Viral News: అర్ధరాత్రి టాయిలెట్‌ నుంచి వింత శబ్దాలు.. బాత్రూం డోర్ ఓపెన్ చేసి షాక్‌ అయిన వ్యక్తి.. అందులో ఏముందంటే...

ప్రతీకాత్మకచిత్రం

Viral News: అర్ధరాత్రి నిద్రలేచిన ఒక వ్యక్తికి, ఎవరో బాత్రూంలో అదేపనిగా వాటర్ ఫ్లషింగ్ చేస్తున్నట్లు సౌండ్ వినిపించింది. ఏంటా అని బాత్రూం తలుపు తీసిన ఆ వ్యక్తి షాక్‌కు గురయ్యాడు. ఇంతకీ అతనికి ఆ బాత్రూంలో ఏమి కన్పించందో తెలుసా..?

  • Share this:
అర్ధరాత్రి గాఢ నిద్రలో ఉండగా మెలకువ వచ్చినప్పుడు.. చిన్న శబ్దాలు కూడా భయం పుట్టిస్తాయి. ఇలా అర్ధరాత్రి నిద్రలేచిన ఒక వ్యక్తికి, ఎవరో బాత్రూంలో అదేపనిగా వాటర్ ఫ్లషింగ్ చేస్తున్నట్లు సౌండ్ వినిపించింది. ఏంటా అని బాత్రూం తలుపు తీసిన ఆ వ్యక్తి షాక్‌కు గురయ్యాడు. ఇంతకీ అతనికి ఆ బాత్రూంలో ఏమి కన్పించందో తెలుసా..? సుమారు ఆరు అడుగుల పొడవైన ఒక భారీ సర్పం మరుగుదొడ్డిలో బుసలు కొడుతూ కనిపించింది. ఈ ఘటన తనకు ఒక హర్రర్ సినిమాను తలపించిందని చెబుతున్నాడు ఆ వ్యక్తి. ఆస్ట్రియా రాజధాని వియన్నా సమీపంలోని బ్రీటెన్‌ఫర్ట్ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తికి ఈ ఊహించని ఘటన ఎదురైంది. తేరుకున్న తరువాత బాత్రూంకు లాక్ వేసి అర్ధరాత్రి ఒంటి గంటకు అత్యవసర విభాగానికి అతడు ఫోన్ చేశాడు. దీంతో అగ్నిమాపక సిబ్బంది అతడి ఇంటికి చేరుకొని, ఎస్కులాపియన్ జాతి పామును పట్టుకున్నారు. ఆ తరువాత దాన్ని సమీపంలోని అడవిలో వదిలారు.

* ప్రమాదకరం కాదు కానీ..
యూరప్‌లో కనిపించే ఎస్కులాపియన్ పామును బాధితుడి ఇంటి నుంచి సంరక్షించామని తెలిపారు మోడ్లింగ్ డిస్ట్రిక్ట్ ఫైర్ బ్రిడ్గేడ్ ప్రతినిధి లుకాస్ డెర్కిట్స్. విషపూరితం కాని ఈ పాములు రెండు మీటర్ల వరకు పొడవు పెరుగుతాయని చెప్పారు. యూరప్ ఖండంలోని అతిపెద్ద సరీసృపాలలో ఈ జాతి పాములు సైతం భాగమని వివరించారు. గోడల మధ్యలో ఉండే సందుల నుంచి పాము ఫ్లషింగ్ ట్యాంకులోకి వచ్చి ఉంటుందని లుకాస్ వెల్లడించారు.

ఇది కూడా చదవండి : " డీఆర్ఎస్ = డోంట్ రివ్యూ సిరాజ్ " .. ఓయ్ కోహ్లీ కాస్తా పంత్ మాట కూడా వినవయ్యా...

* గతంలోనూ ఇలాంటి సంఘటనలు
టాయిలెట్ ఫ్లషింగ్ ట్యాంకుల్లో పాములను గుర్తించిన ఘటనలు గతంలో కూడా వెలుగుచూశాయి. గత సంవత్సరం ఒక ఆస్ట్రేలియన్ మహిళ తన టాయిలెట్ ఫ్లష్ సరిగా పనిచేయట్లేదని గుర్తించింది. దాని మూత విప్పి చూసిన తరువాత కొన్ని పాములు అందులో కనిపించాయి. దీంతో భయాందోళనకు గురైన ఆ మహిళ పాములను పట్టుకొనే విభాగానికి ఫోన్ చేసింది. ఆ ఫ్లషింగ్ ట్యాంకులో 50 సెం.మీ నుంచి ఒక మీటర్ పొడవైన పాములు ఉన్నట్లు సిబ్బంది తెలిపారు. చెట్లపై నివసించే ఆ పాములను టాయిలెట్ నుండి తీసి, సమీపంలోని పొలాల్లోకి వదిలారు.
Published by:Sridhar Reddy
First published: