నీరు, కరెంటు, నెట్ లేదు.. అయినా ఆ కాటేజీ ధర రూ.5.5 కోట్లు.. ఎందుకు?

ఇదే ఆ ఇల్లు (image credit - RichardDowner/TheCoastalHouse/BNPS)

ఆ ఇంట్లో నిమిషం కూడా ఉండలేం. బోర్ కొట్టడం ఖాయం. మరి అలాంటి ఇంటికి అంత రేటు ఎందుకు ఉంది?.. ప్రత్యేక కారణం ఏముంది? తెలుసుకుందాం.

 • Share this:
  చుట్టూ పచ్చటి కొండలు... ఓవైపు విశాల సముద్రం (sea side home)... జోరుగా వీచే గాలులు... నయన మనోహర ప్రకృతి... ఇవన్నీ ఉన్న చోట ఓ ఇల్లు ఉంటే... ఆ ఇంట్లో ఉండటం ఎవరికైనా నచ్చుతుంది. కాకపోతే... ఆ ఇంట్లో నీరు, కరెంటు, ఇంటర్నెట్ వంటివి ఉండాలి కదా. అవి లేకపోతే ఇబ్బందే. చందమామపై ఉన్నట్లే ఉంటుంది. అవేమీ లేకపోయినా పర్వాలేదు అనుకునేవారికి మాత్రం ఆ ఇల్లు తెగ నచ్చేస్తుంది. బ్రిటన్‌లోని దేవన్‌ (devon)లో సముద్రం పక్కనే ఉంది ఆ కాటేజీ (house on sale). దాని మార్కెట్ విలువ ఇప్పుడు £550,000 ఉంది. మన రూపాయిల్లో చెప్పాలంటే రూ.5.56 కోట్లు.

  మన్సంద్స్ సముద్ర తీరం పక్కన దూరంగా ఉన్న గేట్‌వే (remote gateway)లో ఈ ఇల్లు ఉంది. ఈ సముద్ర తీరం (beach) నేషనల్ ట్రస్ట్‌కి చెందినది. ప్రశాంత వాతావరణంలో జీవించాలి అనుకునేవారికి ఈ ప్రాంతం బాగా నచ్చుతుంది. చుట్టూ ప్రకృతి వారిని పలకరిస్తుంది. కానీ ఇదంతా చూసి ఇంటిని కొనుక్కుంటే మాత్రం ఆ తర్వాత చుక్కలు కనిపించే ప్రమాదం ఉంది.

  Viral house, house on sale, costly house, beach house, viral news, viral now, viral today, viral on social media, uk house, వింత వార్తలు, వింత న్యూస్, ఖరీదైన ఇల్లు,
  ఇదే ఆ ఇల్లు (image credit -
  RichardDowner/TheCoastalHouse/BNPS)


  ఈ ఇంటికి కరెంటు లేదు, వాటర్ లేదు, ఇంటర్నెట్ కూడా లేదు కాబట్టి ఇంట్లో ఉండేవారికి టైమ్ పాస్ అవ్వదు. పోనీ పక్కన సముద్రం ఉంది కదా అనుకుంటే... అదేమో కొండ కింద ఉంది. అక్కడికి వెళ్లాలంటే కారు ఉండాల్సిందే. అయినా కంటిన్యూగా సముద్రం దగ్గరే ఏం కూర్చుంటారు. ఈ ఇంట్లో 2 పెద్ద బెడ్‌రూంలు ఉన్నాయి. పైన పెద్ద లాఫ్ట్ రూమ్ (loft room) ఉంది. ముందు, వెనక పోర్ష్ (porch) ఉన్నాయి. అలాగే అదనంగా 2 బెడ్‌రూంలు, ఓ షవర్ రూమ్, ఓ కిచెన్ ఉన్నాయి. ఇంటి లోపల 1,345 చదరపు అడుగుల (sqft) స్పేస్ ఉంది.

  ఇది కూడా చదవండి: భూమిపై కంటే ఆ ఉపగ్రహంపైనే నీరు ఎక్కువ... జీవుల కోసం లోతుగా ఆన్వేషణ

  కరెంటు లేకుండా మరి ఇంట్లో చలి వాతావరణం నుంచి వేడి కావాలంటే... 2 మల్టీ ఫ్యూయల్ బర్నర్లు ఉన్నాయి. కిచెన్‌లో గ్యాస్ కుక్కర్, ల్యాంప్స్ ఉన్నాయి. LPG గ్యాస్ సప్లై ఉంది. ఇంటి పైన వర్షపు నీటిని మంచి నీరుగా మార్చే వ్యవస్థ ఉంది. (rainwater harvesting system) దాని ద్వారా నీరు సంపాదించుకోవచ్చు. సముద్రం దగ్గరకు కారులో వెళ్లొచ్చని ఇంటి ఓనర్ మిషెల్లే స్టీవెన్స్ తెలిపారు. ఐతే... కార్ పార్కింగ్ ప్లేస్ ఇంటికి దూరంగా ఉంది. అక్కడ పార్క్ చేసి ఇంటికి నడుస్తూ వెళ్లడానికి పావుగంట పడుతుంది. అది ఎవరికీ నచ్చట్లేదు.
  Published by:Krishna Kumar N
  First published: