Home /News /trending /

Viral: పదేళ్లుగా ఇంటిని చెత్తతో నింపుతున్న వృద్ధుడు.. ఎందుకో తెలిస్తే కన్నీరు ఆగదు..

Viral: పదేళ్లుగా ఇంటిని చెత్తతో నింపుతున్న వృద్ధుడు.. ఎందుకో తెలిస్తే కన్నీరు ఆగదు..

Photo Credit : AP

Photo Credit : AP

Viral: వీధుల్లో తిరుగుతూ కనిపించిన చెత్తనల్లా సేకరించి ప్రతీరోజు ఇంటికి తెచ్చేవాడు. దీంతో అక్కడి ప్రాంతమంతా భయంకరమైన దుర్గంధం వెదజల్లేది. అది భరించలేక స్థానికులు ఫిర్యాదులు కూడా చేశారు. కానీ అతను మాత్రం చెత్తను తీసుకురావటం ఆపలేదు.

ఇంకా చదవండి ...
దక్షిణ కొరియా దేశంలోని ఒక వృద్ధుడు తన రెండంతస్తుల బిల్డింగ్‌ని చెత్తతో నింపేశాడు. గత పదేళ్లుగా ఈ వృద్ధుడు చెత్తను సేకరిస్తున్నానే ఉన్నాడు. అయితే దీని వెనుక ఉన్న కారణం తెలిసి చాలామంది కంటతడి పెడుతున్నారు. ఎందుకో తెలుసుకుంటే.. గ్వాంగ్జు ప్రాంతానికి చెందిన చోయ్ అనే 75 ఏళ్ల వృద్ధుడు గత శతాబ్ద కాలంలో తన ఇంటిని డంప్‌ యార్డ్‌గా మార్చాడు. వీధుల్లో తిరుగుతూ కనిపించిన చెత్తనల్లా సేకరించి ప్రతీరోజు ఇంటికి తెచ్చేవాడు. దీంతో అక్కడి ప్రాంతమంతా భయంకరమైన దుర్గంధం వెదజల్లేది. అది భరించలేక స్థానికులు ఫిర్యాదులు కూడా చేశారు. కానీ చోయ్ మాత్రం చెత్తను తీసుకురావటం ఆపలేదు. దీంతో అతని ఇల్లంతా చెత్తతో నిండిపోయింది. ఆ ఇంటిలో ఒక చిన్న రూమ్ తప్ప బాల్కనీతో సహా చెత్తతో పేరుకుపోయింది. అయితే ఈ విషయం తెలుసుకున్న ఓ సౌత్ కొరియన్ న్యూస్ ఛానల్.. చోయ్ జీవితం గురించి ఒక స్టోరీ ప్రసారం చేయాలని భావించింది. తదనంతరం ఈ ఛానల్ వాళ్ళు చోయ్ ఇంటికి వెళ్లారు. కానీ ఇంటి లోపలికి వెళ్లడానికి మాత్రం బాగా కష్టపడ్డారు. ఎందుకంటే అతని ఇంటి ముందు ఒక పర్వతంలా చెత్తకుప్ప పేరుకుపోయింది. ఆ చెత్త కుప్పపైకి మెల్లిగా ఎక్కిన సదరు రిపోర్టర్ తలుపు తీయడానికి కూడా ఇబ్బంది పడిపోయాడు. చివరికి ఎలాగోలా లోపలికి వెళ్ళాడు. అయితే ఇంటిలోపల అడుగుపెట్టగానే దుర్వాసన గుప్పుమంది. దీనితో రిపోర్టర్ గాలి పీల్చుకోలేక తల్లడిల్లిపోయాడు. కానీ అక్కడే ప్రశాంతంగా కూర్చున్న ముగ్గురిని చూసి షాక్ కి గురయ్యాడు. ఆ ముగ్గురు మరెవరో కాదు.. చోయ్, అతని 70 ఏళ్ల భార్య, 40ఏళ్ల కుమారుడు. తరువాత, భరించలేని కంపులో ఎలా నివసిస్తున్నారు? ఎందుకు చెత్తను సేకరిస్తున్నారు? అని చోయ్ కి అనేక ప్రశ్నలు సంధించాడు.

ఆ ప్రశ్నలకు చోయ్ సమాధానమిస్తూ.. "నా కొడుకు పొద్దస్తమానం ఇంట్లోనే ఉంటాడు. ఉద్యోగం కోసం బయటకు కూడా వెళ్లడు. మాకు వచ్చే పెన్షన్ డబ్బులతోనే జీవిస్తున్నాడు. గత ఏడాదిపాటు బాగా తిని కూర్చోవడం వల్ల 100 కిలోలు పెరిగాడు. దేనికీ పనికిరాని ఒక చెత్తలాగా ఇంట్లోనే ఉండే వాడిని చూసి నాకు భయం పట్టుకుంది. నేను, నా భార్య చనిపోతే వాడికి ఆధారం ఏంటనే ఆలోచనలో పడిపోయాను. అప్పుడే ఒకరి చెత్తే.. మరొకరి ఆస్తి.. అని నమ్మాను. అందుకే చెత్త సేకరించి లెక్కలేనంత డబ్బును సంపాదించాలి అనుకున్నాను. ఎంత ఎక్కువ చెత్త సేకరిస్తే అంత ఎక్కువ డబ్బులు వస్తాయని భావించాను" అని చాలా దయనీయమైన గొంతుతో అమాయకంగా చెప్పాడు.


దీంతో రిపోర్టర్ కంటతడి పెట్టుకున్నాడు. "మీ భార్యకు గుండె జబ్బు ఉంది. చెత్తలో బతకడం ఆమెకు మరింత ప్రమాదకరమని డాక్టర్లు చెప్పారు. మీ భార్యను బతికించాలంటే ఈ చెత్తను ఇప్పటికిప్పుడు క్లీన్ చేయాలి" అని రిపోర్టర్ చోయ్ తో చెప్పాడు. దీంతో చోయ్ చెత్తను తీసివేసేందుకు అంగీకరించాడు. అయితే చోయ్ ఇంట్లో పేరుకుపోయిన 150 టన్నుల చెత్తను తీసివేయడానికి 226 మంది కార్మికులు రంగంలోకి దిగారు. చాలాసేపు కృషిచేసి చోయ్ ఇంటిని శుభ్రంగా మార్చారు. క్లీన్ గా తయారైన తన ఇంటిని చూసి చోయ్ ఒక్కసారిగా భావోద్వేగానికి గురై గుక్కపట్టి ఏడ్చాడు. తన భార్య ఆరోగ్యం కోసం తాను ఎప్పటికీ చెత్త సేకరించనని చెబుతూ బోరున విలపించాడు. దీంతో ఆ దృశ్యాలను ప్రతి ఒక్కరినీ భావోద్వేగానికి గురి చేశాయి.
Published by:Sridhar Reddy
First published:

Tags: Garbage, South korea, VIRAL NEWS

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు