• HOME
  • »
  • NEWS
  • »
  • TRENDING
  • »
  • VIRAL NEWS WITHOUT WAR LOCAL FARMER ACCIDENTALLY MAKES BELGIUM BIGGER HERES FULL STORY GH SRD

Viral News : రెండు దేశాల మధ్య చిచ్చు పెట్టిన రాయి..యుద్ధం లేకుండానే దేశ విస్తీర్ణం పెంచిన రైతు..

Viral News : రెండు దేశాల మధ్య చిచ్చు పెట్టిన రాయి..యుద్ధం లేకుండానే దేశ విస్తీర్ణం పెంచిన రైతు..

Photo Credit : Face Book

Viral News : మన గ్రామాల్లో పొలాల విషయంలో సరిహద్దు రాళ్ల వివాదాలు ఎన్నో సమస్యలకు దారితీసిన ఉదంతాలు ఉన్నాయి. ఇలాంటి సంఘటన ఒకటి రెండు దేశాల మధ్య వివాదానికి దారితీసింది. అసలు కథ ఏంటంటే..

  • Share this:
అనుకోకుండా చేసే పొరపాట్లు కొన్నిసార్లు పెద్ద వివాదాలకు సైతం దారితీస్తాయి. ముఖ్యంగా మన గ్రామాల్లో పొలాల విషయంలో సరిహద్దు రాళ్ల వివాదాలు ఎన్నో సమస్యలకు దారితీసిన ఉదంతాలు ఉన్నాయి. ఇలాంటి సంఘటన ఒకటి రెండు దేశాల మధ్య వివాదానికి దారితీసింది. బెల్జియంకు చెందిన ఓ రైతు అనుకోకుండా చేసిన పొరపాటు వల్ల ఫ్రాన్స్ సరిహద్దు మారిపోయింది. ట్రాక్టర్ నడుపుతూ అడ్డుగా ఉందని అతడు ఓ రాయిని కదిలించాడు. దీంతో ఫ్రాన్స్ విస్తీర్ణం మారింది. ఫలితంగా సరిహద్దు అంశంపై ఈ రెండు దేశాలు చర్చలకు పిలుపునివ్వడం విశేషం. ఇటీవల అడవి మార్గంలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి ఈ రాయిని గమనించాడు. ఇది ఇరుదేశాలను విడదీసే సరిహద్దు రాయి అని గుర్తించాడు. ఆ తరువాత విషయం బయటకు పొక్కింది. సరిహద్దు రాయి దాదాపు 7.5 అడుగుల దూరం కదలడంతో బెల్జియం విస్తీర్ణం కొంచెం పెరిగింది. స్థానికులు ఈ విషయంపై చలోక్తులు విసురుకుంటున్నారు. బెల్జియం సరిహద్దు గ్రామం ఎర్క్వెలిన్నెస్ మేయర్ డేవిడ్ లావాక్స్ ఈ విషయంపై స్పందించారు. అతడు (రైతు) బెల్జియంను పెద్దదిగా, ఫ్రాన్స్ ను చిన్నదిగా చేశాడని, ఇది మంచి ఆలోచన కాదని తెలిపారు. ఈ చర్య ప్రైవేటు భూస్వాములు, పొరుగుదేశాలకు సమస్యలను కలిగిస్తుందని చెప్పారు. ఫ్రెంచ్ గ్రామ మేయర్ లా వోయిక్స్ జు నార్డ్ కూడా ఈ విషయంపై స్పందించారు. తాము సరిహద్దు వివాదాన్ని నివారించాలని చూస్తున్నామని అభిప్రాయపడ్డారు.

ఫ్రాన్స్, బెల్జియం దేశాలు 390 మైళ్లు(627 కిలోమీటర్లు) సరిహద్దును పంచుకుంటున్నాయి. దీనికి సంబంధించి 1820లో ఇరుదేశాల మధ్య ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందం ప్రకారం ఇరుదేశాల మధ్య సరిహద్దును విభిజించారు. అంతకు ఐదేళ్ల ముందే నెపోలియన్ వాటర్లూ యుద్ధంలో ఓటమి పాలయ్యాడు. అనంతరం ఈ ఒడంబడికను కుదుర్చుకున్నాయి. ఈ సరిహద్దును మొదటిసారి 1819లోనే నిర్ణయించి రాళ్లు పాతారు.

ప్రస్తుతం బెల్జియం అధికారులు సంబంధిత రైతును సంప్రదించి, ఆ రాయిని ఇంతకు ముందు ఉన్న ప్రదేశంలోనే తిరిగి పెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకవేళ అతడు అందుకు ఒప్పుకోకపోతే.. బెల్జియం విదేశాంగ మంత్రిత్వ శాఖ ఫ్రాంకో-బెల్జియన్ బోర్డర్ కమీషన్‌ను ఓపెన్ చేస్తుంది. అయితే 1930 నుంచి ఇప్పటివరకు ఇలాంటి కమీషన్ ఏర్పాటు చేయలేదు. కమీషన్ ఏర్పడితే రైతు క్రిమినల్ కేసును కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. అందువల్ల వివాదానికి కారణమైన రైతు ప్రభుత్వానికి సహకరించేలా చూస్తామని మేయర్ లావాక్స్ స్పష్టం చేశారు. రైతుపై కేసు లేకుండా, సమస్యను స్నేహపూర్వకంగా పరిష్కరించేలా చూస్తామని చెప్పారు. ఒక సాధారణ వ్యక్తి అనుకోకుండా చేసిన పొరపాటు.. ఇరుదేశాల మధ్య పెద్ద వివాదానికి దారితీసిందనే వార్త చర్చనీయాంశంగా మారింది.
Published by:Sridhar Reddy
First published: