Home /News /trending /

VIRAL NEWS UTTAR PRADESH MAN SELLS CLOTHES ON A HANDCART WITH TWO BODY GUARDS AND HERE THE INTERESTING STORY SRD

Viral News : ఇదేందయ్యా ఇది.. తోపుడు బండి వ్యాపారికి AK47లతో ఇద్దరు బాడీగార్డ్స్​.. ఏడా సూడలే..

తోపుడు బండి వ్యాపారికి AK47లతో ఇద్దరు బాడీగార్డ్స్​.. (PC : Twitter)

తోపుడు బండి వ్యాపారికి AK47లతో ఇద్దరు బాడీగార్డ్స్​.. (PC : Twitter)

Viral News : అతనో అత్యంత సాధారణ చిరు వ్యాపారి. నిత్యం నాలుగు చక్రాల తోపుడు బండిపై చిన్నారులు.. మహిళ ల దుస్తులను పెట్టుకుని.. వివిధ ప్రాంతాలకు నడుచుకుంటూ.. వెళ్లి వ్యాపారం చేసుకుంటారు. అలాంటి చిరు వ్యాపారికి.. ఏకంగా.. పొలిటీషియన్లు.. ఉన్నతాధికారులకు ఇచ్చే కట్టుదిట్టమైన భద్రతను కల్పించారు.

ఇంకా చదవండి ...
    సెల‌బ్రెటీలు (Celebs) బ‌య‌ట అడుగుపెట్టాలంటే వారి వెంట బాడీ గార్డు (Body Guards)లు ఉండాల్సిందే. షాపింగ్ కు వెళ్లినా…త‌మ‌కు సంబంధించిన ఏ చిన్న ప్రోగ్రాం కు వెళ్లాల‌న్న బాడీ గార్డులు కావాలి. లేదంటే అభిమానులు (Fans), ప్రేక్ష‌కుల మ‌ధ్య‌లో ప‌డి న‌లిగిపోయే అవ‌కాశం కూడా ఉంది. సెల్ఫీల కోసం ఎగ‌బ‌డితే ఆ జ‌నాల్లో ఊపిరికూడా ఆడదు. దాంతో ఒక్కో సెల‌బ్రెటీ వెంట న‌లుగురు బాడీగార్డులు తప్ప‌కుండా ఉంటారు. ఇదంతా సెలబ్రెటీలు.. వాళ్ల స్టేటస్ ను బట్టి బాడీగార్డులు నియమించుకుంటారు. కానీ.. ఓ సాధారణ వ్యక్తికి బాడీ గార్డులు ఉండటం మనం ఎప్పుడూ చూసి ఉండం. కానీ.. ఉత్తర ప్రదేశ్ (Uttar Pradesh) ఎటా జిల్లాలో ఇటువంటి ఘటనే జరిగింది. ఓ తోపుడు బండిపై బట్టలు అమ్ముకునే వ్యక్తికి ఇద్దరు బాడీగార్డ్స్​ ఉన్నారు. వ్యాపారి రామేశ్వర్​ బట్టలు అమ్ముతుండగా.. ఇద్దరు బాడీగార్డ్స్ AK47 తుపాకులతో ఆయనకు రక్షణ కల్పిస్తున్నారు. దీంతో బట్టలు కొనడానికి వచ్చిన వినియోగదారులు.. రామేశ్వర్​ బాడీగార్డ్స్​ను చూసి ఆశ్చర్యపోతున్నారు.

    వివరాల్లోకెళితే.. ఉత్తర ప్రదేశ్ ఎటా జిల్లాకు చెందిన రామేశ్వర్.. అత్యంత సాధారణ చిరు వ్యాపారి. నిత్యం నాలుగు చక్రాల తోపుడు బండిపై చిన్నారులు.. మహిళ ల దుస్తులను పెట్టుకుని.. వివిధ ప్రాంతాలకు నడుచుకుంటూ.. వెళ్లి వ్యాపారం చేసుకుంటారు. మహా అయి తే.. రోజుకు రూ.300 నుంచి 500 మాత్రమే సంపాదించుకుంటారు.



    ఆ సొమ్ముతోనే కుటుంబాన్ని నెట్టుకు వస్తున్నారు. అలాంటి అత్యంత సాధారణ.. చిరు వ్యాపారికి.. ఏకంగా.. పొలిటీషియన్లు.. ఉన్నతాధికారులకు ఇచ్చే కట్టుదిట్టమైన భద్రతను కల్పించారు. ఏకే-47 గన్స్ తో ఉన్న ఇద్దరు యువ పోలీసులు ఈ వ్యాపారికి భద్రతగా నిలిచారు. అది కూడా కోర్టు ఆదేశించింది. అసలు కోర్టు ఇలా ఎందుకు ఆదేశించిందో తెలుసుకుందాం.

    అసలు కధ ఇదీ..

    యూపీలోని ఎటా జిల్లాకు చెందిన రామేశ్వర్ దయాల్ తోపుడు బండిపై బట్టల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. తన భూమికి పట్టా ఇప్పించాలంటూ ఎస్పీ నేత మాజీ ఎమ్మెల్యే రామేశ్వర్ సింగ్ సోదరుడు జుగేంద్ర సింగ్ ని కలిశారు. ఈక్రమంలోనే వీరిద్దరి మధ్య వివాదం తలెత్తింది. దీంతో జుగేంద్ర సింగ్.. తనను కులం పేరుతో దూషించారని పోలీస్ స్టేషన్లో రామేశ్వర్ ఫిర్యాదు చేశారు. దీనిపై జుగేంద్ర సింగ్ హైకోర్టుకు వెళ్లారు.

    PC : Twitter


    రామేశ్వర్ చేసిన ఆరోపణలన్నీ తప్పని.. ఈ కేసును కొట్టివేయాలని కోర్టును అభ్యర్థించారు. ఈ క్రమంలోనే రామేశ్వర్​ దయాల్​ను శనివారం కోర్టులో హాజరు కావాలని ఆదేశించింది. కోర్టుకు వచ్చిన దయాల్​ను చూసిన న్యాయమూర్తి.. ఆశ్చర్యానికి గురయ్యారు. ఓ బాధితుడికి ఎందుకు భద్రత కల్పించలేదని పోలీసులను ప్రశ్నించారు. బాధితుడికి ఇద్దరు బాడీగార్డ్స్​ను భద్రతగా నియమించాలని ఆదేశించారు.

    ఇంకేముంది.. కోర్డు ఆదేశాలతో సీన్ మారింది. వ్యాపారి రామేశ్వర్ బట్టలు అమ్ముతుండగా.. ఇద్దరు బాడీగార్డ్స్ ఏకే 47 తుపాకులతో ఆయనకు రక్షణ కల్పిస్తున్నారు. దీంతో బట్టలు కొనడానికి వచ్చిన వినియోగదారులు.. రామేశ్వర్ బాడీగార్డ్స్ ను చూసి ఆశ్చర్యపోతున్నారు. కొందరు.. ఆయన దగ్గర బట్టలు కొనేందుకు జంకుతున్నారు. దీంతో వ్యాపారం దెబ్బతిందని.. తాను ఇబ్బందులు పడుతున్నానని దయాల్ వాపోతున్నారు. మరికొందరు రామేశ్వర్ దయాల్ తో సెల్ఫీలు తీసుకోవడానికి ఎగబడుతున్నారు.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: National News, Trending news, Uttar pradesh, VIRAL NEWS

    తదుపరి వార్తలు