• Home
  • »
  • News
  • »
  • trending
  • »
  • VIRAL NEWS FLIGHT JOURNEY CANCELLED DUE TO A MAN THROWS SIX COINS INTO PLANE ENGINE REASON SHOCKS EVERY ONE FULL DETAILS HERE GH HSN

Viral News: విమానం ఇంజిన్‌లో కాయిన్స్‌ వేశాడో ప్యాసింజర్.. దెబ్బకు ఫ్లైట్ కేన్సిల్.. ఎందుకేశావయ్యా అని నిలదీస్తే అతడు చెప్పింది విని అంతా షాక్..!

విమానం ఇంజిన్ లో వేసిన కాయిన్స్ (Image Credit: Twitter)

ఓ విమానం ఇంజిన్‌లో కాయిన్స్‌ వేశాడో ప్రబుద్ధుడు. దీంతో దెబ్బకు విమాన ప్రయాణమే రద్దయింది. అతడిని పట్టుకుని ’విమానం ఇంజిన్ లో కాయిన్స్ ఎందుకు వేశావయ్యా‘ అని నిలదీస్తే చెప్పిన సమాధానం విని..

  • Share this:
ఏదైనా నదిపైన ఉన్న బ్రిడ్జి నుంచి ప్రయాణిస్తున్నప్పుడు పెద్దవాళ్లు రూపాయి బిళ్లలు, ఇతర నాణేలు వేస్తుంటారు. అలా వేస్తే మంచి జరుగుతుందని, మనసులో అనుకున్నది నెరవేరుతుందని పెద్దలు చెబుతుంటారు. కానీ ఒక విమానం ఇంజిన్‌లో కాయిన్స్‌ వేస్తే మంచిది అని భావించాడు ఒక ప్రబుద్ధుడు. ఏకంగా ఫ్లైట్ ఇంజిన్‌లో ఆరు కాయిన్స్‌ వేశాడు. దీంతో విమాన ప్రయాణమే రద్ధయింది. ఈ ఘటన చైనాలో జరిగింది. ఆ దేశంలోని షాన్‌డాంగ్ ప్రావిన్స్‌లో ఉన్న వీఫాంగ్ ఎయిర్‌ పోర్ట్‌లో.. బీబూ గల్ఫ్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన జీఎక్స్‌ 8814 ఫ్లైట్‌ ఎగరడానికి సిద్ధమైంది. ఇది వీఫాంగ్‌ నుంచి హైకూ వెళ్లాల్సి ఉంది. విమానంలో అనుమానాస్పదంగా కనిపించిన వాంగ్ అనే ప్రయాణికుడు పేపర్‌ ముక్కలను ఫ్లైట్‌ ప్రొపెల్లర్స్‌లో విసిరేశాడు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది అతడిని పోలీసులకు అప్పగించారు. ఆ తర్వాత విమానం ప్రొపెల్లర్‌లో ఆరు కాగితం ముక్కలు కనిపించాయి. వాటిని తెరచి చూస్తే.. అందులో కాయిన్స్‌ ఉన్నాయని తేలింది.

విమానంలో ప్రొపెల్లర్‌లో కాయిన్స్‌ ఎందుకు వేశావని అడిగినప్పుడు, వాంగ్‌ చెప్పిన సమాదానం అందరినీ ఆశ్చర్యపరిచింది. తొలిసారి విమానంలో ప్రయాణించినప్పుడు ఇంజిన్‌లో కాయిన్స్‌ విసిరితే మంచిదని ఎవరో చెప్పారట. అందుకే అతడు ఆరు కాయిన్స్‌ని ఎర్ర రంగు కాగితాల్లో చుట్టి ఇంజిన్‌లో వేశానని చెప్పుకొచ్చాడు. దీంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఇలాంటి మూఢనమ్మకాలు కూడా ఉంటాయా అని ముక్కున వేలేసుకున్నారు.

ఇప్పుడు ఈ కాయిన్స్‌ ఫొటోలు, దీనికి సంబంధించిన వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అయితే వాంగ్ చేసిన పనికి ప్రయాణ సమయంలో ఇంజిన్‌లో ఏదైనా సమస్య వస్తుందేమో అనే అనుమానంతో ప్రయాణాన్ని అధికారులు రద్దు చేశారు. దీంతో ఫ్లైట్‌లో వెళ్లాల్సిన 148 మంది ప్రయాణికులు ఒక రోజంతా అక్కడే గడపాల్సి వచ్చింది. వారిని అధికారులు వేరే విమానంలో గమ్య స్థానాలకు పంపించారు.

చైనాలో ఈ కాయిన్స్‌ మూఢనమ్మకం కొత్తేం కాదు. గతంలోనూ ఇలాంటి ఘటనలు వెలుగుచూశాయి. గతేడాది 28 ఏళ్ల కుర్రాడు కూడా ఇలానే విమానంలో నాణేలు వేయడం వల్ల ప్రయాణం రద్ధయింది. ఇందుకు అతడికి సుమారు రూ.12 లక్షలు జరిమానా విధించింది అక్కడి న్యాయస్థానం. ఇప్పుడు వాంగ్‌ విషయంలో కూడా ఇదే జరిగే అవకాశం ఉంది.
Published by:Hasaan Kandula
First published: