• HOME
  • »
  • NEWS
  • »
  • TRENDING
  • »
  • VIRAL NEWS MAN HAS TOSSED USED CUPS AND CIGERATTE BUDS FOR 3 YEARS AND FINALLY CAUGHT IN NEW YORK GH SRD

Viral News : ద్యేవుడా..ఇలా కూడా పగ తీర్చుకుంటారా..పోలీసులు కూడా అవాక్కయ్యారు..

Viral News : ద్యేవుడా..ఇలా కూడా పగ తీర్చుకుంటారా..పోలీసులు కూడా  అవాక్కయ్యారు..

ప్రతీకాత్మక చిత్రం

Viral News : అలా అలా మూడేళ్లు గడిచిపోయింది. రోజూ లాన్‌లో చెత్త అలా పడుతూనే ఉంది. దీంతో ఎడ్వర్డ్‌ ఆ చెత్తను చేరి సంచుల్లో ఎత్తి.. ఇంటి పరిసరాల్లో ఉంచారు.

  • Share this:

పక్కింటి వాళ్లు, ఎదురింటి వాళ్ల మీద కోపం ఉంటే... వాళ్ల ఇంట్లో చెత్త వేయడం మనం చాలా సినిమాల్లో చూశాం. అంతెందుకు నిజ జీవితంలో కూడా చూసే ఉంటారు. అయితే ఆ కోపం రెండు, మూడు రోజులు ఉంటుంది. మహా అయితే వారం ఉంటుంది. కానీ ఏకంగా ఆ కోపం మూడేళ్లు ఉంటే, అన్ని రోజులూ చెత్త వేస్తున్నా... ఎవరు వేస్తున్నారో ఆ ఇంటి ఓనర్‌కి తెలియకపోతే ఆసక్తికరంగా ఉంది కదూ. కానీ ఇది జరిగింది. ఆఖరికి పోలీసులు మాటువేసి పట్టుకుంటే ఆ పని చేసిందెవరో తెలిసి ఆ ఇంటిపెద్ద అవాక్కయ్యాడు. ఇంతకీ ఏం జరిగింది? ఎక్కడ జరిగింది?ఈ మూడేళ్లు చెత్త కార్యక్రమం జరిగింది న్యూయార్క్‌లో. ఎడ్వర్డ్ పాటన్‌ (80), చెరిల్‌ పాటన్‌ (76) అనే జంట న్యూయార్క్‌లో ఉంటారు. మూడేళ్లుగా వాళ్ల ఇంటి లాన్‌ అంచున వాడిపారేసిన కాఫీ కప్పులు, సిగరెట్‌ పీకలు, టిష్యూలు పడి ఉండటం గమనించేవారు. ఎవరో పొరపాటున వేసుంటారు అని తొలుత అనుకున్నా, తర్వాత తర్వాత రోజూ ఒకే సమయంలో ఒకే ప్రాంతంలో చెత్త పడటం గమనించారు. చుట్టుపక్కల వాళ్లు చేస్తున్నారేమో అనుకొని, ఎవరో పట్టుకుందాం అని రాత్రిళ్లు చలిలో లాన్‌లో నక్కి దాక్కుని గమనించారు, ఆ తర్వాత అక్కడే ఓ చెట్టుకు సీసీ కెమెరా కూడా పెట్టాడు. అయినా ఆ వ్యక్తి ఎవరో తెలియలేదు. ఎవరో కారులో వచ్చి వేస్తున్నట్లు గమనించారు. అయితే ఆ కారు నెంబరు మాత్రం అందులో కనిపించలేదు.

అలా అలా మూడేళ్లు గడిచిపోయింది. రోజూ లాన్‌లో చెత్త అలా పడుతూనే ఉంది. దీంతో ఎడ్వర్డ్‌ ఆ చెత్తను చేరి సంచుల్లో ఎత్తి.. ఇంటి పరిసరాల్లో ఉంచారు. ఆఖరికి ఇంటి పక్కన ఉన్నవారి సాయం తీసుకున్నాడు. వారి సాయంతో ఓరోజు కాపుకాచి చెత్త వేస్తున్న వ్యక్తి కారు నెంబరు సంపాదించి, పోలీసులకు ఇచ్చారు. దీంతో పోలీసులు తర్వాతి రోజు కాపు కాసి, ప్లాన్‌ వేసి ఆ కారులోని వ్యక్తిని పట్టుకున్నారు. తీరా ఆయన్ని చూస్తే ఎడ్వర్డ్, మరియు అతని భార్య చెరిల్‌ షాక్‌ అయ్యారు. ఎందుకంటే ఆ చెత్త వేసే వ్యక్తి వయసు 76. అతని పేరు లారీ పోప్‌. అతను చెరిల్‌తో కలసి గతంలో ట్రాన్స్‌పోర్టు కంపెనీలో పని చేసేవాడు. అప్పుడు ఇద్దరి మధ్య జరిగిన ఓ మనస్పర్థలను మనసులో పెట్టుకుని ఇలా చేశాడని పోలీసులు చెప్పారు. దీంతో మరోసారి అవాక్కవడం ఎడ్వర్డ్‌ వంతు అయ్యింది.

లారీ పోప్‌ను హాంబర్గ్‌ పోలీసులు పట్టుకున్నాక.. మళ్లీ ఎడ్వర్డ్‌ లాన్‌లో చెత్త కనిపించలేదట. ఇదంతా వింటుంటే నవ్వు వస్తుంది కానీ. 70 ఏళ్లు పైబడిన ఓ జంట రోజూ ఇలా ఎవరో వేసిన చెత్తను ఏరుకుంటూ.. ఎంత బాధపడి ఉంటారు. ఎవరు చేస్తున్నారో తెలియదు, మూడేళ్లుగా చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు అంటూ ఎంత మథనపడి ఉంటారు. అక్కడి పోలీసులు కూడా ఇదే మాట చెబుతున్నారు. ‘మేం ఎన్నో ఇరుగుపొరుగు తగాదాలు చూశాం కానీ... ఇలాంటి ఓ తగాదా చూడటం మొదటిసారి’అంటున్నారు. ఏదైతేముంది మూడేళ్ల తర్వాత ఇంటి బయటకు వచ్చిన చూస్తే మా చక్కని లాన్‌ కనిపిస్తోంది. అందులో చెత్త లేకుండా అని ఎడ్వర్డ్‌ దంపతులు చెబుతున్నారు.

Published by:Sridhar Reddy
First published: