Viral News : ఓ మహిళ తన వెడ్డింగ్ డ్రస్ వేసుకొని కరోనా టీకా వేయించుకోవడానికి వచ్చిందంట. దీని వెనుక ఓ పెద్ద కారణం కూడా ఉందంట.. ఆ కారణం విన్న తర్వాత అంతా ఆమెను మంచి పని చేశావని ప్రశంసిస్తున్నారు. ఇంతకీ ఆమె ఆ డ్రస్ ఎందుకు వేసుకుందంటే..
సాధారణంగా పెళ్లంటే ఎవరి జీవితంలో అయినా చాలా ప్రత్యేకమైనది. అందుకే దాని కోసం ప్రత్యేకంగా సిద్ధమవుతుంటారు చాలామంది. ప్రత్యేకమైన దుస్తులు, ఆభరణాలు అన్నీ సిద్ధం చేసుకొని అందంగా రడీ అవ్వాలని కలలు కంటుంటారు. పెళ్లి తర్వాత ఈ దుస్తులను, ఆభరణాలను మనం ధరించగలిగేది చాలా తక్కువ సార్లే.. మనమంటే చీరలు కట్టుకుంటాం కాబట్టి కనీసం వేరే వాళ్ల పెళ్లిళ్లకు ధరిస్తాం. కానీ పాశ్చాత్య దేశాల్లో వెడ్డింగ్ గౌన్లు ధరిస్తారు. ఇవి కేవలం పెళ్లిలో మాత్రమే ధరిస్తారు. వీటిని తర్వాత ఉపయోగించే వీలే ఉండదు. కానీ తాజాగా ఓ మహిళ తన వెడ్డింగ్ డ్రస్ వేసుకొని కరోనా టీకా వేయించుకోవడానికి వచ్చిందంట. దీని వెనుక ఓ పెద్ద కారణం కూడా ఉందంట.. ఆ కారణం విన్న తర్వాత అంతా ఆమెను మంచి పని చేశావని ప్రశంసిస్తున్నారు. ఇంతకీ ఆమె ఆ డ్రస్ ఎందుకు వేసుకుందంటే..క్యాలిఫోర్నియాకి చెందిన సారా స్టడ్లీ అనే యువతి కరోనా వ్యాక్సీన్ తీసుకోవడానికి వెడ్డింగ్ గౌన్ వేసుకొని వెళ్లింది. ఇది అక్కడి సోషల్ మీడియాలో పాపులర్ గా మారింది. గతేడాది ఇదే సమయానికి సారా శాన్ డియాగో పార్క్ లోని బాల్బొవా పార్క్ లో వివాహం చేసుకోవాలని భావించిందట.
పెళ్లి కోసం పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు కొన్ని నెలల పాటు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే సడన్ గా వచ్చిన కరోనా, ఆపై లాక్ డౌన్ వారి ప్లాన్లను చెడగొట్టింది. వీరిద్దరు కేవలం కుటుంబ సభ్యుల సాక్షిగా చాలా సింపుల్ గా పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందట. దీంతో తన వెడ్డింగ్ డ్రస్ ని అందరికీ చూపించేందుకు కూడా సారాకి అవకాశం దొరకలేదు. అందుకే స్థానిక ఎం అండ్ టి బ్యాంక్ స్టేడియంలో కరోనా వ్యాక్సీన్ వేసుకోవడానికి వెళ్లేటప్పుడు ఆమె ఈ వెడ్డింగ్ డ్రస్ ని ధరించి వెళ్లింది.
Here comes the bride...to get her vaccination at M&T Bank Stadium Mass Vaccination Site! Rather than let the beautiful gown for her pandemic-cancelled wedding reception just hang in her closet, Sarah Studley wore it to get vaccinated. pic.twitter.com/eeRJvITO51
— University of Maryland Medical System (@umms) April 12, 2021
దీని గురించి యూనివర్సిటీ ఆఫ్ మేరీ ల్యాండ్ మెడికల్ సిస్టమ్ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టిన తర్వాత సారా చాలా పాపులర్ గా మారిపోయింది. అక్కడి పత్రికలన్నీ ఆమె గురించి రాశాయి. ట్విట్టర్ లో ఈ పేజీ ఆమె ఫొటోలను పోస్ట్ చేస్తూ “అదిగో నవ వధువు. ఎం అండ్ టి బ్యాంక్ స్టేడియంలో మాస్ వ్యాక్సినేషన్ సెంటర్ కి తన వ్యాక్సినేషన్ కోసం వచ్చింది. కరోనా పాండమిక్ వల్ల రద్దైన తన పెళ్లి కోసం సిద్ధం చేసుకున్న డ్రస్ ని అలాగే కప్ బోర్డ్ లో పడేయకుండా సారా దాన్ని వ్యాక్సినేషన్ కోసం ఉపయోగించుకుంది” అంటూ పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ చూసిన చాలామంది ఆమె చేసిన పనికి ఇంప్రెస్ అయినట్లుగా కామెంట్లు పెడుతున్నారు. చాలామంచి పని చేశావు అని ఒకరు రాస్తే.. ఈ డ్రస్ నీకు చాలా అద్భుతంగా ఉంది అని మరొకరు కామెంట్ చేశారు.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.