Home /News /trending /

VIRAL NEWS YOUTH HAVING 82 TEETH SHOCKING NATION STRANGE CASE FROM BIHAR NK GH

Viral News: ఆ యువకుడికి 82 దంతాలు... షాకైన డాక్టర్లు... అన్ని ఎలా ఉన్నాయి?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Viral News: ప్రపంచంలోనే అతి పొడవైన దంతాలతో ఓ వ్యక్తి గిన్నీస్ బుక్ ఎక్కగా... ఇప్పుడు అత్యంత ఎక్కువ దంతాలతో ఓ యువకుడు సెన్సేషన్ అయ్యాడు. అతని కథేంటో తెలుసుకుందాం.

కొడితే 32 పళ్లు రాలిపోతాయని అప్పుడప్పుడూ అంటుంటాం. ఎవరికైనా అత్యధికంగా ఉండే దంతాలు 32 మాత్రమే అనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ బీహార్‌కు చెందిన ఓ యువకుడికి మాత్రం ఏకంగా 82 దంతాలు ఉన్నాయి. వీటి వల్ల అత‌ని ద‌వ‌డ‌లు పెద్ద ఎత్తున వాచిపోయి క‌నిపిస్తుండేవి. ఫలితంగా అతడి ముఖాకృతి కూడా మారిపోయింది. స‌రైన చికిత్స అందక న‌ర‌క‌యాత‌న ప‌డిన ఈ కుర్రాడికి బీహార్‌లోని ఇందిరాగాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ డాక్టర్లు ఉప‌శ‌మ‌నం క‌ల్పించారు. అదే న్యూస్ ఇప్పుడు వైరల్ అయ్యింది.

బీహార్‌కు చెందిన నితీష్‌కుమార్ వ‌య‌సు 17ఏళ్ళు. ఐదు సంవ‌త్సరాలుగా ఇత‌ను దంత‌క్షయ ట్యూమ‌ర్ సమస్యతో బాధ‌ప‌డుతున్నాడు. అయితే ఇత‌నికి స‌రైన చికిత్స ల‌భించ‌క‌పోవ‌డంతో వాచిపోయిన ద‌వ‌డ‌ల‌తో బాధ‌ను అనుభ‌విస్తుండేవాడు. ఈ క్రమంలో అత‌ను ఇందిరాగాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ డాక్టర్లను కలిశాడు. సమస్య చెప్పాడు. దీనికి ఆప‌రేష‌న్ ఒక్కటే మార్గమని డాక్టర్లు భావించారు. అంత‌కుముందు అత‌నికి స్కానింగ్ తీయించారు. స్కాన్ రిపోర్ట్ చూసి డాక్టర్లు ఆశ్చర్యపోయారు.

ఇది కూడా చదవండి: Owl Eyes: గుడ్లగూబ కళ్లలో కళ్లు పెట్టి చూస్తే ధన, జ్ఞానప్రాప్తి... రోజూ ఇలా చెయ్యండి

నితీష్‌కుమార్ ద‌వ‌డ బాగా వాచిపోవ‌డ‌మే కాక‌, ట్యూమ‌ర్ కింద అసంఖ్యాకంగా ఉన్న దంతాలను డాక్టర్లు గుర్తించారు. వాటివల్లే అతని ముఖాకృతి కూడా మారిపోయింద‌ని గ్రహించారు. ఆపరేషన్ ద్వారా వాటిని తొలగించాలని నిర్ణయించారు. తాజాగా 3 గంట‌ల‌పాటు శ్రమించి ఎంతో క‌ష్టసాధ్యమైన ఈ శ‌స్త్రచికిత్సను విజ‌య‌వంతంగా పూర్తిచేశారు. నితీష్ బాధ‌కు విముక్తి క‌ల్పించారు. మాక్సిల్లో ఫేషియ‌ల్ యూనిట్‌కు చెందిన డాక్టర్ ప్రియాంక‌ర్ సింగ్, డాక్టర్ జావేద్ ఇక్బాల్ స‌హ‌కారంతో ఈ శ‌స్త్రచికిత్స చేశారు. ఏళ్ళ త‌ర‌బ‌డి నితీష్ స‌రైన చికిత్స తీసుకోక‌పోవ‌డంతో అత‌ని ప‌రిస్థితి దారుణంగా త‌యారైంద‌ని, ఆప‌రేష‌న్‌తో స‌మ‌స్య తీరింద‌ని ఇందిరాగాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రియాంక‌ర్ సింగ్ చెప్పారు.

ఇది కూడా చదవండి: Love Jihad: వివాదాస్పదమైన ఆహ్వాన పత్రిక... ఆగిపోయిన పెళ్లి వేడుకలు

గతంలోనూ ఇలాంటి కేసు ఒకటి వెలుగు చూసింది. మ‌ధ్యప్రదేశ్‌కు చెందిన ఇంజ‌నీరింగ్ స్టూడెంట్ ప‌వ‌న్ బ‌వ‌సార్ ద‌వ‌డ నొప్పితో బాధ‌ప‌డేవాడు. సమస్యకు కారణమైన రెండు దంతాలను నోటి నుంచి వైద్యులు తొలగించారు. ప‌వ‌న్ బాధ‌కు ఈ రెండు దంతాలే కార‌ణం. ఎందుకంటే అవి ఏకంగా 39 మిల్లీమీట‌ర్ల పొడ‌వు... అంటే 3.9 సెంటిమీట‌ర్ల పొడ‌వు ఉన్నాయి. అవి ప్రపంచంలోనే అత్యంత పొడ‌వైన మాన‌వ దంతాలుగా గిన్నిస్ బుక్ ఆఫ్ వ‌ర‌ల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించడం విశేషం.
Published by:Krishna Kumar N
First published:

Tags: Viral, VIRAL NEWS

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు