• HOME
  • »
  • NEWS
  • »
  • TRENDING
  • »
  • VIRAL PHOTOS WOMAN WEARING GOLD ORNAMENTS OVER MASK HER PHOTO GOES VIRAL ON SOCIAL MEDIA NK GH

Viral Photos: మాస్కుతో పాటు బంగారు నగలు... వైరల్ అవుతున్న మహిళ ఫోటోలు

Viral Photos: మాస్కుతో పాటు బంగారు నగలు... వైరల్ అవుతున్న మహిళ ఫోటోలు

మాస్కుతో పాటు బంగారు నగలు... వైరల్ అవుతున్న మహిళ ఫోటోలు (image credit - twitter)

Viral Photos: ఆమె మాస్కుతోపాటూ... బంగారు నగలు ఎందుకు పెట్టుకుంది. వాటిని అందరికీ చూపించాలనుకుంటోందా? దీనిపై నెటిజన్లు ఎలా స్పందించారో తెలుసుకుందాం.

  • Share this:
కరోనా కారణంగా దేశంలోని చాలా రాష్ట్రాలు లాక్‌డౌన్ అమలు చేస్తున్నాయి. దీంతో పెళ్లి, ఇతర కార్యక్రమాలను వాయిదా వేసుకుంటున్నారు చాలా మంది. అయితే ముహూర్త బలం కారణంగా కొందరు ఇప్పుడే పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో వేడుకలకు వచ్చే బంధువులు తప్పకుండా మాస్క్ ధరించడం, సోషల్ డిస్టాన్స్ పాటించడం వంటివి చేయాలని అధికారులు చెబుతున్నారు. మరి భారతీయ మహిళలకు ఆభరణాల మీద ఉండే మక్కువ తెలిసిందే కదా! ఏ చిన్న శుభకార్యమైనా తమ ఒంటి నిండా నగలు ధరించేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అయితే ముఖంపై ఆభరణాలు ధరించేందుకు మాస్క్ పెద్ద అడ్డంకిగా మారింది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ఓ మహిళ కొత్తగా ఆలోచించింది. ఆమె మాస్క్‌తో పాటు ఆభరణాలు ధరించిన ఓ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఆ ఫోటోను మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌లో IPS అధికారి దీపాన్షు కబ్రా షేర్ చేశారు. దానికి ‘జ్యువెలరీ జుగాడ్’ అని క్యాప్షన్ పెట్టారు. ఆ మహిళ “సూపర్ అల్ట్రా ప్రో మాక్స్ లెవెల్ ఉమెన్” అని తన పోస్టులో మెచ్చుకున్నారు.

ట్విట్టర్‌లో ఈ పోస్టు వైరల్ అవుతోంది. దీనికి ఇప్పటివరకు రెండు వేలకు పైగా లైక్స్ వచ్చాయి. నెటిజన్లను ఆకట్టుకుంటున్న ఈ ఫోటోను పరిశీలిస్తే.. పింక్ రంగు చీరను కట్టుకున్న మహిళ.. N-95 మాస్క్ ధరించడాన్ని మనం చూడవచ్చు. ఆమె తన మాస్క్ మీదనే ముక్కెరను ధరించింది. ప్రాణాలను రక్షించే మాస్క్‌తో పాటు ష్యాషన్‌కు ప్రాధాన్యమిస్తూ అలంకరించుకున్న ఆభరణాలు ఇప్పుడు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. భారతీయులు దేన్నయినా తమకు అనుగుణంగా మలుచుకుంటారని ఈ ఫోటో ద్వారా మరోసారి తెలియజెప్పింది ఈ మహిళ.


బంగారం మాస్క్ ధరించిన వ్యక్తి:
భారతదేశంలో చాలామంది బంగారాన్ని కోవిడ్ ప్రోటోకాల్‌కు అడ్డంకిగా మారకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గతేడాది జూలైలో.. పుణెలోని పింప్రి-చిన్చ్వాడ్ జిల్లాకు చెందిన శంకర్ కురాడే అనే వ్యక్తి బంగారు మాస్క్ ధరించాడు. రూ.2.89 లక్షల విలువైన ఆ మాస్కును స్వచ్ఛమైన బంగారంతో తయారు చేయించాడు. ఆ ఫోటోలు ఇంటర్నెట్‌లో బాగా వైరల్ అయ్యాయి. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది లేకుండా రంధ్రాలతో దీన్ని తయారు చేయించడం విశేషం.



ఇది కూడా చదవండి: No Corona: దగ్గు, జలుబు ఉన్నాయా... డోంట్ వర్రీ... ఇంట్లోనే ఇలా చేసుకోండి చాలు

అయితే కరోనా వైరస్‌ను నివారించడంలో ఈ మాస్క్ సరిగ్గా పనిచేస్తుందా? లేదా? అనే విషయం కచ్చితంగా తెలియదని అతడు తెలిపాడు.
First published:

అగ్ర కథనాలు