత్రమే పాల్గొన్నారన్నారు. ప్రస్తుతం దీనికి క్రేజ్ పెరిగిందన్నారు. నేడు దాదాపు 2000 వేల వరకు పరుగు పందెంలో పాల్గొన్నారని అన్నారు. 102 ఏళ్ల వయసులోను ఆయన సాధించిన రికార్డు ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Thailand, VIRAL NEWS, Viral Videos