వావ్... తెలివైన మేక... కేటీఆర్ ఆ ట్వీట్ లైక్ చేశారుగా...

KTR : సాధారణంగా మేకలు... తమకు అందే ఆకులూ, అలములూ తింటూ గడిపేస్తాయి. అలాంటిది ఆ మేక మాత్రం తన తెలివితేటలతో అందర్నీ ఆశ్చర్య పరిచింది.

Krishna Kumar N | news18-telugu
Updated: June 17, 2019, 1:08 PM IST
వావ్... తెలివైన మేక... కేటీఆర్ ఆ ట్వీట్ లైక్ చేశారుగా...
వైరల్ అవుతున్న ట్వీట్ (Image : Twitter )
  • Share this:
బాలీవుడ్ నటుడు జావేద్ జాఫ్రీ పెట్టిన ఓ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఓ పల్లెటూరిలో జరిగిన సీన్‌కి సంబంధించిన వీడియో అది. ఇండియా గోట్ (Goat) టాలెంట్ అంటూ ఆయన ఈ ట్వీట్ పెట్టారు. ఇందులో ఆకలితో ఉన్న ఓ మేక... తనకు అందనంత ఎత్తులో ఉన్న చెట్టు ఆకులను తినాలని అనుకుంది. కానీ... అవి అందే పరిస్థితి లేదు. ఐతే... ఇక్కడే ఆ మేక తన తెలివితేటల్ని ఉపయోగించింది. చెట్టు పక్కనే దాణా తింటున్న గేదెపైకి ఎక్కిన మేక... అక్కడి నుంచీ ఆకుల్ని అందుకొని తినసాగింది. ఇందుకు ఆ గేదె కూడా సహకరించింది. మేకను ఏమీ అనకుండా తన దాణా తాను తినసాగింది. ఈ వీడియో ఎంతలా వైరల్ అవుతోందంటే... టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దీన్ని లైక్ చేశారు. ఇప్పటికే దీనికి 11 వేలకు పైగా లైక్స్ వచ్చాయి. 

ఇవి కూడా చదవండి :మియామీ బీచ్‌లో మహిళ అరెస్ట్... తాబేలు గూడు పాడు చేసిందని...

వాళ్లిద్దరూ లవర్స్... ఆతనిపై యాసిడ్ పోసి... తనపైనా పోసుకుంది... ఎందుకంటే...

కానిస్టేబుల్ కామ పురాణం... అర్థరాత్రి యువతిని బ్లాక్‌మెయిల్ చేసి...
First published: June 17, 2019, 1:08 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading