Home /News /trending /

VIRAL TRUCK CARRYING COOKING GAS FALLS DOWN STEEP VALLEY IN POK INTERNET SHOCKED PAH

Viral: వామ్మో.. చూస్తుండగానే లోయలో పడ్డ భారీ ట్రక్.. క్లిప్పింగ్స్ వైరల్..

లోయలో పడిపోతున్న లారీ

లోయలో పడిపోతున్న లారీ

Pakistan: రోడ్డుపక్కన ఒక భారీ ట్రక్ ఉంది. ఇంతలో అది ఒక్కసారిగా మరోకవైపుగా వాలిపోయింది. అక్కడివారు.. డ్రైవర్ ను అప్రమత్తం చేస్తున్నారు. అప్పుడు షాకింగ్ ఘటన జరిగింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Rajasthan, India
కొన్నిసార్లు మనం రోడ్లపై వెళ్తున్నప్పుడు అనుకొని ప్రమాదాలు జరుగుతుంటాయి. కళ్లముందే ఒళ్లుగగుర్పొడిచే ఘటనలు జరుగుతుంటాయి. ఇలాంటి రోడ్డుప్రమాదాలు చూసినప్పుడు వెన్నులో వణుకుపుడుతుంది. వెహికిల్స్ కొన్నిసార్లు.. అదుపుతప్పి ప్రమాదాల బారిన పడుతుంటాయి. మరికొన్నిసార్లు.. తాగి వాహనాలు నడపడం, ఓవర్ లోడ్, స్కిడ్ అయి కూడా తరచుగా ప్రమాదాలు (Road accident) జరుగుతుంటాయి. కొండ ప్రాంతాలు, ఎత్తైన పర్వత ప్రాంతాల నుంచి అనేక వెహికిల్స్ బ్యాలెన్స్ తప్పి కింద పడిన అనేక ఘటనలు వార్తలలో నిలిచాయి. తాజాగా, మరో భయానక ప్రమాదం వైరల్ గా మారింది.

పూర్తి వివరాలు.. పాకిస్థాన్ లో (Pakistan) ఘోర ప్రమాదం సంభవించింది. పాక్ ఆక్రమిత కశ్మీర్ లో పరిధిలోని ముజఫరాబాద్ లో ఈ సంఘటన జరిగింది. ఒక ఎల్పీజీ గ్యాస్ తో ఉన్న లారీ ఇరుకైన మార్గం గుండా ప్రయాణిస్తుంది. ఇంతలో అది కాస్త బ్యాలెన్స్ అవుట్ అయ్యింది. పక్కన పెద్ద లోయ ఉంది. అక్కడున్న డ్రైవర్ కు లారీ కంట్రోల్ కాలేదు. వెనుకవైపున ఉన్నవారు అరుస్తున్న వినిపించుకోలేదు.



అందరు చూస్తుండగానే.. లారీ బోల్తాపడి ఒక్కసారిగా లోయలోనికి పడిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో (Viral news) మాత్రం నెట్టింట తెగ వైరల్ గా మారింది. మరీ అందులోని డ్రైవర్ బతికాడో లేదా అన్నదానిపై సరైన క్లారిటీ మాత్రం లేదు. ఈ ఘటనను అబ్దుల్లా ఆరిఫ్ అనే యూజర్ బుధవారం రెడిట్‌లో పోస్ట్ చేశారు. ఇది సోషల్ మీడియాలో (Social media)  ట్రెండింగ్ లో నిలిచింది.

ఇదిలా ఉండగా ఉత్తర ప్రదేశ్ లో (Uttar pradesh) వింత సంఘటన జరిగింది.

లలిత్ పూర్ నియోజక వర్గానికి చెందిన సచిన్ సాహు అనే పొలిటిషియన్, అభయ్ నామ్ దేవ్ అనే 16 ఏళ్ల బాలుడిని ఇంట్లో పనికి పెట్టుకున్నాడు. అయితే.. అతను ఇంట్లో పనిచేస్తుండగా ఏదో పొరపాటు చేశారు. దీంతో సచిన్ సాహు రెచ్చిపోయాడు.

అభయ్ నామ్ దేవ్ ను నోటికొచ్చినట్లు తిట్టాడు. అంతే కాకుండా.. కోపంతో అతని ముక్కును కసితీరా కొరికాడు. దీంతో బాలుడికి తీవ్ర రక్తస్రావమైంది. వెంటనే అతడిని కుటుంబ సభ్యులు ఝాన్సీ మెడికల్ కాలేజీకి ఆస్పత్రికి తరలించారు. అతడికి వైద్యులు చికిత్స అందించారు. అయితే.. బాలుడు కుటుంబ సభ్యులు మాత్రం ఇప్పటి వరకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. ప్రస్తుతం ఈ ఘటన మాత్రం సోషల్ మీడియాలో (Social media) లో తెగ చక్కర్లు కొడుతుంది.
Published by:Paresh Inamdar
First published:

Tags: Pakistan, VIRAL NEWS

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు