Home /News /trending /

VIRAL NEWS MEET HINDU MUSLIM WOMEN SUSHMA UNIYAL AND SULTANA ALI WHO DONATE KIDNEYS TO SAVE EACH OTHERS HUSBANDS GH SRD

Viral News: భర్తలను రక్షించుకోవడానికి హిందూ, ముస్లిం మహిళల తెగువ..! ఏం చేశారో తెలిస్తే శభాష్ అంటారు..!

Photo Credit : Twitter

Photo Credit : Twitter

Viral News: తమ భర్తల కోసం ఈ మహిళలు చేసిన పని ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మతాలు మర్చి.. ఈ వనితలు చేసిన పనికి దేశవ్యాప్తంగా ప్రశంసలు దక్కుతున్నాయ్. ఇంతకీ వీరు ఏం చేశారంటే..!

దేశ వ్యాప్తంగా స్వచ్ఛంద సంస్థలు ఎంత అవగాహన కల్పించినా.. అవయవ దానానికి ముందుకు వచ్చేవారి సంఖ్య మాత్రం పెరగట్లేదు. ముఖ్యంగా కిడ్నీ దాతల కోసం ఎదురుచూస్తున్న మూత్రపిండాల వ్యాధుల బాధితులు ఎందరో ఉన్నారు. అయితే తమ భర్తల ప్రాణాలు కాపాడటం కోసం పరస్పరం కిడ్నీలు దానం చేసుకున్నారు ఇద్దరు మహిళలు (Donate Kidneys). ముస్లిం బాధితుడికి హిందూ మహిళ కిడ్నీ దానం చేయగా.. ఆ హిందూ మహిళ భర్తకు సదరు ముస్లిం బాధితుడి భార్య కిడ్నీ దానం చేసింది. దీంతో వీరిద్దరి భర్తల ప్రాణాలు నిలబడ్డాయి. మానవత్వం ముందు మతం, కులం అనేవి తలదించుకుంటాయని ఈ హిందూ- ముస్లిం మహిళలు మరోసారి నిరూపించారు. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరాఖండ్‌ రాజధాని డెహ్రాడూన్‌ (Dehradun News)కు చెందిన సుష్మా ఉనియాల్‌, సుల్తానా అలీ అనే ఇద్దరు గృహిణులది ఒకే సమస్య. వీళ్లద్దరి భర్తల కిడ్నీలు పాడైపోయాయి. వాటిని మార్చితేనే వారు బతకగలుగుతారు. తమ భర్తలకు కిడ్నీలు దానం చేసినందుకు సిద్ధంగా ఉన్నా.. వారి రక్తం మ్యాచ్‌ కాకపోవడంతో ఏం చేయలేని పరిస్థితి. దీంతో కిడ్నీ దాతల కోసం ఆ ఇద్దరు గృహిణిలు తిరగని చోటు లేదు. చేయని ప్రయత్నం లేదు. నెలల తరబడి ఎంత అన్వేషించినా వారికి కిడ్నీదాతలు లభించలేదు.

సుష్మ భర్త వికాస్‌ ఉనియాల్ వయస్సు 50 సంవత్సరాలు. కిడ్నీలు ఫెయిల్‌ అవడంతో గత రెండున్నర సంవత్సరాలుగా డయాలసిన్‌ చేయించుకుంటున్నారు. ముస్లిం మహిళ సుల్తానా భర్త అష్రాఫ్‌ వయస్సు 51 సంవత్సరాలు. ఆయనదీ ఇదే పరిస్థితి. ఇద్దరివి సాధారణ కుటుంబాలే. వైద్య చికిత్స ఖర్చుల వారు ప్రతి నెలా రూ.20 వేలు ఖర్చు చేస్తున్నారు.

Photo Credit : Twitter


ఈ క్రమంలో సుష్మ బ్లడ్‌ గ్రూప్‌ సుల్తానా భర్త అష్రాఫ్‌కు సరిపోతుందని, అలాగే సుల్తానా బ్లడ్‌ గ్రూప్‌ సుష్మ భర్త వికాస్‌కు సరిపోతుందని గుర్తించారు డెహ్రాడూన్‌లోని హిమాలయన్‌ ఆస్పత్రి సీనియర్‌ నెఫ్రాలజిస్ట్‌ డాక్టర్‌ షాబాజ్‌ అహ్మద్‌. దీంతో అందరి సమ్మతితో వారి భర్తలకు పరస్పరం కిడ్నీలు దానం చేసుకున్నారు ఈ మహిళలు. రకరకాల పరీక్షల తర్వాత వైద్యులు కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు నిర్వహించారు. చికిత్స అనంతరం ఇద్దరూ కోలుకుంటున్నారు. ఈ ఆపరేషన్‌ కోసం రెండు కుటుంబాలు రూ.ఆరు లక్షల ఖర్చు చేశాయి.

ఇది కూడా చదవండి : బూతులు తిట్టడంటూ బీసీసీఐకి కోహ్లీపై ఫిర్యాదు చేసింది ఆ సీనియర్ ప్లేయరే..! ఎవరంటే..

వాస్తవానికి రక్తసంబంధికులు మాత్రమే అవయవదానం చేసేందుకు అర్హులై ఉంటారు. మానవ అవయవ మార్పిడి చట్టం 2011కు చేసిన సవరణ కారణంగా ఈ అవయవ మార్పిడి సాధ్యమైంది. ఇప్పుడు రక్తసంబంధికులు కాని వాళ్లు కూడా అవయవ దానం చేసేందుకు చట్టం అనుమతిస్తోంది.
Published by:Sridhar Reddy
First published:

Tags: Kidney, Uttarakhand, VIRAL NEWS, Wife

తదుపరి వార్తలు