Home /News /trending /

VIRAL NEWS FOUR MONTH OLD BABY MATEO HERNANDEZ IN THE UNITED STATES IS FACING A QUITE BIZARRE SITUATION DUE TO A RARE GENETIC CONDITION CONGENITAL HYPERINSULINISM GH SRD

Viral News: హే భగవాన్..! ఈ చిన్నారి పడుతున్న కష్టం పగవాడికి కూడా రాకూడదు..

Mateo Hernandez (Photo Credit : Face Book)

Mateo Hernandez (Photo Credit : Face Book)

Viral News: పుట్టిన మూడు నెలల్లోనే తమ బిడ్డ రెండు వ్యాధులతో పోరాడాల్సిన పరిస్థితి వచ్చిందని తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. ఈ బాలుడి పరిస్థితి గురించి తెలుసుకున్న ప్రతి ఒక్కరి గుండె తరుక్కుపోతోంది.

ప్రాణాంతక వ్యాధుల బారిన పడితే దాన్ని శాపంగా భావిస్తుంటారు. నిజానికి అన్ని వ్యాధుల్లో 90% వరకు మన నిర్లక్ష్యం వల్లే వస్తాయని వైద్యులు చెబుతుంటారు. కానీ ఒక పసిబిడ్డ పుట్టి పుట్టగానే రెండు వ్యాధుల బారిన పడ్డాడు. పుట్టిన నెల రోజుల సమయంలోనే, అతడికి ఒక ప్రాణాంతక జన్యువ్యాధి వచ్చింది. దీంతో డాక్టర్లు చికిత్స నిమిత్తం ఓ మెడిసిన్ ఇచ్చారు. దాని దుష్ప్రభావాల వల్ల ఆ బిడ్డకు మరొక అరుదైన వింత వ్యాధి వచ్చింది. దీనివల్ల బాలుడి శరీరమంతా పొడవాటి నల్ల వెంట్రుకలు పుట్టుకొచ్చాయి.ఈ ఘటన అమెరికాలోని టెక్సాస్‌లో జరిగింది. ఈ పిల్లవాడి పేరు మాటియో హెర్నాండెజ్. పుట్టిన మూడు నెలల్లోనే తమ బిడ్డ రెండు వ్యాధులతో పోరాడాల్సిన పరిస్థితి వచ్చిందని తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. ఈ బాలుడి పరిస్థితి గురించి తెలుసుకున్న ప్రతి ఒక్కరి గుండె తరుక్కుపోతోంది. కొందరు నెటిజన్లు మాత్రం ట్రోల్ చేస్తూ అందరి ఆగ్రహానికి గురి అవుతున్నారు.

టెక్సాస్‌కు చెందిన మాటియో హెర్నాండెజ్ ఒక నెల వయసులో హైపర్‌ఇన్‌సులినిజం అనే ఓ అరుదైన జన్యువ్యాధి బారిన పడ్డాడు. ఈ అరుదైన వ్యాధి కారణంగా ప్యాంక్రియాస్.. అధిక మోతాదులో ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తుంది. దీనివల్ల వ్యాధిగ్రస్తుల్లో ప్రాణాంతక స్థాయిలో బ్లడ్ షుగర్ లెవల్స్ పడిపోతాయి. ప్రతి 50 వేల మందిలో ఒకరు ఈ వ్యాధి బారిన పడుతుంటారు. అయితే తల్లిదండ్రులు మాటియోని ఆసుపత్రిలో చేర్పించి వైద్యులతో చికిత్స అందిస్తున్నారు. అదృష్టవశాత్తు బాలుడి వ్యాధి లక్షణాలు చాలా వరకు తగ్గుముఖం పట్టాయి. కానీ ఈ క్రమంలోనే ఓ వింత వ్యాధి ప్రబలింది.

హైపర్‌-ఇన్‌సులినిజం వ్యాధి చికిత్స కోసం డయాజోక్సైడ్ మందును చిన్నారికి ఇచ్చారు. కానీ ఆ మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్స్ తో చిన్నారి శరీరమంతటా నల్లని వెంట్రుకలు పొడవుగా పెరిగాయి. ప్రాణాంతక వ్యాధి లక్షణాలు తగ్గాయని సంతోషపడేలోపు మరొక వింత వ్యాధి రావడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ కొత్త వ్యాధికి చికిత్స కోసం ఆరాతీస్తున్నారు.

ఇటీవల బ్రి అనే పోలీసు అధికారి.. మాటియో ఫొటోలను టిక్‌టాక్‌లో పంచుకున్నారు. ఈ ఫొటోలు వైరల్ కాగా.. సానుభూతి చూపాల్సిన నెటిజన్లు చిన్నారిని ట్రోలింగ్‌ చేయడం మొదలుపెట్టారు. కొందరు నెటిజన్లు ఆ చిన్నారిపై సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. కానీ మరి కొందరు నెటిజన్లు నీచస్థితికి దిగజారి పిచ్చి కామెంట్స్ చేశారు. చిన్నారికి వ్యాక్సింగ్ చేయాలని ఒకరు.. హార్మోన్ల స్థాయి చెక్ చేయాలని మరొకరు.. చిన్నారిని చెత్తకుప్పలో పారేయాలని ఇంకొకరు దిగజారుడు కామెంట్స్ చేశారు. అయితే ఎవరేమనుకున్నా తనకు అనవసరమని చిన్నారి తల్లి వెల్లడించింది.
Published by:Sridhar Reddy
First published:

Tags: America, Trending, USA, VIRAL NEWS

తదుపరి వార్తలు