Viral News : ఇదేం కొత్త రూల్ సామీ..! పెంపుడు కుక్కలకు ఆ ఆహారం ఒక్కటే పెడితే ఇక జైలుకే..!

ప్రతీకాత్మక చిత్రం

Viral News : పెంపుడు జంతువుకు ఎలాంటి ఆహారం ఇవ్వాలనేది యజమానుల ఇష్టం. విషపదార్థాలు తప్ప యజమానులు తమ పెట్స్ కి ఏ ఆహారమైనా అందించొచ్చు.

  • Share this:
సాధారణంగా ఎవరైనా మూగజీవాలను కఠినంగా హింసిస్తే చట్టపరంగా శిక్షలు విధిస్తుంటారు. మన ఇండియాలో కూడా జంతువులను హింసించే కిరాతకులను శిక్షించడానికి ప్రత్యేక చట్టాలు ఉన్నాయి. ముఖ్యంగా విదేశాల్లో జంతు సంక్షేమ చట్టాలను చాలా కఠినంగా అమలు చేస్తారు. అయితే లేటెస్ట్ గా యూకే ప్రభుత్వం శునకాల యజమానులను హెచ్చరించిన తీరు అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. శునకాలకు మాంసాహారం కాకుండా కేవలం శాకాహారమే పెట్టినా.. వాటి యజమానులను శిక్షిస్తామని హెచ్చరికలు జారీ చేసింది. వెజిటేరియన్/వేగన్ డైట్ వల్ల శునకాలకు సరైన పోషకాలు అందవని.. అందువల్ల కేవలం ఆ ఆహారం ఒక్కటే పెట్టకూడదని ప్రభుత్వం హుకుం జారీ చేసింది. ఈ విషయం తెలుసుకున్న జనాలు.. కుక్కలకు కూడా డైట్ ఫాలో అవ్వాలా అని నోరెళ్లబెడుతున్నారు.
పెంపుడు జంతువుకు ఎలాంటి ఆహారం ఇవ్వాలనేది యజమానుల ఇష్టం. విషపదార్థాలు తప్ప యజమానులు తమ పెట్స్ కి ఏ ఆహారమైనా అందించొచ్చు.

కానీ పశువైద్యులు, జంతువుల ఆహార నిపుణులు మాత్రం పెట్స్ ని ఆరోగ్యంగా, సంతోషంగా ఉంచడానికి పోషక విలువులున్న మాంసాహారం తప్పక పెట్టాలంటున్నారు. వీరి సలహాలను యూకే ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. ఈ నేపథ్యంలోనే చాలామంది తమ పెంపుడు జంతువులకు మాంసం లేని ఆహారం పెడుతున్నారని 2019 అధ్యయనం వెల్లడించింది. దాంతో ఆగ్రహించిన ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసి తగిన సలహాలు ఇచ్చిందని నివేదికలు పేర్కొంటున్నాయి. దీనితో యూకేలోని కుక్కలకు శాకాహారం వడ్డించే స్వేచ్ఛ వాటి యజమానులకు ఇకపై ఉండకపోవచ్చని తెలుస్తోంది.

నివేదికల ప్రకారం, యూకేలోని పెంపుడు జంతువుల యజమానులు తమ కుక్కలకు కేవలం శాఖాహార డైట్ మాత్రమే అందిస్తే.. వారికి జరిమానాలు లేదా జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. యూకే జంతు సంక్షేమ చట్టం ప్రకారం ప్రజలు తమ పెంపుడు జంతువులకు వాటి పోషక అవసరాలను తీర్చగల 'తగిన ఆహారం' అందించాలి. 2006 చట్టం అంతకుమించి ఎలాంటి రూల్స్ ప్రస్తావించలేదు. ముఖ్యంగా శాఖాహార ఆహారాల గురించి ప్రత్యేకంగా పేర్కొనలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఈ చట్టంలోకి కఠిన సవరణలు వచ్చి చేరబోతున్నాయని తెలుస్తోంది.

బ్రిటిష్ వెటర్నరీ అసోసియేషన్ కు చెందిన డానియెల్లా డాస్ శాంటోస్ ఈ విషయంపై స్పందించారు. "మీరు ఏ జంతు ప్రోటీన్ తినకూడదనుకుంటే, అది మీ ఇష్టం, కానీ ఆ ఆహారం మీ పెంపుడు జంతువుల సంక్షేమ ప్రమాణాలకు అనుగుణంగా లేదు. కుక్కకు శాకాహార ఆహారం ఇవ్వడం సిద్ధాంతపరంగా సాధ్యమే. కానీ కుక్కకు సరైన పోషణ అందించడం దాదాపు అసాధ్యం. ఒకవేళ అలా చేయాలంటే తరచుగా పోషకాహార నిపుణుల సలహాలు తీసుకోవాల్సి ఉంటుంది," అని ఆమె అన్నారు.

ఇది కూడా చదవండి : ఈ మహిళ వంట వండుతోందా.. ఆ వంకతో అందాలు చూపిస్తోందా?

యూకే జంతు చట్టం ఆహారంతో పాటు అనేక విషయాల్లోనూ ఆంక్షలు పెట్టింది. యజమానులు తమ పెంపుడు జంతువులు సురక్షితమైన, అనుకూలమైన వాతావరణంలో నివసించేలా ఏర్పాట్లు చేయాలని ఈ చట్టం చెబుతోంది. అలాగే వాటికి ఎలాంటి హాని తలపెట్టకుండా ఉంటూ వాటిని ఎల్లప్పుడూ సంరక్షించాలని ఈ చట్టం చెబుతోంది. ఒకవేళ పెంపుడు జంతువు యజమాని ఈ నియమాలను ఉల్లంఘిస్తే, అతను లేదా ఆమెకు 20,000 పౌండ్ల వరకు జరిమానా లేదా జైలు శిక్ష కూడా విధించవచ్చు.
Published by:Sridhar Reddy
First published: