దేశ రాజధానిలోని వివిధ సరిహద్దుల్లో మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాల (Three Contentious Farm Laws)కు వ్యతిరేకంగా రైతు నిరసనలు ఉపసంహరించుకున్న ఒక నెల తర్వాత, హర్యానాకు చెందిన ఒక వ్యక్తి రెండు వారాల ముందు 1,500 మ్యారేజ్ కార్డులను ముద్రించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక ప్రత్యేకమైన నిరసన మార్గాన్ని ఎంచుకున్నాడు. అతని వివాహ పత్రిక (Wedding Card) ద్వారా పంట ఉత్పత్తులపై కనీస మద్దతు ధర (MSP)కి హామీ ఇచ్చే చట్టాన్ని డిమాండ్ చేసేలా ముద్రించాడు. హర్యానా (Haryana) లోని భివానీ జిల్లాకు చెందిన ప్రదీప్ కలిరమణ ఫిబ్రవరి 9న వివాహం చేసుకోనున్నారు. అతను 1,500 వెడ్డింగ్ కార్డ్‌లపూ ఇలా ప్రింట్ చేయించాడు. “జంగ్ అభి జారీ హై, MSP కి బారీ హై (దీని అర్థం “యుద్ధం ఇంకా కొనసాగుతోంది, ఇది MSP వంతు”) . ఇది కాకుండా, పెళ్లి కార్డులపై 'ట్రాక్టర్' (Tracter) మరియు 'నో ఫార్మర్స్, నో ఫుడ్' అని సూచించే బోర్డు కూడా ప్రదర్శించాడు.
Trending: డాన్స్ చేసిందని వధువును చెంపదెబ్బ కొట్టి వరుడు.. తర్వాత ఏం జరిగిందంటే?
ఈ విషయంపై ప్రదీప్ జాతీయ మీడియాతో మాట్లాడారు. “రైతుల నిరసన విజయం ఇంకా పూర్తి కాలేదని నా పెళ్లి కార్డు ద్వారా సందేశం పంపాలనుకుంటున్నాను. ఎంఎస్‌పి చట్టం కింద హామీ ఇస్తూ రైతులకు కేంద్రప్రభుత్వం రాతపూర్వకంగా ఇచ్చినప్పుడే రైతుల విజయం అవుతుంది. MSPపై చట్టం లేకుండా, రైతులకు ఏమీ ఉండదు. MSPపై చట్టపరమైన హామీ ఉంటేనే రైతుల బలిదానం, వారి త్యాగాలు కూడా నెరవేరుతాయి" అని అన్నాడు.
Women Professor: ఈ కారణంతో ఉద్యోగం తీసేస్తారా.. అధ్యాపకురాలికి యూనివర్సిటీ షాక్!
"రైతు నిరసనల సందర్భంగా, ప్రదీప్ ఢిల్లీ (Delhi) సరిహద్దులను సందర్శించాడు మరియు వివిధ నిరసన ప్రదేశాలలో కూర్చున్న ఇతర రైతులందరికీ కూడా తన మద్దతును అందించాడు. MSPపై చట్టపరమైన హామీని కోరుతూ నేను 1,500 వెడ్డింగ్ కార్డ్‌లను ప్రింట్ చేయడానికి ఇదే కారణమని అతని సన్నిహితులు చెబుతున్నారు.
Viral Video: ఆకాశంలో అద్బుతం.. ప్యాసింజర్ విమానాల రేస్.. వైరల్ అవుతున్న వీడియో!
జూన్ 5, 2020న, కేంద్ర ప్రభుత్వం మూడు వివాదాస్పద వ్యవసాయ బిల్లు (Farm Laws) లను పార్లమెంట్ (Parliament) లో ప్రవేశపెట్టింది. సెప్టెంబర్ 20న, మూడు చట్టాలను లోక్‌సభ ఆమోదించిన తర్వాత రాజ్యసభ ఆమోదించింది. మూడు కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల నిరసన దాదాపు 13 నెలల పాటు కొనసాగింది, ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం చట్టాలను ఉపసంహరించుకుంది, ఆ తర్వాత రైతులు (Farmers) లేవనెత్తిన అనేక ఇతర డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Delhi, Farm Laws, Farmers Protest, Haryana, Trending, Viral, Viral image