Russia Ukraine War: ఉక్రెయిన్ పై రష్యా భీకర దాడులు కొనసాగుతున్నాయి. పుతిన్ (Vladimir Putin) దళాల ధాటికి ఉక్రెయిన్ విలవిల్లాడుతుంది. ఇప్పటికే ఉక్రెయిన్ లోని చాలా పట్టణాలు ధ్వంస మయ్యాయి. ఉక్రెయిన్ ప్రజలు, ఇతర దేశాలకు వలస పోతున్నారు. దీనిలో భాగంగా అనేక హృదయ విదారక దృశ్యాలు ప్రతిరోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా, ఒక మహిళ..
రష్యా, ఉక్రెయిన్ పై మారణ హోమంను కొనసాగిస్తుంది. ఇప్పటికే కీవ్, ఖర్కీవ్, సుమీ పలు ప్రాంతాలు తమ రూపురేఖలను కోల్పోయాయి. బాంబులు, కిపణులు, రాకెట్లతో పుతిన్ (Vladimir Putin)సైన్యాలు విరుచుకుపడుతున్నాయి. గత పన్నెండు రోజులుగా దాడులు జరుగుతున్నాయి. ఇటు ఉక్రెయిన్ కూడా ఏమాత్రం తగ్గడంలేదు. రష్యా (Russia)సైన్యాలను ఎదుర్కొవడానికి శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తుంది.
ఉక్రెయిన్ అధ్యక్షుడి జెలెన్ స్కీ (Zelenskyy) పిలుపు మేరకు ప్రజలు స్వచ్ఛందంగా యుద్ధంలో పాల్గొంటున్నారు. ఇక.. మరికొందరు వేరే దేశాలకు వలస పోతున్నారు. ఈ క్రమంలో ఉక్రెయిన్ (Ukraine) అంతట భీతావహ పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని చోట్ల చిన్న పిల్లలు సరైన వసతులు లేక వేల కిలో మీటర్లు నడుచుకుంటు పోతున్నారు.
మరికొన్ని చోట్ల తమ దేశాన్ని వదిలి వెళ్లలేక కన్నీటి పర్యంత మవుతున్నారు. చనిపోయిన వారిలో... పసిపిల్లల నుంచి పెద్దవారి వరకు అన్ని వయసు వారు ఉన్నారు. ఇప్పటి వరకు దాదాపు.. 15 లకల మంది వలస పోయినట్లు ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం తెలుస్తోంది. ఇప్పటికే రష్యా బీభత్సానికి చెందిన అనేక వీడియోలు, ఫోటోలు నెట్టింట (Viral News)వైరలవున్నాయి.
తాజాగా, ఈ కోవకు చెందిన ఫోటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో (Social Media)చక్కర్లు కొడుతుంది. దీన్ని ట్విటర్ లో ఉక్రెయిన్లోని సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ పోస్ట్ చేసింది. దీనికి వండర్ వుమన్ ట్యాగ్ చేసింది.
దీనిలో ఉక్రెయిన్ కు చెందిన ఒక మహిళ రోడ్డుపై (Woman Walks on Road With Gun) నడుచుకుంటూ వెళ్తుంది. ఆ మహిళ ఆర్మీదుస్తులను వేసుకుంది. ఆమె పక్కన ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు. ఆ వండర్ వుమన్.. తన భుజానికి మెషిన్ గన్ వేసుకుని , మరొక చేతితో తన పిల్లాడి చేతిని పట్టుకుంది.
ఆమెపై ఎవరైన దాడిచేస్తారేమోనని అప్రమత్తంగా ఉంది. ఆమె రోడ్డుపై జీబ్రాక్రాసింగ్ గుండా దాటుకుంటూ వెళ్తుంది. ప్రస్తుతం అంతర్జాతీయ మహిళ దినోత్సం రోజుల ఈ ఫోటో తెగ వైరల్ అవుతుంది. దీన్ని చూసిన నెటిజన్లు.. వావ్.. వండర్ వుమన్ అంటూ కామెంట్ లు పెడుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Russia, Russia-Ukraine War, VIRAL NEWS, Vladimir Putin