• HOME
  • »
  • NEWS
  • »
  • TRENDING
  • »
  • VIRAL NEWS ACCIDENTALLY ITALIAN WOMAN GIVEN SIX SHOTS OF COVID VACCINE AND NEXT THIS HAPPENED GH SRD

Corona Vaccine : ద్యేవుడా..యువతికి ఆరు డోసుల కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చిన వైద్యులు..ఆమె పరిస్థితి ఎలా ఉందంటే..

Corona Vaccine : ద్యేవుడా..యువతికి ఆరు డోసుల కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చిన వైద్యులు..ఆమె పరిస్థితి ఎలా ఉందంటే..

ద్యేవుడా..యువతికి ఆరు డోసుల కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చిన వైద్యులు..ఆమె పరిస్థితి ఎలా ఉందంటే..

Corona Vaccine : ప్రపంచవ్యాప్తంగా కరోనాకు అడ్డు కట్ట వేయడానికి వ్యాక్సిన్ ప్రక్రియ కొనసాగుతోంది. మన దేశంలో కూడా వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతోంది. మన దేశంలో రెండు డోస్ లు ఇస్తున్నారు అధికారులు. అయితే, పొరపాటున..ఓ యువతికి మాత్రం ఆరు డోస్ ల కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

  • Share this:
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ (Corona Vaccinaton) కార్యక్రమం జరుగుతోంది. భారత్ లోనూ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. రెండు డోసుల టీకాను వేయించుకోవడం వల్ల కరోనా మహమ్మారి నుంచి రక్షణ పొందవచ్చనే సంగతి అందరికి తెలిసిందే. అయితే ఇటలీలో 23 ఏళ్ల యువతికి పొరపాటున ఆరు డోసులను ఒకే షాట్‌లో ఇచ్చారు. ఆ తరువాత పొరపాటును గ్రహించిన వైద్య సిబ్బంది, బాధితురాలిని హాస్పిటల్‌కు తరలించారు. కొన్ని గంటల పర్యవేక్షణ తరువాత వైద్యులు ఆమెను డిశ్చార్జ్ చేశారు. యువతికి ఫైజర్ బయోఎంటెక్ కోవిడ్-19 వ్యాక్సిన్‌ను అందించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది. ఏవైనా దుష్రభావాలు కనిపిస్తే హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తామని అధికారులు తెలిపారు.

బాటిల్ మొత్తం నింపేశారు..
ఇటలీలోని టస్కానీలో ఉన్న నోవా ఆసుపత్రిలో ఓ యువతికి సోమవారం వ్యాక్సిన్ వేశారు. ఫ్రంట్ లైన్ వర్కర్ పొరపాటున మొత్తం బాటిల్‌ను సిరంజీలో నింపారు. ఫలితంగా ఆరు డోసుల షాట్‌ను ఆమెకు ఒకేసారి ఇచ్చారని హాస్పిటల్ ప్రతినిధి డెనియల్లీ జియానెల్లి తెలిపారు. అయితే షాట్ ఇచ్చిన కొద్దిసేపటికే ఖాళీగా ఉన్న ఐదు సిరంజీలు చూసిన నర్సు.. తాను చేసిన పొరపాటును గ్రహించింది. ఆ తరువాత భారీ డోసు తీసుకున్న బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. 24 గంటల పాటు పర్యవేక్షించిన తరువాత ఆమెను డాక్టర్లు డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం ఆ యువతి ఆరోగ్యంగానే ఉందని అధికారులు వెల్లడించారు.

మానవ తప్పిదమే..
ఇది మానవ తప్పిదం వల్లే జరిగిందని డాక్టర్ జియానెల్లి స్పష్టం చేశారు. టీకా తీసుకున్న యువతి అదే ఆసుపత్రిలో సైకాలజీ విభాగంలో ఇంటర్న్‌గా పనిచేస్తుంది. అందుకే ముందుగానే వ్యాక్సిన్ తీసుకునేందుకు ఆమె అర్హత సాధించిందని తెలిపారు. వైద్య సిబ్బంది, రోగులు, బలహీనంగా ఉన్నవారిని రక్షించాలనే ఉద్దేశంతో ఇటలీ ప్రభుత్వం ఆరోగ్య కార్మికులకు, ఫార్మీసి సిబ్బందికి టీకాలు వేయడం తప్పనిసరి చేసింది. వ్యాక్సిన్ ను తిరస్కరించే హెల్త్ కేర్ కార్మికులు, రోగితో సంబంధం లేని వారికి తిరిగి కేటాయిస్తారు. అప్పుడు కూడా తిరస్కరిస్తే వారిని సస్పెండ్ చేస్తారు. టీకాలపై భవిష్యత్తులో చట్టపరమైన కేసులు వచ్చే అవకాశం కూడా ఉందని చాలా మంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Published by:Sridhar Reddy
First published: