తల్లి నుంచీ తప్పిపోయిన బాతు పిల్లలు... ఆ కారు డ్రైవర్ ఏం చేశాడంటే...

Rome : కొన్ని కొన్ని విషయాలు తెలుసుకున్నప్పుడు ఆ మంచి పని చేసిన వాళ్లను మెచ్చుకోవాలి అనిపించడం సహజం. ఈ కథలో జరిగింది అలాంటిదే.

Krishna Kumar N | news18-telugu
Updated: May 18, 2019, 2:12 PM IST
తల్లి నుంచీ తప్పిపోయిన బాతు పిల్లలు... ఆ కారు డ్రైవర్ ఏం చేశాడంటే...
బాతు పిల్లల్ని కాపాడిన డ్రైవర్ (Image : @Scott Hefti / Twitter)
  • Share this:
అది రోమ్‌లోని ఓ బిజీ రోడ్డు. ఎప్పుడూ వాహనాల రాకపోకలతో రద్దీగా ఉంటుంది. అసలు చుట్టూ ఏం జరుగుతుందో కూడా గమనించేంత టైం కూడా లేనంత బిజీలో ఉంటారు అక్కడి ప్రజలు. అఫ్‌కోర్స్ ఈ రోజుల్లో మనం కూడా అలాగే బిజీ అవుతున్నామనుకోండి. ఐతే... రోమ్‌లో తన యజమానిని కారులో తీసుకెళ్తున్న డ్రైవర్ సడెన్‌గా ఓ చోట కారు ఆపాడు. ఏమైంది... ఏమైనా ప్రాబ్లమా అని అడిగిందామె. జస్ట్ వెయిట్ మేమ్ అంటూ కారు దిగాడు. ఆమె కాస్త అయోమయంతో ఉంటూనే... ఆఫీస్‌కి టైమైపోతోంది. వాట్ హ్యాప్పెండ్ అని ఒకింత విసుగ్గా అడిగింది. ఆ మాటలు పట్టించుకోని ఆ డ్రైవర్... రోడ్డు దాటి అవతలికి వెళ్లాడు. అక్కడ తల్లి దగ్గరకు చేరలేక ఇబ్బంది పడుతున్న మూడు బాతు పిల్లల్ని జాగ్రత్తగా పట్టుకొని... గట్టుపై పెట్టాడు. అప్పటివరకూ తల్లిని ఎలా చేరాలోనని రోడ్డుపై టెన్షన్ పడుతున్న ఆ డక్లింగ్స్... గట్టుపై వదలగానే పరిగెడుతూ వెళ్లి తల్లి బాతును చేరాయి. ఆ దృశ్యాన్ని వీడియో తీసిన కారు యజమాని స్కాట్ హెఫ్టీ... ట్విట్టర్‌లో షేర్ చేసింది.ఇప్పుడీ వీడియో వైరల్ అయ్యింది. కొన్ని గంటల్లోనే దీన్ని 8 వేల మంది చూడగా... 1300 లైక్స్ వచ్చాయి. ఆమ్ ఆద్మీ పార్టీ నేత అల్కా లంబా ఈ వీడియోని రీట్వీట్ చేశారు.

 ఇవి కూడా చదవండి :

వామ్మో మోతే... ఇక రైల్వే పట్టాలపై చెత్త వేస్తే భారీ ఫైన్...

లగడపాటి సర్వే సిద్ధం... ఎగ్జిట్‌ పోల్స్ ఏం చెప్పినా...

చంద్రబాబుకి బూస్ట్ ఇస్తున్న సబ్బం హరి... టీడీపీ గెలుపుపై ఆయన విశ్లేషణ ఏంటంటే...

Bigg Boss 13 : బిగ్ బాస్ 13లో పసుపు చీర పోలింగ్ అధికారి..?

బిడ్డకు జన్మనిచ్చిన యువతి... తను గర్భవతి అనే తెలియదట...
First published: May 18, 2019, 2:12 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading